E-Paper
Advertisement

ఫ్లిప్‌కార్ట్‌లో అత్యంత చౌకైన ధరకే Poco C85 5G ఫోన్.. ఆఫర్ వివరాలు ఇవే!

ఫ్లిప్‌కార్ట్‌లో అత్యంత చౌకైన ధరకే Poco C85 5G ఫోన్.. ఆఫర్ వివరాలు ఇవే!
Advertisement

Poco C85 5G Price Drop: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ పోకో తమ యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. గత ఏడాది డిసెంబర్‌లో విడుదలైన ‘పోకో C85 5G’ ఫోన్‌పై ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఏకంగా 31% తగ్గింపుతో ఈ ఫోన్ అమ్మకానికి సిద్ధంగా ఉంది. క్రేజీ ఫీచర్లు, పవర్‌ఫుల్ బ్యాటరీ ఉన్న ఫోన్ తక్కువ బడ్జెట్‌లో కొనాలనుకునే వారికి ఇది నిజంగా మంచి అవకాశం.

ధర ఎంత తగ్గిందంటే?

కంపెనీ ఈ ఫోన్‌ను రూ.20,999 ధరకు మార్కెట్లోకి తెచ్చింది. కానీ ప్రస్తుత ఆఫర్‌లో భాగంగా నేరుగా ఫ్లిప్‌కార్ట్‌లో రూ.14,499కే సొంతం చేసుకోవచ్చు. అంటే దాదాపు రూ.5,500 వరకు కంపెనీ డిస్కౌంట్ ఇస్తోంది. అయితే ఈ ఆఫర్ ఇక్కడితోనే ముగిసిపోలేదు. దీనికి తోడు అదనపు బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Advertisement

Also Read: జియో యూజర్లు ఫుల్ హ్యాపీ.. ఏడాది పొడవునా రోజుకు 2.5GB డేటా, ఉచితంగా గూగుల్ జెమిని AI, హాట్‌స్టార్!

బ్యాంక్ ఆఫర్ల వివరాలు:

ఈ ఫోన్ కొనుగోలుపై మరిన్ని లాభాలు పొందవచ్చు. ఒకవేళ మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ఉపయోగించి ఫోన్ కొంటే, మీకు మరో రూ.725 అదనపు తగ్గింపు వస్తుంది. దీంతో మొత్తంగా రూ.6,000 వరకు ఆదా అవుతుంది. ఫలితంగా ఈ అద్భుతమైన 5G ఫోన్‌ను కేవలం రూ.13,774కే మీ ఇంటికి తీసుకెళ్లవచ్చు.

డిస్‌ప్లే, ప్రాసెసర్ ఎలా ఉన్నాయి?

Advertisement

ఈ ఫోన్ 6.9 ఇంచుల పెద్ద HD+ డిస్‌ప్లేతో వస్తుంది. దీనిలో 120Hz రీఫ్రెష్ రేట్ ఉండటం వల్ల స్క్రీన్ చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్ గేమింగ్‌కు, రోజూ వాడకానికి బాగా సెట్ అవుతుంది. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత హైపర్ ఓఎస్ 2.2పై నడుస్తుంది. కంపెనీ దీనికి రెండేళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్స్ కూడా ఇస్తోంది.

బ్యాటరీ సామర్థ్యం ఎంతంటే?

ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను అందించారు. దీని ద్వారా మంచి క్వాలిటీ ఫొటోలు తీసుకోవచ్చు. ఇక సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇక ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని బ్యాటరీ. దీనిలో ఏకంగా 6,000mAh భారీ బ్యాటరీని ఇచ్చారు. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. దుమ్ము, నీటి నుండి రక్షణ కోసం IP64 రేటింగ్ కూడా ఉంది.

Also Read: గూగుల్‌లో పొరపాటున కూడా ఈ 5 విషయాలను వెతకకండి.. ఎందుకో తెలుసా?

Related News

BSNL మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. జస్ట్ రూ. 39కే 20GB డేటా.. రూ.1కే ఉచిత సిమ్!

రూ.35వేలలోపు 50 ఇంచుల టీవీ..ఇంట్లోనే థియేటర్ ఫీల్

రాత్రి వేళ గణపయ్య ఫోటోలు బ్లర్ అవుతున్నాయా? ఈ టిప్స్‌తో క్లారిటీ అదుర్స్!

రొటేటింగ్ బెజెల్‌తో క్రేజీ స్మార్ట్ వాచ్..GOBOULT Saber విశేషాలివే

రూ.1000లోపు దబిడి దిబిడే..పార్టీ మోత మోగించే బ్లూటూత్ స్పీకర్!

మ్యూజిక్ లవర్స్ కోసం బెస్ట్ హెడ్ సెట్..మార్కెట్లో రచ్చ చేస్తున్న మోడల్

రూ.2,399కే క్రేజీ ఫీచర్లు..నథింగ్ నుంచి కొత్త ఇయర్‌బడ్స్

కొత్త ఫోన్ కొంటున్నారా? 128GB లేదా 256GB ఏది బెటర్?

Big Stories

Advertisement
×