BigTV English

Power Banks Under 1K : రూ.1000లోపే పవర్ బ్యాంక్ కొనాలా?

Power Banks Under 1K : రూ.1000లోపే పవర్ బ్యాంక్ కొనాలా?

Power Banks Under 10K : ఇండియాలో రూ.1000 రూపాయలోపే కొనగలిగే బెస్ట్ పవర్ బ్యాంక్స్ ఎన్నో అందుబాటులో ఉన్నాయి. వీటి ధరతో ఫీచర్స్ సైతం అదిరిపోయేలా ఉన్నాయి. ఆ లిస్ట్ పై మీరూ ఓ లుక్కేసేయండి.


ట్రావెల్ ప్రియుల కోసం టాప్ బ్రాండ్ కంపెనీలన్నీ అతి తక్కువ ధరకే బెస్ట్ పవర్ బ్యాంక్స్ అందుబాటులోకి తీసుకొచ్చేశాయి. వీటిలో 1000mah కెపాసిటీతో పాటు 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందుబాటులో వచ్చేశాయి. USB-A పోర్ట్ తో అందుబాటులోకి వచ్చేసిన ఈ పవర్ బ్యాంక్స్ యూజర్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మరి ఆ పవర్ బ్యాంక్స్ లిస్ట్ తో పాటు ఫీచర్స్ పై ఓ లుక్కేసేయండి.

1. Mi Power Bank 3i 10000mAh


కెపాసిటీ : 10000mAh
సపోర్ట్ : 18W ఫాస్ట్ ఛార్జింగ్
ఫీచర్స్ : Mi Power Bank 3i 10000mAh పవర్ బ్యాంక్ మూడు USB-A పోర్టులతో వస్తుంది. దీంతో ఒకేసారి మూడు డివైజ్ లకు ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది డ్యూయల్-ఇన్‌పుట్ (Micro-USB, Type-C) పోర్ట్ తో వచ్చేసింది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వచ్చేసింది.

2. Realme 10000mAh Power Bank

కెపాసిటీ : 10000mAh
సపోర్ట్ : 18W డ్యూయల్ ఛార్జింగ్
ఫీచర్లు : Realme పవర్ బ్యాంక్ 10000mAh ఫాస్ట్ ఛార్జింగ్, 18W డ్యూయల్ ఛార్జింగ్, 2 USB-A పోర్ట్‌లు కలిగి ఉంటుంది. ఒకేసారి రెండు డివైసులను ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది చిన్నదిగా, పోర్టబుల్‌గా ఉండటంతో ట్రావెల్ చేసే యూజర్స్ కు ఎంతగానో ఉపయోగపడుతుంది.

3. Ambrane 10000mAh Power Bank

కెపాసిటీ : 10000mAh
సపోర్ట్ : 12W ఫాస్ట్ ఛార్జింగ్
ఫీచర్లు : Ambrane పవర్ బ్యాంక్ 10000mAh 12W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది. ఇది 2 USB-A పోర్ట్‌ సపోర్ట్ తో 12W ఛార్జింగ్‌ను అందిస్తుంది. దీని డిజైన్ స్లిమ్ అండ్ స్టైలిష్ గా ఉండటంతో ప్రయాణాలకు ఎంతో సులువుగా ఉంటుంది.

4. Intex IT-PB11K 11000mAh Power Bank

కెపాసిటీ : 11000mAh
సపోర్ట్ : 12W ఛార్జింగ్
ఫీచర్లు : Intex IT-PB11K 11000mAh పవర్ బ్యాంక్ 12W ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీ కలిగి ఉంది. ఇది 2 USB-A పోర్ట్‌లను కలిగి ఉంటుంది. దీంతో ఒకేసారి రెండు డివైజెస్ ను ఛార్జ్ చేసుకోవచ్చు.

5. Zebronics Zeb-PG10000 Power Bank

కెపాసిటీ : 10000mAh
సపోర్ట్ : 18W ఫాస్ట్ ఛార్జింగ్
ఫీచర్స్ : Zebronics Zeb-PG10000 18W ఫాస్ట్ ఛార్జింగ్ తో మోడర్న్ డిజైన్‌తో వచ్చేస్తుంది. ఇది 2 USB పోర్ట్‌లను కలిగి ఉంది. డిజైన్ పోర్టబుల్‌ మోడల్ లో ఈ పవర్ బ్యాంక్ అందుబాటులోకి వచ్చేసింది.

రూ. 1000లోపే Mi, Realme, Ambrane, Intex, Zebronics వంటి బ్రాండ్స్ కు చెందిన టాప్ పవర్ బ్యాంక్స్ కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. వీటిలో హై కెపాసిటీతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, డ్యూయల్ పోర్ట్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ ఎన్నో అందుబాటులోకి వచ్చేసాయి. మరి, ఇంకెందుకు ఆలస్యం.. అతి తక్కువ ధరకే బెస్ట్ పవర్ బ్యాంక్ కొనాలనుకునే యూజర్స్ ఖచ్చితంగా ట్రై చేసేయండి.

ALSO READ :  ఇండియాలో డీప్ సీక్ హవా.. కోటికి పైగా డౌన్లోడ్స్

 

Related News

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Samsung Galaxy Z Fold 7: శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 రిపేర్ చేయడం చాలా కష్టం.. iFixitలో అతి తక్కువ స్కోర్

Realme 15 Pro vs OnePlus Nord 5 vs Galaxy A55: రూ.40000 బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Amazon 75 Percent Sale: ఇల్లు తుడవడమా? రోబోతో చేయించండి.. Amazon Sale లో 75% తగ్గింపు!

Internet: ఇంటర్నెట్ లేకపోతే మన జీవితం ఎలా ఉండేది? ఒకసారి అలా వెళ్లొద్దాం రండి..

Amazon Freedom Festival Laptops: రూ.1 లక్ష లోపు ధరలో గేమింగ్ ల్యాప్‌టాప్స్.. బెస్ట్ డీల్స్ ఇవే

Big Stories

×