Raghav Chadha: ఎట్టకేలకు ఎంపీ రాఘవ్ చద్దా పార్లమెంటు వేదికగా చేసిన పోరాటం ఫలితం దక్కింది. టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఓ మెట్టు కిందకు దిగి వచ్చింది. ఇప్పటివరకున్న 28 రోజుల మొబైల్ రీఛార్జ్ ప్లాన్స్ కాకుండా, నెలకు ఒకసారి రీఛార్జ్ చేసుకునే వెసులుబాటు తీసుకొచ్చింది. ట్రాయ్ తీసుకున్న నిర్ణయాన్ని ఎంపీ రాఘవ్ చద్దా వెల్‌కమ్ చెప్పారు.
దేశంలో కోట్లాది మంది మొబైల్ ప్రీపెయిడ్ వినియోగదారులకు శుభవార్త. ఇప్పుటివరకు నెలవారీ రీఛార్జి చేసుకుంటే కేవలం 28 రోజులు మాత్రమే వచ్చేది. ఎంపీ రాఘవ చద్దా పార్లమెంటు వేదికగా చేసిన పోరాటం సక్సెస్ అయ్యింది. దాని ఫలాలు సామాన్యుడికి అందడం మొదలైంది. ఈ క్రమంలో టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.
టెలికామ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్-2026 పేరుతో తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం.. నెలకు ఒకసారి రీఛార్జ్ చేసుకునే వెసులుబాటు వినియోగదారులకు కలిగింది. 28 రోజుల ప్లాన్ వల్ల వినియోగదారులు ఏడాదికి 13 సార్లు రీఛార్జ్ చేసుకోవాల్సి పరిస్థితి ఉండేది. కొత్త నిబంధనల వల్ల వినియోగదారులు నెలకు ఒకసారి చొప్పున ఏడాదికి 12 సార్లు రీఛార్జ్ చేసుకునే వెసులుబాటు కలిగింది. ఇదే కాకుండా తక్కువ కాల పరిమితితో రీఛార్జ్ ప్లాన్స్ తీసుకురానున్నాయి టెలికాం ఆపరేటర్లు.
డేటా వినియోగించని వారి కోసం కాల్స్-ఎస్‌ఎంఎస్‌లు ఉండే పథకాలను మొబైల్ ఆపరేటర్లు తీసుకురానున్నాయి. వాటిని Special Tariff Vouchers-STV పేరుతో అందుబాటులోకి రానున్నాయి. ఇళ్లు, ఆఫీసుల్లో వైఫై అందుబాటులో ఉన్నప్పుడు సిమ్ కార్డు ద్వారా డేటా వినియోగం వినియోగదారులకు తక్కువగా ఉంటోంది. వీరు తప్పనిసరిగా డేటాతో కూడిన రీఛార్జి చేసుకోవాల్సి వస్తోంది. కాల్స్ కోసం సెల్‌ఫోన్ ఉపయోగించే వినియోగదారులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. డేటా వాడకున్నా అనవసరంగా చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు. అలాంటి వారికోసం ఇన్‌కమింగ్ – ఔట్‌గోయింగ్ కాల్స్‌కు సరిపోయే వాయిస్-ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్లు అందుబాటులోకి రానున్నాయి.
ALSO READ: ఉచిత ఇంటర్నెట్ టీవీకి చెక్? టెలికాం నిబంధనల దిశగా ట్రాయ్ అడుగులు!
ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారులకు మరిన్ని ఎంపికలు కల్పించే లక్ష్యంతో ప్రవేశపెట్టిన కొత్త 30 రోజుల రీఛార్జ్ నిబంధనలను రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా స్వాగతించారు. దీన్ని తక్కువ బడ్జెట్ వినియోగదారుల విజయంగా ఆయన అభివర్ణించారు. ఈ మార్పుల ఉద్దేశ్యం వినియోగదారులకు వారి వ్యక్తి గత అవసరాల ఆధారంగా ప్రీపెయిడ్ ప్లాన్‌లను ఎంచుకోవడంలో మరింత సౌలభ్యం కలగనుందని ఎక్స్ వేదికగా ఆయన రాసుకొచ్చారు. మొబైల్ వినియోగదారుల సమస్యలపై ఎంపీ రాఘవ్ చద్దా పార్లమెంటులో లేవనెత్తిన తర్వాత విస్తృత సంప్రదింపులు చేసిన ట్రాయ్, కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది.
Good news for Prepaid Mobile Users in India
The Govt just introduced Telecom Consumer Protection (Thirteenth Amendment) Regulations, 2026, consumers will now have:
• 30-day recharge plans, reducing the need for 13 monthly recharges to 12 in a year
• Voice and SMS-only plans… pic.twitter.com/mfWVfMWNqR— Raghav Chadha (@raghav_chadha) September 27, 2026