E-Paper
Advertisement

ఫ్లిప్‌కార్ట్‌లో ఊహించని ఆఫర్.. Oppo Find X9పై ఏకంగా రూ. 22,220 డిస్కౌంట్!

ఫ్లిప్‌కార్ట్‌లో ఊహించని ఆఫర్.. Oppo Find X9పై ఏకంగా రూ. 22,220 డిస్కౌంట్!
Advertisement

Oppo Find X9 Price Drop: తక్కువ బడ్జెట్‌లో ఒక మంచి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే.. ‘ఒప్పో ఫైండ్ X9’పై ఉన్న ఈ క్రేజీ ఆఫర్ మీ కోసమే. మార్కెట్లో ఈ ఫోన్ అసలు ధర రూ.84,999 కాగా, ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. పవర్‌ఫుల్ ప్రాసెసర్, సూపర్ కెమెరా సెటప్, అదిరిపోయే బ్యాటరీ లైఫ్‌తో వస్తున్న ఈ హాండ్‌సెట్‌పై ఎలాంటి డీల్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

ఈ Oppo Find X9 ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో నేరుగా రూ.22,220 ఫ్లాట్ డిస్కౌంట్‌తో కేవలం రూ.62,779 వద్ద లభిస్తోంది. ఇది మాత్రమే కాకుండా.. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఇఎమ్‌ఐ లావాదేవీలపై అదనంగా రూ.3,139 వరకు పొదుపు చేయవచ్చు. ఒకవేళ మీ దగ్గర పాత స్మార్ట్‌ఫోన్ ఉంటే.. ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా ఈ ఫోన్ ధరను మరింత తగ్గించుకునే అవకాశం ఉంది.

Advertisement

Also Read: ఫ్రిడ్జ్ కొనేముందు ఇవి తెలియకపోతే తప్పులో కాలేసినట్లే.. రూ.30,000 లోపు బెస్ట్ మోడల్స్ ఇవే!

Oppo Find X9 ఫోన్ 6.59-ఇంచుల 1.5K అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 3,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కి సపోర్ట్ చేస్తుంది. స్క్రీన్ రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2ని అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 9500 చిప్‌సెట్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్ గేమ్స్ ఆడేటప్పుడు, మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు చాలా స్మూత్‌గా పనిచేస్తుంది.

Advertisement

ఇందులో 7,025mAh భారీ బ్యాటరీ ఉంది. దానికి తోడు 80W వైర్డ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. అలాగే 10W రివర్స్ ఛార్జింగ్ సౌకర్యం కూడా ఉంది. ఇక కెమెరాల విషయానికి వస్తే.. వెనుక వైపు 50MP మెయిన్ కెమెరా, 50MP ఆల్ట్రావైడ్, 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందర 32MP కెమెరాని అందించారు.

అద్భుతమైన కెమెరా, రోజంతా నిలిచే బ్యాటరీ, ఆకట్టుకునే డిజైన్ ఉన్న ఫోన్ కావాలనుకునే వారికి Oppo Find X9 సరైన ఎంపిక. రోజువారీ వాడకానికి ఈ ఫోన్ చాలా బాగుంటుంది. ఇంతటి ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను ఈ రేంజ్ డిస్కౌంట్‌తో సొంతం చేసుకోవడం నిజంగా మంచి అవకాశమనే చెప్పాలి.

Also Read: ఏడాది వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ డేటా, OTT బెనిఫిట్స్.. జియో, Vi, ఎయిర్‌టెల్ టాప్ ప్లాన్స్ ఇవే!

Tags

Related News

బడ్జెట్‌ ధరలో ఇంట్లోనే 200 అంగుళాల సినిమా హాల్.. మార్కెట్లోకి కొత్త ఆండ్రాయిడ్ 14 ప్రొజెక్టర్!

ఫ్లాగ్‌షిప్ ఫోన్ల రేంజ్‌కు OPPO Reno 16 5G ధర.. భారీగా పెరిగిన విడిభాగాల భారం!

బాబోయ్.. శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై రూ.26,500 దాకా తగ్గింపా? అమెజాన్‌లో మైండ్ బ్లోయింగ్ డీల్!

ఫ్రిడ్జ్ కొనేముందు ఇవి తెలియకపోతే తప్పులో కాలేసినట్లే.. రూ.30,000 లోపు బెస్ట్ మోడల్స్ ఇవే!

మొబైల్ కవర్ కొనే.. ముందు ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

ఫోన్ మీ మాటలన్నీ రహస్యంగా వింటుందా? ఇలా తెలుసుకోండి

లాప్‌టాప్ ఎక్స్‌పైరీ డేట్..ఎన్ని ఏళ్ల తర్వాత ల్యాప్‌టాప్ మార్చాలి ?

Big Stories

Advertisement
×