Oppo Reno 14 Pro 5G vs iPhone 16e| అప్పర్ మిడ్ రేంజ్ మార్కెట్‌లో ఐఫోన్ 16e ఆధిపత్యం చెలాయిస్తోంది. అయితే ఒప్పో రెనో 14 ప్రో 5G ఎంట్రీతో ఐపోన్ 16eకి గట్టి పోటీ కనిపిస్తోంది. సరసమైన ధరలో అద్భుతమైన ఫీచర్లను ఒప్పో రెనో 14 ప్రో 5G అందిస్తుంది. అయితే ఐఫోన్ 16e ఆపిల్ ప్రీమియం క్వాలిటీ, ఆపిల్ ఎకోసిస్టమ్‌తో వస్తుంది.
అందుకే ఈ రెండు ఫోన్‌లు కూడా అప్పర్ మిడ్-రేంజ్ విభాగంలో పవర్ ఫుల్ ఆప్షన్స్. ఒప్పో రెనో 14 ప్రో 5G ధర ₹49,999. ఇందులో అద్భుతమైన కెమెరాలు, పెద్ద AMOLED డిస్‌ప్లే, మంచి ప్రాసెసర్ ఉన్నాయి. ఐఫోన్ 16e, ₹59,990 ధరతో.. ఆపిల్ A18 చిప్, గొప్ప కెమెరాతో వస్తుంది. ఈ రెండింటిలో ఏది కొనుగోలు చేయాలో నిర్ణయించుకునే ముందు వీటి ఫీచర్లను ఒకసారి పోల్చి చూద్దాం.
డిజైన్, డిస్‌ప్లే
ఒప్పో రెనో 14 ప్రో 5G ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంది. ముఖ్యంగా వెనుకవైపు రంగు మారే గ్లాస్, అల్యూమినియం ఫ్రేమ్‌తో 7.5mm సన్నని శరీరం ఉంది. దీని బరువు 201 గ్రాములు. ఐఫోన్ 16e కూడా గ్లాస్, అల్యూమినియంతో ప్రీమియం లుక్‌ను అందిస్తుంది. కానీ 167 గ్రాముల బరువుతో సౌకర్యవంతంగా పట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.
డిస్‌ప్లే విషయంలో.. ఒప్పో రెనో 14 ప్రో 5G క్లియర్ విన్నర్ అనే చెప్పాలి. ఎందుకంటనే ఇందులో ఉన్న 6.83-అంగుళాల LTPS AMOLED డిస్‌ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్ 1.5K రిజల్యూషన్‌తో అందిస్తుంది. రెండు ఫోన్‌లు 1200 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను కలిగి ఉన్నాయి. కానీ ఐఫోన్ 16eలో 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే 60Hz రిఫ్రెష్ రేట్‌తో ఉంటుంది.
కెమెరా పోలిక
ఒప్పో రెనో 14 ప్రో 5Gలో ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ ఉంది. ఇందులో 50MP ప్రధాన కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరా, 3.5x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా కూడా 50MP, ఇది అద్భుతమైన సెల్ఫీలను అందిస్తుంది. ఈ కెమెరా సిస్టమ్ జూమ్, వైడ్-యాంగిల్ ఫోటోలలో శక్తివంతంగా ఉంటుంది.
ఐఫోన్ 16eలో 48MP సింగిల్ రియర్ కెమెరా 2x ఇన్-సెన్సార్ జూమ్‌తో 12MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఆపిల్ ప్రాసెసింగ్ ద్వారా ఐఫోన్ గొప్ప ఫోటోలను తీస్తుంది. అయితే ఒప్పో రెనో కెమెరా వైవిధ్యంలో వెనుకబడి ఉంటుంది.
పనితీరు, బ్యాటరీ జీవితం
ఒప్పో రెనో 14 ప్రో 5Gలో మీడియాటెక్ డైమెన్సిటీ 8450 ప్రాసెసర్, 16GB RAM వరకు ఉన్నాయి. ఇవి డిమాండింగ్ యాప్‌లు, గేమింగ్‌లో సున్నితమైన పనితీరును అందిస్తాయి. ఐఫోన్ 16e ఆపిల్ A18 చిప్‌తో 8GB RAMను కలిగి ఉంది. ఇది హై-ఎండ్ టాస్క్‌లకు బాగా ఉపయోగకరం. బ్యాటరీ విషయంలో.. ఒప్పో 6200mAh బ్యాటరీతో ఎక్కువ కాలం నడుస్తుంది. అయితే ఐఫోన్ 16eలో 4005mAh బ్యాటరీ ఉంది. రెండు ఫోన్‌లు రోజంతా సరిపోయే విధంగా బ్యాటరీ లైఫ్ ని అందిస్తాయి. అయితే ఒప్పో బ్యాటరీ కాస్త ఎక్కువ కాలం నడుస్తుంది.
ధర
ఒప్పో రెనో 14 ప్రో 5G ధర ₹49,999, ఇది ఫీచర్లతో పోల్చి చూస్తే.. సరసమైన ఎంపిక. ఐఫోన్ 16e బేస్ మోడల్ ధర ₹59,990, ఇది కొంచెం ఖరీదైనది.
ఒప్పో రెనో 14 ప్రో 5G మెరుగైన డిస్‌ప్లే, కెమెరా వైవిధ్యం, పెద్ద బ్యాటరీతో మెరుస్తుంది. ఐఫోన్ 16e కాంపాక్ట్ డిజైన్, ఆపిల్ A18 చిప్, ఆపిల్ ఎకోసిస్టమ్‌తో ఆకర్షిస్తుంది. సరసమైన ధరలో ఫీచర్-ప్యాక్డ్ ఫోన్ కావాలంటే.. ఒప్పో రెనో 14 ప్రో 5G గెలుస్తుంది. ఆపిల్ ఎకోసిస్టమ్, సాఫ్ట్‌వేర్ అనుభవం కావాలనుకునేవారికి ఐఫోన్ 16e గ్రేట్ ఆప్షన్.
Also Read: Realme 15 Pro vs OnePlus Nord 5 vs Galaxy A55: రూ.40000 బడ్జెట్‌లో ఏది బెస్ట్?