E-Paper
Advertisement

“బిందెల బిందెలు బావయ్యో”.. మరో ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన మాధురీ రాథోడ్!

“బిందెల బిందెలు బావయ్యో”.. మరో ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన మాధురీ రాథోడ్!
Advertisement

Madhuri Rathod: మాధురీ రాథోడ్.. హైదరాబాద్ కి చెందిన ప్రముఖ తెలుగు జానపద నృత్యకారిణి, డిజిటల్ కంటెంట్ సృష్టికర్త, మోడల్ గా భారీ పాపులారిటీ తెచ్చుకున్న ఈమె బంజారా సాంస్కృతిక , నృత్య ప్రదర్శనలు, టెలివిజన్ కార్యక్రమాలకు మరింత ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా జానపద పాటలతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటున్న ఈమె.. నిమ్మ తోట వనములో, సీటీ చీర, బాసింగ బలాలు వంటి ఎన్నో ఫోక్ సాంగులతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

మరో ఫోక్ సాంగ్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్న మాధురీ రాథోడ్..

వరుస ఆల్బమ్ సాంగ్లతో దూసుకుపోతూ.. స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న సమయంలో అనూహ్యంగా తన తోటి డాన్సర్ ఈశ్వర్ సాయితో ఏర్పడిన వివాదం కారణంగా ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది మాధురీ రాథోడ్. అంతేకాదు ఆత్మహత్యాయత్నం వరకు వెళ్లిన ఈమె మళ్లీ గట్టి కం బ్యాక్ ఇవ్వబోతుందని చెప్పాలి. తాజాగా “బిందెలు బిందెలు బావయ్యో ” అనే మరో ఫోక్ సాంగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమైంది. ఈ పాటకు సంబంధించిన గ్లింప్స్ ని తాజాగా విడుదల చేయగా.. అప్పుడే సోషల్ మీడియాలో ఈ గ్లింప్స్ తెగ వైరల్ గా మారింది.

ఆకట్టుకుంటున్న గ్లింప్స్..

Advertisement

మాధురీ రాథోడ్ వెనక ఎవరు, ఎన్ని కుట్రలు పన్నినా ఆమెను ఎవరు ఏం చేయలేరు.. ఆమె రెట్టింపు వేగంతో మళ్ళీ దూసుకొస్తోంది అంటూ ఈ గ్లింప్స్ చూసిన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఎప్పటిలాగే ఇందులో అంతే మాస్ ఎనర్జిటిక్ లెవెల్స్ తో మరొకసారి అందరినీ ఆశ్చర్యపరిచింది మాధురీ రాథోడ్. త్వరలోనే ఈ ఆల్బమ్ సాంగ్ విడుదల చేయబోతున్నారు.. ఏది ఏమైనా మాధురి రాథోడ్ ఇప్పుడు మళ్లీ రెట్టింపు జోష్ తో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్న ఈ ఫోక్ సాంగ్ సోషల్ మీడియాలో ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుంటుందో చూడాలి..

ఈశ్వర్ సాయితో వివాదం..

విషయంలోకి వెళ్తే.. మాధురి రాథోడ్ తనతో పాటు ఫోక్ సాంగ్స్ తో మెప్పించిన తోటి డాన్సర్ ఈశ్వర్ సాయితో ఒక గదిలో రెడ్ హ్యాండెడ్గా ఈశ్వర్ సాయి భార్యకు పట్టుబడ్డారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లు, సోషల్ మీడియాలో విమర్శలు అన్నీ ఎదుర్కొన్నారు. ఈశ్వర్ సాయి, మాధురీ రాథోడ్ కు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. కానీ మాధురీ రాథోడ్ ఈశ్వర్ సాయి తనను పెళ్లి చేసుకుంటానని మానసికంగా, శారీరకంగా వాడుకున్నాడు.. తనకు పోలీసులు న్యాయం చేయలేదు అంటూ ఆత్మహత్యాయత్నం కూడా చేసింది.

ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ కాంబినేషన్లో వచ్చిన పాటలు..

Advertisement

తెలంగాణ జానపదం, పల్లెటూరి వాతావరణం, తెలంగాణ యాసతో వీరి పాటలు తక్కువ సమయంలోనే సూపర్ క్రేజ్ అందుకున్నాయి.. అసలు వీళ్ళిద్దరూ విడివిడిగా చేసిన పాటల కంటే వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన పాటలకు విపరీతమైన ఆదరణ లభించింది. ముఖ్యంగా రాతిరి రాతిరి రాతిరిలో, సిటి చీర , సన్న సన్న బియ్యమే, ప్రమీల ప్రమీల , కళ్ళకు కాటుక దిద్దినారో , అది అబ్బబ్బాగా పోరి, లాయి లాయి లబ్బరు బొమ్మ, బాసింగా బలాలే ఇలా ఎన్నో పాటలు వీళ్ళ కాంబినేషన్లో వచ్చాయి. చివరిగా బాసింగ బలాలే పాట ట్రెండింగ్ లోకి వచ్చిన తర్వాతే మాధురీ రాథోడ్ చిక్కుల్లో ఇరుక్కోవడం గమనార్హం.

https://www.instagram.com/stories/madhuri_rathod8/4001699089481327455?utm_source=ig_story_item_share&stkn=cjZ1eTM1eTMxZjcx

 

Related News

పండును ఈ పరిస్థితుల్లో చూస్తే కన్నీళ్లు ఆగవు.. మళ్లీ డ్యాన్స్ చేయగలడా? రికవరీకి ఎంత టైమ్?

బిగ్ బాస్ 10 5వ వారం నామినేషన్ లిస్ట్.. డేంజర్ జోన్ లో ఆ ఇద్దరే!

Nindu Noorella Saavasam Serial Today Episode October 6th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మనోహరి, పార్థును చంపకుండా అమర్ అడ్డుకుంటాడా..? 

Karthika Deepam 2 Serial Today Episode October 6th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ తో జ్యోత్స్న పెళ్లి చేస్తానన్న దీప              

హేటర్స్ కి అనసూయ దిమ్మతిరిగే రియాక్షన్!

బిగ్ బాస్ 10లో నామినేషన్స్ సెగలు.. ఆమెపై విరుచుకుపడ్డ కంటెస్టెంట్స్!

చంపేయ్ దేవుడా.. నరకం భరించలేకపోతున్నా – సుప్రీత

Big Stories

Advertisement
×