E-Paper
Advertisement

మోస్ట్ ట్రెండింగ్ ఫోన్.. HD+ స్క్రీన్, 7,000mAh బ్యాటరీ, 50MP కెమెరా.. బడ్జెట్‌లో ది బెస్ట్ భయ్యా!

మోస్ట్ ట్రెండింగ్ ఫోన్.. HD+ స్క్రీన్, 7,000mAh బ్యాటరీ, 50MP కెమెరా.. బడ్జెట్‌లో ది బెస్ట్ భయ్యా!
Advertisement

OPPO K14 5G: ఈ ఏడాది మార్కెట్ లో కుప్పుతెప్పలుగా నయా స్మార్ట్ ఫోన్లు విడుదల అయ్యాయి. ప్రముఖ స్మార్ట్ కంపెనీలు.. లేటెస్ట్ ఫీచర్లతో అధునాతన మెుబైల్స్ ను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చాయి. అయితే బడ్జెట్ లో మంచి ఫోన్ కొనాలని భావిస్తున్నవారు.. వాటిలో ఏది ఎంచుకోవాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారు. అలాంటి వారికి OPPO K14 5G స్మార్ట్ ఫోన్ బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తోంది. భారీ బ్యాటరీ, ఆకర్షణీయమైన డిజైన్, స్మూత్ పెర్ఫార్మెన్స్ తో యూజర్లను ఆకట్టుకుంటోంది. కాబట్టి ఈ ఫోన్ కు సంబంధించి ప్రధాన ఫీచర్లు, ధర వివరాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

భారీ బ్యాటరీ..

OPPO K14 5G స్మార్ట్ ఫోన్ లో బ్యాటరీ విభాగం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇది ఏకంగా 7,000mAh భారీ బ్యాటరీతో మార్కెట్ లోకి వచ్చింది. 45W సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ను దీనికి అందించారు. ఒకసారి ఛార్జ్ చేస్తే 2 రోజులపాటు ఎలాంటి అంతరాయం లేకుండా ఈ ఫోన్ ను వాడుకోవచ్చని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి.

నాణ్యమైన డిస్ ప్లే..

Advertisement

ఈ ఒప్పో బడ్జెట్ ఫోన్.. 6.75-అంగుళాల HD+ ఎల్‌సీడీ స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్ తో వచ్చింది. దీనికి 1,125 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ అందించారు. రోజూవారి వినియోగానికి, సినిమాలు చూడటం, గేమ్స్ ఆడటం వంటి వాటికి ఈ ఫోన్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అధిక బ్రైట్ నిస్ ను ఇవ్వడం వల్ల ఎండలోనూ స్క్రీన్ స్పష్టంగా కనిపించనుంది.

పవర్ ఫుల్ ప్రాసెసర్..

ఇందులో పవర్ ఫుల్.. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్ సెట్ ను అమర్చారు. సోషల్ మీడియా బ్రౌజింగ్, సాధారణ గేమింగ్ కు ఇది సరిగ్గా సరిపోతోంది. అంతేకాకుండా ఈ ఒప్పో ఫోన్ లో ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15 ఆపరేటింగ్ సిస్టమ్ ఫిక్స్ చేశారు. వీటి సాయంతో ఫోన్ స్మూత్ గా పనిచేస్తుందని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.

కెమెరా క్వాలిటీ..

Advertisement

బడ్జెట్ లోనే ఈ ఒప్పో ఫోన్ ను తీసుకొచ్చినప్పటికీ.. నాణ్యమైన కెమెరా సెటప్ ను దీనికి అందిచడం విశేషం. ఫోన్ వెనుక భాగంలో 50MP ప్రైమరీ AI కెమెరా , 2MP మోనోక్రోమ్ సెన్సార్ ను అమర్చారు. అలాగే ముందువైపు సెల్ఫీల కోసం 8MP ఫ్రంట్ కెమెరాను అందించారు. ప్రైమరీ కెమెరాలో AI ఫోటో రీటచింగ్, ఎరేజర్ వంటి ఆధునిక స్మార్ట్ ఫీచర్లను సైతం అందించడం గమనార్హం.

మిలటరీ గ్రేడ్ రక్షణ

తక్కువ బడ్జెట్ లో చాలా అరుదుగా కనిపించే IP69 రేటింగ్ ను ఈ ఫోన్ కు ఇచ్చారు. ఇది నీరు, దమ్ము, దూళి నుంచి ఫోన్ ను రక్షిస్తుంది. దీంతో పాటు మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ దీనికి ఉంది. కాబట్టి ఇది కింద పడినా, నీటిలో తడిసినా ఈ ఫోన్ తట్టుకోలగలదు.

Also Read: షావోమీ మైండ్ బ్లోయింగ్ ఏసీ లాంచ్.. మనుషులు ఎక్కడ ఉన్నారో.. గుర్తించి మరీ కూలింగ్!

ధర ఎంతంటే?

OPPO K14 5G స్మార్ట్ ఫోన్ మెుత్తం 3 స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తోంది. స్టోరేజ్ సామర్థ్యాన్ని బట్టి ధరను నిర్ణయించారు. రూ.17,999, రూ.19,999, రూ.21,999 ధరల్లో ఈ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు. రూ.20,000 బడ్జెట్ లో ఎక్కువ కాలం మన్నికగా ఉండే ఫోన్ కోరుకునేవారు దీనిని నిరభ్యంతరంగా తీసుకోవచ్చని టెక్ నిపుణులు సైతం సూచిస్తున్నారు. ఫ్లిప్ కార్ట్, ఒప్పో ఆన్ లైన్, ఆఫ్ లైన్ స్టోర్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

Also Read: Table Fans 2026: వేసవిలో కూల్‌గా ఉంచే.. అత్యుత్తమ టేబుల్ ఫ్యాన్లు.. సుడిగాలి ఫీలింగ్ పక్కా!

Related News

iPhone 17 యూజర్లు ఈ రెండు సెట్టింగ్స్ మార్చితే.. ఆఫీస్ పని చిటికెలో అయిపోతుంది!

రూ.17 వేలకే లెనోవో క్రోమ్‌బుక్..ఆన్‌లైన్ క్లాసులకు అదిరిపోయే ఆప్షన్!

కార్ & ఇల్లు శుభ్రం చేసే మినీ వాక్యూమ్ క్లీనర్..ఫీచర్లు అదుర్స్!

వామ్మో.. ఫేస్ అన్‌లాక్ విషయంలో ఐఫోన్, ఆండ్రాయిడ్ మధ్య ఇంత తేడా ఉందా?

ఈ ఏసర్ ఆస్పైర్ లైట్ ఫీచర్లు చూస్తే..కొనకుండా ఉండలేరు తెలుసా ?

వాట్సాప్ ఆటోమేటిక్ డౌన్‌లోడ్‌తో విసిగిపోయారా? ఇలా చేస్తే ఆ సమస్యే ఉండదు!

రూ.2,300 కే 50W డీజే బాక్సా? ఈ స్పీకర్ సౌండ్‌కి పక్కింటి వాళ్లు కూడా డ్యాన్స్ లేయాల్సిందే!

వేడి నీళ్లలో ముంచినా చెక్కుచెదరదు.. హానర్ నుంచి అసాధారణ ఫీచర్లతో సరికొత్త ఫోన్!

Big Stories

Advertisement
×