E-Paper
Advertisement

మార్కెట్‌లోకి కొత్త హెడ్ ఫోన్..ఫీచర్లు తెలిస్తే షాక్ అవడం గ్యారంటీ !

మార్కెట్‌లోకి కొత్త హెడ్ ఫోన్..ఫీచర్లు తెలిస్తే షాక్ అవడం గ్యారంటీ !
Advertisement

Sennheiser Momentum 5: ప్రముఖ ఆడియో బ్రాండ్ సెన్‌ హైజర్ మార్కెట్లోకి తీసుకొచ్చిన కొత్త హెడ్‌ ఫోన్ ఆడియో లవర్స్‌ను ఎంత గానో ఆకట్టుకుంటోంది. మార్కెట్లో ఇప్పటివరకూ సోనీ , బోస్ బ్రాండ్లు ప్రీమియం వైర్‌ లెస్ హెడ్‌ ఫోన్ల సెగ్మెంట్‌ను శాసిస్తూ వచ్చాయి. అయితే.. వాటి ఆధిపత్యానికి గట్టి చెక్ పెట్టేలా సరి కొత్త ఫీచర్లు, అద్భుత మైన సౌండ్ క్వాలిటీతో.. వస్తున్న ఈ కొత్త మోడల్ ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. అసలు ఈ హెడ్‌ ఫోన్ సోనీ, బోస్ మోడళ్లకు ఎంతవరకు  పోటీ ఇస్తుంది? దీని ప్రత్యేకతలు ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

పూర్తి ఫీచర్లు:

సౌండ్ క్వాలిటీ, డ్రైవర్లు:

ఇందులో పవర్ ఫుల్ 42mm డైనమిక్ డ్రైవర్లను వాడారు. డాల్బీ అట్మాస్, హెడ్ ట్రాకింగ్ సపోర్ట్ ఉండటం వల్ల పాటలు వింటున్నప్పుడు థియేటర్ ఫీల్ కలుగుతుంది. అవతే కాకుండా దీని బేస్ చాలా క్లియర్‌గా ఉండి వోకల్స్ స్పష్టంగా వినిపిస్తాయి.

యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ :

Advertisement

అడాప్టివ్ ANC టెక్నాలజీతో కూడిన ఈ హెడ్‌ ఫోన్ బయటి సౌండ్‌లను సమర్థవంతంగా అడ్డుకుంటుంది. విమాన ప్రయాణాలు లేదా రద్దీగా ఉండే ఆఫీసుల్లో ఇది చాలా బాగా పని చేస్తుంది.

బ్యాటరీ బ్యాకప్:

ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ANC ఆన్‌లో ఉన్నప్పటికీ దాదాపు 57 గంటల పాటు నాన్‌ స్టాప్ మ్యూజిక్ ఎంజాయ్ చేయెచ్చు. అంతేకాదు.. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో గంటల తరబడి ప్లేటైమ్‌ లభిస్తుంది.

కనెక్టివిటీ:

Advertisement

ఇది బ్లూటూత్ 5.4 సపోర్ట్‌తో పాటు మల్టీ పాయింట్ కనెక్షన్‌ను కలిగి ఉంది. వైర్డ్ కనెక్షన్ కావాలనుకునే వారికి యూఎస్‌బీ-సీ, 3.5mm ఆడియో జాక్ ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

Also  Read:  మీ ఇంటికి సరైన వాషింగ్ మెషీన్ కొనడానికి ఇదే బెస్ట్ టైమ్..సేల్ ఆఫర్లు ఇవిగో! 

ధర:

ప్రపంచ మార్కెట్లో దీని ధర సుమారు $399.95 (ఇండియన్ కరెన్సీలో రూ.29,990 నుంచి ప్రారంభం)గా ఉంది. సోనీ , బోస్ ఫ్లాగ్‌షిప్ మోడళ్లతో పోలిస్తే ఇది కొద్దిగా తక్కువ ధరకే లభిస్తుండటం విశేషం.

మీరు బెస్ట్ సౌండ్ క్వాలిటీ, ఎక్కువ బ్యాటరీ లైఫ్ కోరుకునే వారైతే సోనీ, బోస్‌లకు గట్టి ఫోటీ ఇస్తున్న ఈ కొత్త మోడల్ మీకు చక్కటి ఆఫ్షన్ అని చెప్పొచ్చు. నచ్చితే ఈ మోడల్ తప్పకుండా ఆర్డర్ చేసుకోండి.

Related News

ఇలాంటి ఫీచర్లు ఈ ధరలో సాధ్యమేనా? Oppo K14 Plus ఫీచర్లపై ఓ లుక్కేయండి!

వాట్సప్‌లో ఇప్పటివరకు లేని క్రేజీ ఫీచర్.. ఇక బర్త్‌డేలు, ఆన్‌లైన్ స్టేటస్ నేరుగా అక్కడే!

మీ ఇంటికి సరైన వాషింగ్ మెషీన్ కొనడానికి ఇదే బెస్ట్ టైమ్..సేల్ ఆఫర్లు ఇవిగో!

రూ.9,999 ఇయర్‌బడ్స్ ఇప్పుడు రూ.2,999కే.. అమెజాన్ సేల్‌లో అద్భుతమైన డీల్!

ఐఫోన్ వీడియోల్లో బ్యాక్‌గ్రౌండ్ సౌండ్ కంట్రోల్ చేయొచ్చు.. ఈ ఫీచర్ గురించి తెలుసా?

యాపిల్ లవర్స్‌కు ఇది కదా కావాల్సింది.. iPhone 17 Proపై ఏకంగా రూ.78,000 తగ్గింపు!

క్యూఆర్ కోడ్ వైపు చూస్తే చాలు.. జియో ఏఐ గ్లాసెస్‌తో పేమెంట్స్ సక్సెస్!

Big Stories

Advertisement
×