BigTV English

Kavitha: కవితను అందుకే అరెస్ట్ చేయట్లేదా? బీజేపీ వ్యూహం ఇదేనా?

Kavitha: కవితను అందుకే అరెస్ట్ చేయట్లేదా? బీజేపీ వ్యూహం ఇదేనా?


Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం. తెలంగాణలో ప్రకంపణలు రేపుతున్న కేసు. ఆ కేసులో పలువురిని నిందితులుగా చేర్చాయి జాతీయ దర్యాప్తు సంస్థలు. కీలక ఆధారాలు సైతం సేకరించాయి. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా నుంచి మాగుంట రాఘవ వరకు.. అనేక మంది అరెస్ట్ అయ్యారు. నెలల తరబడి జైల్లో మగ్గుతున్నారు. ఆప్ సర్కార్, సౌత్ గ్రూప్ చుట్టూనే తిరుగుతోంది కేస్ అంతా.

సౌత్ గ్రూప్‌ను లీడ్ చేసింది కవితనే అంటోది ఈడీ. మరి, ఇంత కీ రోల్ ప్లే చేసిన కవితను మాత్రం అరెస్ట్ చేయట్లేదు. సీఎం కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవిత.. ఈ ఇద్దరే ఈ కేసులో ఇప్పటి వరకూ అరెస్ట్ కాకుండా పెండింగ్‌లో ఉన్న నిందితులు. కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా గట్టి సాక్షాలు లేవనే ప్రచారం జరుగుతోంది. అందుకే అరెస్టుకు వెనకాడుతోందని తెలుస్తోంది. కానీ, కవిత విషయంలో అలా కాదు. నిండా మునిగిపోయిందామె. బలమైన ఆధారాలే ఉన్నాయి.


కవితకు బినామీగా ఉన్న పిళ్లైను, అడిటర్ బుచ్చిబాబును అరెస్ట్ చేశారు కానీ.. ఆమెకు మాత్రం సంకెళ్లు వేసే సాహసం చేయలేకపోతున్నారా? వరుస ఛార్జిషీట్లలో కవిత పేరు ప్రస్తావిస్తున్నారు కానీ.. ఆమెను కస్టడీకి తీసుకునేందుకు కావాలనే ఆలస్యం చేస్తున్నారా? ఇప్పటికే మూడుసార్లు సుదీర్ఘంగా విచారించి ఆమె పాత్రను కన్ఫామ్ చేసుకున్నాక కూడా.. వదిలేయడానికి ఓ లెక్కుందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

సరైన సమయంలో సరైన నిర్ణయం. మోస్ట్ పాపులర్ స్ట్రాటజీ. కేంద్రంలోని బీజేపీ.. కవిత విషయంలో ఇదే వ్యూహాన్ని అమలు చేస్తోందని అంటున్నారు. సిసోడియాను అరెస్ట్ చేస్తే ఏమైంది? ఆప్ నేతలు రెండు రోజులు హడావుడి చేశారు.. ఆ తర్వాత అంతా మర్చిపోయారు. కవితను అరెస్ట్ చేస్తే కూడా.. ఓ వారం బీఆర్ఎస్ హల్‌చల్ చేస్తుంది. ఆ తర్వాత జనం ఆ టాపిక్‌ను వదిలేసి.. వేరే విషయానికి షిఫ్ట్ అవుతుంది. కానీ, రాజకీయంగా లబ్ది జరగాలంటే.. కవితను అరెస్ట్ చేయాల్సిన టైమ్ వేరే ఉందంటున్నారు రాజకీయ పండితులు.

కరెక్టుగా ఎన్నికల నగారా మోగే సమయానికి కవితను అరెస్ట్ చేస్తారా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో కవిత అరెస్టును రాజకీయ లబ్దికి వాడుకోవాలనేది బీజేపీ ఐడియాగా కనిపిస్తోంది. అదిగో చూశారా.. కవిత అరెస్ట్ అయింది.. తెలంగాణ పరువు తీస్తోంది.. ఓ మహిళ లిక్కర్ దందా చేయడం షేమ్ షేమ్ అంటూ.. కమలనాథులు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే, కావాలనే వ్యూహాత్మకంగా కవిత అరెస్ట్‌ను ఆలస్యం చేస్తున్నారని అంటున్నారు. అటు, కవిత మాత్రం తెలంగాణ తలవంచదు.. అంటూ పదే పదే పిడికిలి బిగించి స్టేట్‌మెంట్లు ఇస్తూ.. కౌంటర్ పాలిట్రిక్స్‌ చేస్తున్నారు. ఇలా ఢిల్లీ లిక్కర్ స్కాం.. రెండు పార్టీలకు పొలిటికల్ గేమ్‌గా మారే ఛాన్సెస్ మస్తుగా ఉన్నాయంటున్నారు అనలిస్ట్స్.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×