E-Paper
Advertisement

మునుపెన్నడూ లేని రీతిలో తగ్గిన AirPods Pro 3 ధర.. ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే!

మునుపెన్నడూ లేని రీతిలో తగ్గిన AirPods Pro 3 ధర.. ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే!
Advertisement

Amazon Offers: ఐఫోన్ ఉండి.. ఎయిర్‌పాడ్స్ లేకపోతే ఏదో వెలితిగా అనిపిస్తుంది కదూ? అంత ఎక్కువ డబ్బులు పెట్టి యాపిల్ ఎయిర్‌పాడ్స్ కొనలేము అనుకుంటున్న వారికి ఒక గుడ్ న్యూస్. ప్రీమియం ధరతో కొట్టొచ్చినట్టు కనిపించే Apple AirPods Pro 3 ఇప్పుడు రీజనబుల్ బడ్జెట్‌లోకి వచ్చేసింది. అమేజాన్ సేల్స్ లేదా ప్రత్యేక ఈవెంట్స్ దాకా ఆగకుండానే, డైరెక్ట్‌గా భారీ డిస్కౌంట్‌తో వీటిని అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆఫర్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఆ వివరాలేంటో తెలుసుకోండి మరి.

భారీగా తగ్గిన ఎయిర్‌పాడ్స్ ధర..

సాధారణంగా మార్కెట్లో దాదాపు రూ.21,000 వరకు లభించే ఈ ప్రీమియం ఎయిర్‌పాడ్స్ ప్రో 3 ని ఇప్పుడు అమేజాన్ ఏకంగా 24 శాతం తగ్గింపుతో అందిస్తోంది. ఈ ఆఫర్ కారణంగా వీటి ధర ప్రస్తుతం సుమారు రూ.16,000కే చేరుకుంది. అంటే.. నేరుగా రూ.5,000 వరకు లాభం చేకూరుతోంది. 2026లో ఈ ఎయిర్‌పాడ్స్ ఇంత తక్కువ ధరకు రావడం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు.

Advertisement

Also Read: ధర తగ్గింది గురూ.. తక్కువ ధరకే Apple MacBook Air M5.. ఈ ఛాన్స్ మళ్లీ రాదు!

ప్రత్యేక సేల్ లేకపోయినా..

కొద్ది రోజుల క్రితం వరకు అమేజాన్ వీటిని సుమారు రూ.16,800 ధరకు విక్రయించింది. కానీ ఇప్పుడు వినియోగదారులను ఆకట్టుకునేలా మరో రూ.800 తగ్గించి, రికార్డు స్థాయిలో రూ.16,000కే అందుబాటులోకి తెచ్చింది. సాధారణంగా ప్రైమ్ డే లేదా పండుగ సీజన్ సేల్స్ సమయంలో మాత్రమే మనం ఇలాంటి ఆఫర్లు చూస్తుంటాం. కానీ ఇప్పుడు ఎలాంటి ప్రత్యేక సేల్ లేకపోయినా ఈ స్థాయిలో డిస్కౌంట్ దక్కడం నిజంగా విశేషం.

అద్భుతమైన ఫీచర్లు..

Advertisement

యాపిల్ నుంచి వచ్చిన ఈ లేటెస్ట్ ఎయిర్‌పాడ్స్ ప్రో 3లో సాంకేతికంగా అనేక మార్పులు చేశారు. బయటి సౌండ్ అసలు వినపడకుండా చేసే మెరుగైన ఆక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC), థియేటర్ లాంటి అనుభూతినిచ్చే స్పేషియల్ ఆడియోతో పాటు హార్ట్‌రేట్ సెన్సింగ్ (గుండె వేగం కొలిచే ఫీచర్), రియల్ టైమ్ లైవ్ ట్రాన్స్‌లేషన్ వంటి వినూత్న హంగులు ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా.. చెవుల్లో చాలా సేపు పెట్టుకున్నా నొప్పి లేకుండా సరిగ్గా కుదురుకునేలా దీని డిజైన్‌ను కూడా మునుపటి మోడల్స్ కంటే చాలా సౌకర్యవంతంగా తీర్చిదిద్దారు.

ఆపిల్ లవర్స్‌కి ఇదే కరెక్ట్ టైం..

మీరు గనుక ఇప్పటికే ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ బుక్ లేదా యాపిల్ వాచ్ ఉపయోగిస్తుంటే.. ఇవి క్షణాల్లో వాటంతట అవే కనెక్ట్ అయిపోతాయి. అద్భుతమైన సౌండ్ క్వాలిటీ, క్రేజీ కాలింగ్ ఎక్స్‌పీరియన్స్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. పైగా కేస్ కూడా టైప్-సి (USB-C) ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఎప్పుడెప్పుడు ధర తగ్గుతుందా అని ఎదురుచూస్తున్న యాపిల్ ప్రియులకు ఈ లిమిటెడ్ టైమ్ డీల్ నిజంగా ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు.

Also Read: 200MP కెమెరా, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో కొత్త రెడ్‌మీ ఫోన్లు.. లీక్ అయిన వివరాలు ఇవే!

Related News

ఇంట్లోనే థియేటర్ కిక్..అదుర్స్ అనిపించే 55-ఇంచుల టీవీలు!

ఈ వాక్యూమ్ క్లీనర్స్‌తో ఎలాంటి మరకలైనా..క్షణాల్లోనే మాయం

పాత ఫోన్ వేస్ట్ అనుకుంటే పొరపాటే..ఇలా వాడితే ఎన్నో లాభాలు!

పాన్ కార్డ్ ఫోటో లేదా సిగ్నేచర్ మార్చుకోవాలా?

యూపీఐ పేమెంట్స్ చేసేటప్పుడు..ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

రీఛార్జ్ టెన్షన్ వద్దు..ఒక్క క్లిక్‌తో 1000+టీవీ ఛానెళ్లు ఫ్రీ!

మరుగుతున్న నీటిలో పడినా పాడవ్వదు..8100mAh బ్యాటరీతో హానర్ సరికొత్త అద్భుతం!

స్మార్ట్‌వాచ్ వెనుక ఆకుపచ్చ లైట్ ఎందుకు వెలుగుతుందో తెలుసా? అసలు కారణం ఇదే!

Big Stories

Advertisement
×