Two Goods Trains Collided In Uttar Pradesh: ఉత్తర ప్రదేశ్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఫతేపూర్ జిల్లాలోని పంభీపూర్ సమీపంలో రెండు గూడ్స్ రైళ్లు ఒకదానితో మరొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు లోకో పైలెట్లు గాయాపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వెంటనే స్పందించిన అధికారులు ట్రాక్ ను క్లియర్ చేసే పనిలో పడ్డారు. అటు దెబ్బలు తగిలిన లోకో పైలెట్లను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. గాయాపడిన వారిని అనుజ్ రాజ్ (28), శివశంకర్ యాదవ్ (35) గా గుర్తించారు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
ఇవాళ(మంగళవారం) ఉదయం కాన్పూర్- ఫతేపూర్ మధ్య ఖాగాలో ఓ గూడ్స్ రైలు పట్టాలపై ఆగి ఉంది. అదే సమయంలో వేగంగా ఎదురుగా దూసుకొచ్చిన మరో గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో ఆగి ఉన్న రైలు కంపార్ట్ మెంట్లు పట్టాలు తప్పి చెల్లా చెదురుగా పక్కకు ఎగిరిపడ్డాయి. ఈ ప్రమాదంలో రెండు గూడ్స్ రైళ్లలోని లోకో పైలట్లు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే స్పాట్ కు చేరుకున్నారు. గాయపడిన లోకో పైలట్లను ఆసుపత్రికి తరలించారు.
ప్రమాద కారణాలపై అధికారుల ఆరా
అటు ఈ ప్రమాదంపై రైల్వే అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనే అంశంపై పరిశీలన చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సమన్వయ లోపమే కారణంగా కనిపిస్తుందని అధికారులు భావిస్తున్నారు. పూర్తి విచారణ తర్వాతే ప్రమాదానికి గల అసలు కారణాలు వెలుగులోకి వస్తాయన్నారు. ప్రమాదంలో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు ఓ ప్రత్యేక టీమ్ ను నియమించారు. వారు ప్రమాద స్థలాన్ని పరిశీలించి నష్టాన్ని అంచనా వేస్తారు. ఆ తర్వాత ప్రభుత్వానికి నివేదిక అందిస్తారని రైల్వే అధికారులు వెల్లడించారు.
Read Also: మహిళ రైల్వే ట్రాక్ దాటుతుంటగా దూసుకొచ్చిన రైలు.. ఒక్కసారిగా షాక్..
రైల్వే ట్రాక్ మీది నుంచి గూడ్స్ రైళ్ల తొలగింపు
ఇక ప్రమాదానికి గురైన గూడ్స్ రైళ్లను తొలగించే పనిలో పడ్డారు అధికారులు. వీటిని తొలగించిన తర్వాత ట్రాక్ ను సరిచేసి రైల్వే సేవలను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. కొద్ది గంటల పాటు ఈ రూట్ లో రాకపోకలకు కాస్త ఇబ్బందులు తప్పవన్నారు. వీలైనంత త్వరగా ట్రాక్ ను క్లియర్ చేసి సర్వీసులను పునరుద్ధరిస్తామని చెప్పారు. అటు ఈ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రైలు కంటెయినర్లు పడిన విధానాన్ని గమనిస్తుంటే, గూడ్స్ రైలు బలంగా వచ్చి తగిలినట్లు కనిపిస్తున్నది. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం పల్ల అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. త్వరలోనే ఈ ప్రమాదానికి గల అసలు కారణాలను రైల్వే అధికారులు వెల్లడించే అవకాశం ఉంది.
Read Also: రైల్వే ట్రాక్ మీదికి దూసుకొచ్చిన కారు, అదెలా సాధ్యం రా?
Read Also: లక్కీ అంటే నీదే గురూ.. రైలు నేరుగా వచ్చి ఢీకొట్టినా..