Oppo K14 Plus: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో నుంచి ఒక సరికొత్త హ్యాండ్‌సెట్ భారత మార్కెట్లోకి వచ్చేసింది. అదే ఒప్పో K14 ప్లస్. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా లభిస్తున్న ఈ ఫోన్.. భారీ బ్యాటరీ, అదిరిపోయే పర్ఫార్మెన్స్‌తో వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. రోజంతా ఛార్జింగ్ టెన్షన్ లేకుండా ఫోన్ వాడాలనుకునేవారికి.. ఇదొక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.
ఈ Oppo K14 Plusఫోన్ 6.77 అంగుళాల పెద్ద డిస్‌ప్లేతో వస్తుంది. క్రిస్ప్ 1.5K రెజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్ వల్ల వీడియోలు చూడటం, గేమింగ్ ఆడటం చాలా స్మూత్‌గా ఉంటుంది. ఇక ఈ డివైస్ సోలార్ ఆరెంజ్, స్టార్ వైట్ అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది. చేతిలో పట్టుకోవడానికి కూడా ఫోన్ చాలా ప్రీమియంగా కనిపిస్తుంది.
దీనిలో అత్యంత ప్రధానమైన ఫీచర్ 8,000mAh భారీ బ్యాటరీ. దీన్ని వేగంగా ఛార్జ్ చేయడానికి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. అలాగే 10W రివర్స్ ఛార్జింగ్ ద్వారా ఇతర పరికరాలను కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 7360 మాక్స్ ప్రొసెసర్‌తో ఇది నడుస్తుంది. కాబట్టి.. ఎలాంటి ల్యాగ్ లేకుండా మల్టీటాస్కింగ్ చేసుకోవచ్చు.
ఫోన్ వెనుక వైపు OIS సపోర్ట్‌తో 50MP మెయిన్ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. చేతులు వణికినా ఫొటోలు చాలా క్లియర్‌గా వస్తాయి. ముందు వైపు సెల్ఫీల కోసం 16MP కెమెరా ఇచ్చారు. ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్ OS 16తో పనిచేస్తుంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.
ఈ ఫోన్ 6GB+128GB వేరియంట్ ధర రూ.29,999, 8GB+128GB వేరియంట్ రూ.32,999 మరియు 8GB+256GB వేరియంట్ రూ. 35,999గా నిర్ణయించారు. అయితే ప్రముఖ బ్యాంక్ కార్డ్స్ వాడితే రూ.4,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో వీటి ధరలు వరుసగా రూ.25,999, రూ.28,999, రూ.31,999కి తగ్గుతాయి. 6 నెలల నో-కాస్ట్ EMI సౌకర్యం కూడా ఉంది.