E-Paper
Advertisement

తిరుగులేని బ్యాటరీతో Poco M8 Power 5G.. రూ.3,000 డిస్కౌంట్‌తో ఎలా కొనాలంటే?

తిరుగులేని బ్యాటరీతో Poco M8 Power 5G.. రూ.3,000 డిస్కౌంట్‌తో ఎలా కొనాలంటే?
Advertisement

Poco M8 Power 5G: రోజంతా ఫోన్ వాడుతూనే ఉంటాం, కానీ పదే పదే ఛార్జింగ్ పెట్టాలంటేనే విసుగొస్తుంది. అందుకే ఈసారి బ్యాటరీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాకుండా పోకో నుంచి ఒక కొత్త ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. అదే Poco M8 Power 5G. ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ ధరతో సేల్ కూడా మొదలైంది. అసలు ఈ ఫోన్‌లో అంతగా ఏముంది? ఎవరికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది? అనేది ఇప్పుడు చూద్దాం..

బిగ్ డిస్‌ప్లే, అదిరిపోయే లుక్..

Poco M8 Power 5G ఫోన్‌లో 6.9 అంగుళాల పెద్ద FHD+ అమోలెడ్ డిస్‌ప్లే ఇచ్చారు. 120Hz రిఫ్రెష్‌రేట్ ఉండటం వల్ల స్క్రీన్ స్క్రోలింగ్, గేమింగ్ అనుభవం చాలా స్మూత్‌గా ఉంటుంది. ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 1800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అందించారు. అంతేకాకుండా.. స్క్రీన్ రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ని ఉపయోగించారు.

Advertisement

Also Read: మునుపెన్నడూ లేని రీతిలో తగ్గిన AirPods Pro 3 ధర.. ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే!

భారీ బ్యాటరీ సామర్థ్యం..

ఈ Poco M8 Power 5Gలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది దీని బ్యాటరీ గురించే. దీనిలో శక్తివంతమైన 8000mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే పదే పదే ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం ఉండదు. దీనికి తోడు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఛార్జర్‌ను కూడా బాక్స్‌లోనే ఇస్తున్నారు. ఇంకో విశేషం ఏమిటంటే.. ఈ ఫోన్ ద్వారా ఇతర చిన్న చిన్న డివైజ్‌లకు ఛార్జ్ చేసుకునేలా 22.5W రివర్స్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది.

అద్భుతమైన కెమెరా ఫీచర్లు:

Advertisement

స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 ప్రాసెసర్‌పై పనిచేసే ఈ Poco M8 Power 5G రోజువారీ పనులను చాలా వేగంగా పూర్తి చేస్తుంది. ఇక ఫొటోల విషయానికొస్తే.. వెనుక వైపు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సెల్ఫీల కోసం ముందు వైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి. వీడియో కాల్స్ మాట్లాడేటప్పుడు, రీల్స్ చేసేటప్పుడు కలర్ టోన్ సరిచేసే ఫీచర్లు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి.

ధర, ఆఫర్ వివరాలు:

Poco M8 Power 5G ఫోన్.. బ్లేజ్ ఆరెంజ్, బ్లాక్, గ్రీన్ రంగుల్లో లభిస్తుంది. 6GB ర్యామ్ మోడల్ అసలు ధర రూ.24,999 కాగా, 8GB ర్యామ్ మోడల్ ధర రూ.27,999గా ఉంది. అయితే ప్రస్తుతం సేల్‌లో భాగంగా బ్యాంక్ కార్డ్ ఆఫర్లు, కూపన్ల ద్వారా రూ.3,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో వీటిని రూ.21,999, రూ.24,999కే సొంతం చేసుకోవచ్చు.

Also Read: ధర తగ్గింది గురూ.. తక్కువ ధరకే Apple MacBook Air M5.. ఈ ఛాన్స్ మళ్లీ రాదు!

Related News

సుజాత లేక బాష్ మిక్సర్ గ్రైండర్.. ఏది కొంటే బెస్ట్ ?

సగానికి పైగా డిస్కౌంట్‌తో.. అమెజాన్ సేల్‌లో సైడ్-బై-సైడ్ ఫ్రిజ్‌లు

మునుపెన్నడూ లేని రీతిలో తగ్గిన AirPods Pro 3 ధర.. ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే!

ఇంటి పైకప్పుపై గార్డెన్.. ఇక లైఫ్‌లో ఏసీలు, కూలర్లు అక్కర్లే.. బోలెడన్ని బెనిఫిట్స్!

ధర తగ్గింది గురూ.. తక్కువ ధరకే Apple MacBook Air M5.. ఈ ఛాన్స్ మళ్లీ రాదు!

200MP కెమెరా, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో కొత్త రెడ్‌మీ ఫోన్లు.. లీక్ అయిన వివరాలు ఇవే!

రూ.2 లక్షలా? ఈ ఫోన్లలో అంతలా ఏముంది భయ్యా.. శాంసంగ్ లేటెస్ట్ ఫోల్డబుల్స్ సేల్స్ షురూ!

Big Stories

Advertisement
×