Allu Sirish : ఈ మధ్యకాలంలో వినాయక చవితి సందర్భంగా ప్రముఖ నగరాల్లో ప్రతి గల్లీకి దేవుడి విగ్రహాలు దర్శనమిచ్చాయి. అయితే ఇప్పటికే పలు ఏరియాలోని విగ్రహాలు నిమర్జనానికి వెళ్లగా.. మరికొన్ని ప్రాంతాలలో ఇంకా విగ్రహాలకు జనాలు పూజలు చేస్తూ ఉన్నారు. విగ్రహాల దగ్గర పెద్ద సౌండ్ లతో మ్యూజిక్ ని పెడుతూ దేవుడి పేరుతో అందరికీ ఇబ్బంది కలిగిస్తున్నారు అంటూ గతంలో అనేకమంది సోషల్ మీడియా వేదికగా పోలీసులకు ఫిర్యాదు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. వినాయకుడి నిమర్జనాలు పూర్తయినా సరే కొన్నిచోట్ల ఇంకా పెద్ద పెద్ద సౌండ్ తో మ్యూజిక్ పెడుతూ కొందరు ఆకతాయిలు జనాలకు ఇబ్బందులు కలిగిస్తున్నారు అంటూ.. సినీ ప్రముఖులు సైతం పోలీసులకు ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారు. అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ కూడా ఆలయంలో వస్తున్న పెద్ద శబ్దంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ గా మారింది. ఆయన చేసిన ఫిర్యాదు పై కొందరు నెటిజన్లు కూడా కామెంట్లు పెడుతున్నారు దాంతో నెట్టింట చర్చనీయాంశంగా మారింది. అసలు శిరీష్ ఏమని ఫిర్యాదు చేశారు..? నెటిజన్ల రియాక్షన్ ఎలా ఉంది అన్నది ఒక్కసారి మనం తెలుసుకుందాం..
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియా వేదికగా ఆయన ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వినోభానగర్‌లోని ఓ ఆలయం నుంచి అర్ధరాత్రి వేళ కూడా పెద్ద శబ్దంతో మ్యూజిక్ వస్తుందని ఆయన పేర్కొన్నారు. షేక్‌పేట్‌లోని అపర్ణా వన్ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నానని, తమ నివాసానికి సమీపంలో ఉన్న వినోభానగర్ హనుమాన్ ఆలయంలో గత కొద్ది రోజులుగా రాత్రి 2 వరకు కూడా పెద్ద పెద్ద సౌండ్ లతో పాటలు పెడుతూ ఇబ్బంది పెడుతున్నారని అల్లు శిరీష్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు ఆ పోస్ట్ కి ఒక వీడియోని కూడా షేర్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ సమస్యపై తాను ఇప్పటికే ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని శిరీష్ అందులో రాసుకొచ్చారు. అయితే, గణేష్ నిమజ్జనం వరకు సర్దుకుపోవాలని వారు సూచించినట్లు చెప్పారు.. అయితే ఇప్పటికే గణపతి నిమర్జనం అయిన కూడా ఇలాంటి శబ్దాలు రావడం తమకు ఇబ్బంది కలిగిస్తుంది అంటూ పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేశారు. ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
Respected @hydcitypolice . I'm a resident of Aparna One, Shaikpet. For the last few days the Hanuman temple at Vinobha Nagar is playing loud music, beyond allowed decibels till night 2/3am. I complained the Film Nagar PS.
They asked us to bear till 25th Sept as its Ganesh… pic.twitter.com/ggJp4U4hdU
— Allu Sirish (@AlluSirish) September 27, 2026
ప్రస్తుతం అల్లు శిరీష్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. దీన్ని చూసినా కొందరు నెటిజన్లు ఆయనకు సపోర్టుగా నిలవగా, మరి కొంత మంది మాత్రం అల్లు శిరీష్ కి వ్యతిరేకంగా కామెంట్లు పెడుతూ రచ్చ చేస్తున్నారు. అల్లు శిరీష్ హిందూ వ్యతిరేకి అంటూ కొందరు నెటిజన్లు ఆయనని టాగ్ చేస్తూ.. సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.. దాంతో ప్రస్తుతం ఇది నెట్టింట బాగా వైరల్ అవుతుంది. ఇలాంటి కామెంట్స్ ఈమధ్య ఎక్కువైపోతున్నాయి అంటూ మరి కొంతమంది అల్లు శిరీష్ ని సపోర్ట్ చేస్తున్నారు. మొత్తానికి ఆయన పై కొందరు వ్యతిరేక ప్రచారం కూడా చేయడంతో ఇప్పుడు ఇది ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్ గా మారింది. నెటిజన్ల రియాక్షన్ పై అల్లు శిరీష్ ఎలా రియాక్ట్ అవుతాడు అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. ఏది ఏమైనా కూడా పోలీసులు రంగంలోకి దిగితేనే సమస్య పూర్తిగా సద్దుమణుగుతుంది అని తెలుస్తుంది. మరి పోలీసులు అల్లు సిరీస్ ఫిర్యాదు పై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..
Also Read :Gundeninda GudiGantalu Today episode: పాపం మీనా.. బాలు ప్లాన్ అదిరిపోలే.. ఇది కదా అసలు ట్విస్ట్..