Abhishek Sharma: టీమిండియా యంగ్ క్రికెటర్ అభిషేక్ శర్మ… మరో సంచలన రికార్డు నమోదు చేసుకున్నాడు. అంతర్జాతీయ టి20 క్రికెట్లో సెంచరీ నమోదు చేసుకున్నాడు అభిషేక్ శర్మ. టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదవ టి20 మ్యాచ్ లో ఈ సెంచరీ సాధించడం జరిగింది. కేవలం 17 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసుకున్న టీమిండియా యంగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ… అనంతరం సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
Also Read: U19 Women’s T20 World Cup: టీ-20 ప్రపంచ కప్ విజేతగా టీమిండియా..!
ఈ మ్యాచ్ లో 37 బంతుల్లోనే… తన రెండవ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఏకంగా 270.3 స్ట్రైక్ రేట్ తో… ఇంగ్లాండ్ ప్లేయర్లకు చుక్కలు చూపించాడు అభిషేక్ శర్మ. ఇప్పటివరకు.. తన కెరీర్ లో రెండు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ పూర్తి చేసుకున్న అభిషేక్ శర్మ… ఇప్పుడు మరొక సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేవలం 37 బంతుల్లోనే సెంచరీ చేసుకొని… రికార్డు సృష్టించాడు అభిషేక్ శర్మ. అయితే 37 బంతుల్లో సెంచరీ చేసుకున్న అభిషేక్ శర్మ… టీమిండియా తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రెండవ బ్యాటర్ గా నిలిచాడు. అంతకుముందు… టి20లో రోహిత్ శర్మ 35 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఆ తర్వాత రెండవ బ్యాటరుగా అభిషేక్ శర్మ నిలిచాడు. అయితే ఈ మ్యాచ్ మొత్తంలో… 13 సిక్సులు కొట్టి.. చరిత్ర సృష్టించాడు అభిషేక్ శర్మ. టీమిండియా తరఫున ఓకే ఇన్నింగ్స్ లో 13 సిక్స్ లు కొట్టడం ఇదే తొలిసారి. గతంలో రోహిత్ శర్మ ఒకే ఇన్నింగ్స్ లో పది సిక్స్ లు కొట్టాడు. దీంతో రోహిత్ శర్మ రికార్డు బద్దలు కొట్టినట్లు అయింది.
ఇక అంతకుముందు.. టాస్ ఓడి టీమిండియా బ్యాటింగ్ కు దిగడం జరిగింది. ఈ నేపథ్యంలోనే.. మొదటి నుంచి టీమిండియా ఆటగాళ్లు హిట్టింగ్ ఆడుతూ ముందుకు సాగారు. ఈ నేపథ్యంలోనే ఈ టి 20 మ్యాచ్ లో…. భారీ స్కోర్ దిశగా టీమిండియా ముందుకు సాగుతోంది. అభిషేక్ శర్మతో ఓపెనింగ్ బరిలోకి దిగిన సంజు సాంసన్ మరోసారి విఫలమయ్యాడు. కేవలం 16 పరుగులకే సంజు వెనుదిరిగాడు. మరోసారి ఫాస్ట్ బౌలింగ్ లోనే.. ఫుల్ షాట్ ఆడి… వికెట్ పోగొట్టుకున్నాడు. ఏడు బంతుల్లో 16 పరుగులు చేసిన సంజు… రెండు సిక్స్ లు అలాగే ఒక బౌండరీ కొట్టాడు.
ఇక అనంతరం బ్యాటింగ్కు దిగిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మ… 24 పరుగులతో రాణించాడు. ఆడినంతసేపు హిట్టింగ్ చేసి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ. 15 బంతుల్లో 24 పరుగులు చేసి రఫ్పాడించాడు. అటు టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ మరోసారి విఫలమయ్యాడు. హైదరాబాద్ జట్టు కొనుగోలు చేసిన కార్స్ బౌలింగ్లో రెండు పరుగులకే అవుట్ అయ్యాడు సూర్య కుమార్ యాదవ్.
Also Read: Rajeev Shukla – Dhoni: రాజకీయాల్లోకి ధోని.. BCCI సంచలన ప్రకటన !
ప్రస్తుతం టీమిండియా యంగ్ ప్లేయర్ అభిషేక్ శర్మ అలాగే…. శివం దూబే బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ ఇద్దరు ప్లేయర్లు కూడా మూడు వికెట్లు పడినప్పటికీ… భారీ స్కోర్ టీమిండియా కు అందించే దిశగా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడే బ్యాటింగ్కు దిగిన శివన్ దూబే… పది బంతుల్లో 25 పరుగులు చేశాడు. ఇందులో రెండు ఫోర్లు అలాగే రెండు సిక్సర్లు ఉన్నాయి. ఇక.. ప్రస్తుతం అందుతున్న రిక్వైర్డ్ రేట్ ప్రకారం… టీమిండియా 270 పరుగుల వరకు చేసే ఛాన్స్ ఉంది. టీమిండియా బ్యాటర్లు రెచ్చిపోతే 300 కూడా దాటవచ్చు.
FASTEST HUNDRED IN T20I FOR INDIA:
Rohit Sharma – 35 balls.
Abhishek Sharma – 37* balls. pic.twitter.com/BosBtYAfkp
— Tanuj Singh (@ImTanujSingh) February 2, 2025