SSMB 29 Update:సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో ఎస్ ఎస్ ఎన్ బి 29 (SSMB -29) అనే వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమా చేయబోతున్నారు. దాదాపుగా కొన్ని నెలలుగా ఈ వార్త వినిపిస్తూనే ఉంది. కానీ ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఏ పని పూర్తయినట్టు కనిపించలేదు. దీంతో అభిమానులు ఈ సినిమా గురించి తెలుసుకోవడానికి పెద్ద ఎత్తున ఆరాటపడుతున్న విషయం తెలిసిందే. ఇకపోతే అభిమానుల ఆరాటానికి తెరదింపుతూ మహేష్ బాబు, రాజమౌళి సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఈరోజు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మహేష్ బాబు రాడు అని అందరూ అనుకున్నారు. కానీ గ్లోబల్ స్థాయిలో సినిమాను తెరకెక్కిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఉండాలని చిత్ర బృందం భావించిందట. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు కూడా తన పనులన్నింటిని పక్కనపెట్టి మరీ ఈ సినిమా పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు.
ఈ పూజా కార్యక్రమాలలో రాజమౌళి కుటుంబంతోపాటు మహేష్ బాబు, నమ్రత, కీరవాణి తదితరులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు అయితే పూర్తయ్యాయి కానీ ఎప్పుడు సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది అని అభిమానులు అప్పుడే ప్రశ్నలు సంధిస్తున్న నేపథ్యంలో.. ఇంకొక ప్రశ్న మళ్ళీ రాకుండా అప్పుడే క్లారిటీ ఇచ్చేసింది చిత్ర బృందం. అందులో భాగంగానే ద్వితీయ వీఘ్నం లేకుండా రేపు, ఎల్లుండి సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారంలోనే విజయవాడ దగ్గరలో తీర్చిదిద్దిన ప్రత్యేకమైన సెట్ లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు సమాచారం..ఇక ఈ విషయం తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా మరొకవైపు ఈ సినిమాకు సంబంధించిన ఇంకొక వార్త తెరపైకి వచ్చింది. దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కబోతున్న ఈ సినిమాకి అటు దర్శకుడిగా రాజమౌళి , ఇటు హీరోగా మహేష్ బాబు రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదని సమాచారం. ముఖ్యంగా సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్న నేపథ్యంలో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీనికి తోడు కలెక్షన్స్ కూడా భారీగా రాబట్టే అవకాశాలున్నట్లు సమాచారం. అందుకే వీరిద్దరూ తమపై, తమ కథపై ఉన్న నమ్మకంతో రెమ్యునరేషన్ కాకుండా లాభాల్లో వాటా తీసుకోబోతున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా మరొకవైపు ఈ సినిమాలో ప్రియాంక చోప్రా (Priyanka Chopra) నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు దాదాపుగా మూడు నుండి నాలుగు సంవత్సరాలు తన డేట్స్ ని కేటాయించినట్లు కూడా వార్తలు వినిపిస్తూ ఉండడం గమనార్హం. ఇక దీన్ని బట్టి చూస్తే మరో రెండు మూడు ఏళ్ళు మహేష్ బాబు నుంచి ఇంకో సినిమా రాదు అనడంలో సందేహం లేదు. రాజమౌళి విషయానికి వస్తే.. ఇప్పటివరకు కేవలం కొన్ని సినిమాలే తెరకెక్కించినా.. ప్రతి సినిమాతో కూడా మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక ఇప్పుడు ఏకంగా గ్లోబల్ స్టార్ గా పేరు దక్కించుకున్న తర్వాత ఆస్కార్ అవార్డు టార్గెట్ గా బరిలోకి దిగబోతున్నారు అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరి రాజమౌళి కష్టానికి ఫలితం ఏ విధంగా లభిస్తుందో చూడాలి.