E-Paper
Advertisement

భయపడితే ముందుకు వెళ్లలేం… కత్రినా కైఫ్ కామెంట్స్ వైరల్!

భయపడితే ముందుకు వెళ్లలేం… కత్రినా కైఫ్ కామెంట్స్ వైరల్!
Advertisement

Katrina Kaif: కత్రినా కైఫ్ మల్లీశ్వరి వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిని దోచుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల కత్రినా కైఫ్ బిడ్డకు జన్మనివ్వడంతో ఈమె ఇండస్ట్రీకి చిన్న బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇలా సినిమాలకు దూరంగా ఉన్న కత్రినా కైఫ్ సోషల్ మీడియాకి కూడా కాస్త దూరమయ్యారు. అయితే ఇటీవల ఈమె వినాయక చవితి సెలబ్రేషన్స్ లో భాగంగా అంబానీ ఇంట్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే డెలివరీ తర్వాత మొదటిసారి కత్రినా బయటకు రావడంతో ఈమె పై భారీ స్థాయిలో విమర్శలు వచ్చాయి.

ఆత్మగౌరవం దెబ్బతీసేలా ఉండకూడదు..

ఈ విధంగా కత్రినా కైఫ్ పట్ల బాడీ షేమింగ్ కామెంట్స్ రావడంతో ఎంతోమంది సెలబ్రిటీలు కత్రినా కైఫ్ కు మద్దతుగా నిలిచారు. ఇకపోతే తాజాగా సోషల్ మీడియాలో వచ్చే విమర్శలు గురించి కత్రినా కైఫ్ లండన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. లండన్‌లో కత్రినా కైఫ్ తన బ్రాండ్ Kay Beauty వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సోషల్ మీడియాలో వస్తున్న విమర్శల గురించి మాట్లాడుతూ..సోషల్ మీడియాలో వచ్చే విభిన్నమైన అభిప్రాయాలు మన విలువను లేదా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా చూసుకోకూడదు. అందరినీ మెప్పించాలని చూస్తే, మనకు నచ్చిన నిర్ణయాలు మనం తీసుకోలేమనీ తెలిపారు.

మనల్ని మనమే ప్రోత్సహించుకోవాలి..

Advertisement

గతంలో తాను కూడా తన గురించి ఎవరైనా విమర్శిస్తే వాటిని పట్టించుకొని ఉంటే భయంతో తాను ఎప్పుడో ఆగిపోయే దాన్ని, జీవితంలో ముందుకు వెళ్లే దాన్ని కాదేమో అని అభిప్రాయపడ్డారు. మనల్ని కూడా మెచ్చుకునే రోజులు ఉంటాయని మనల్ని మనమే ప్రోత్సహించుకోవాల్సిన సమయాలు కూడా ఉంటాయని కత్రినా కైఫ్ తెలిపారు. మనం ఎలా ఉన్నా కూడా మనల్ని మనం ప్రేమించుకోవాలి జీవితంలో ఎప్పుడు ఒకేలా ఉండమని కొన్నిసార్లు మంచి రోజులు వస్తే మరి కొన్నిసార్లు ఇబ్బందికరమైన రోజులు కూడా వస్తాయని తెలిపారు .

మన లక్ష్యాలపై దృష్టి సారించలేము..

ఇలా సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరి అభిప్రాయానికి మనం స్పందిస్తే మన లక్ష్యాలపై దృష్టి సారించాలేమని తెలిపారు. మన గురించి ఇతరులు మాట్లాడే మాటల ప్రభావానికి లోను కాకూడదని మన ఆలోచనలకు అనుగుణంగా ముందుకు సాగాలని తెలిపారు. ఇతరుల కామెంట్లకు అధికంగా ప్రాధాన్య కల్పిస్తే మన నిర్ణయాలు , మన జీవితంపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయని తెలిపారు. ఇలా సోషల్ మీడియాలో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తే జీవితంలో భయపడి ముందుకు వెళ్లలేమంటూ కత్రినా కైఫ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Advertisement

Also Read: బిగ్ బాస్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్న శివకుమార్… రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Related News

సుమలతకి అనుకూలంగా హైకోర్టు.. అసోసియేషన్ ఎన్నికలకు బ్రేక్!

మరో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన మమితా బైజు.. ‘జై హనుమాన్’లో కీ రోల్!

‘కామ్రెడ్ కళ్యాణ్’ మూవీ ట్విట్టర్ రివ్యూ.. శ్రీవిష్ణు హిట్ కొట్టాడా..?

నానా పటేకర్ ఒక దుష్టుడు.. బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్, తిట్టి పోస్తున్న జనం!

విజయ్ దేవరకొండ ‘రణబాలి’ మూవీ ట్రైలర్ రిలీజ్!

‘ రామాయణ’ చిత్ర నిర్మాత ఆఫీసులపై ఐటీ దాడులు!

హీరో అర్జున్ కూతురు వివాహం ఫిక్స్.. ఎప్పుడంటే..?

Big Stories

Advertisement
×