Sanjay Manjrekar on Rohit Sharma Reality Show: టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ (ind vs wi) మధ్య జరిగిన తొలి వన్డే సందర్భంగా రోహిత్ శర్మ 32 పరుగులకే వికెట్ సమర్పించుకున్నాడు. అదే సమయంలో విరాట్ కోహ్లీ వీర విహారం చేసి సెంచరీ నమోదు చేసుకున్నాడు. మ్యాచ్ కూడా గెలిపించాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అయితే దీనిపై సంజయ్ మంజ్రేకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రియాలిటీ షోలు బంద్ చేసి.. క్రికెట్ పైన దృష్టి పెట్టాలని రోహిత్ శర్మ పై సీరియస్ అయ్యారు. 2027 వన్డే వరల్డ్ కప్ దగ్గర పడుతున్న నేపథ్యంలో దిక్కుమాలిన రియాలిటీ షోలు చేసుకుంటూ టైంపాస్ చేస్తున్నావా? ఇలా చేస్తే టీమిండియా ఎక్కడ గెలుస్తుందని నిలదీశారు. వెంటనే ఆ సోలు మానేసి 2027 వన్డే వరల్డ్ కప్ గెలవడం పైన ఫోకస్ చేయాలని సూచనలు చేశారు. దీంతో రోహిత్ శర్మ పై సంజయ్ మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
2027 వన్డే వరల్డ్ కప్ దగ్గర పడుతున్న నేపథ్యంలో టీమిండియా క్రికెటర్లు అందరూ చాలా జాగ్రత్తగా ముందుకు సాగాలని కీలక సూచనలు చేశారు మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్. వెధవ ప్రయోగాలు చేయకుండా మ్యాచ్ పై ఫోకస్ చేయాలన్నారు. రోహిత్ శర్మ రియాల్టీ షోలు మానుకొని.. క్రికెట్ పైన దృష్టి పెట్టాలని కోరారు. 2027 వన్డే వరల్డ్ కప్ నకు కేవలం 12 నెలలు మాత్రమే ఉందని గుర్తు చేశారు. ఇలాంటి క్రమంలో రియాలిటీ షోలు చేసుకుంటూ రోహిత్ శర్మ టైం పాస్ చేస్తే… ఎలా అంటూ నిలదీశారు.
అందుకే నిన్న వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా రోహిత్ శర్మ విఫలమయ్యాడని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నమెంట్ కోసం రోహిత్ శర్మను తీసుకునేది నమ్మకం లేదు.. ఇలాంటి తరుణంలో రియాలిటీ షోలు చేసుకుంటూ ఎవరిని ఉద్ధరిస్తావు? మీ అభిమానులకు ఏం సమాధానం చెబుతామని నిలదీశారు. ఇప్పటికైనా వాడిని మానేసి 2027 వన్డే వరల్డ్ కప్ పైన ఫోకస్ చేయాలని కోరారు. చాలా కాకుండా రియాలిటీ షోలు చేస్తే అట్టర్ ఫ్లాప్ అవుతావని హెచ్చరించారు. దిక్కుమాలిన షోలతో టైంపాస్ వద్దు..దమ్ముంటే టీమిండియాకు వరల్డ్ కప్ తీసుకురా అంటూ రోహిత్ శర్మపై సంజయ్ మంజ్రేకర్ సీరియస్ అయ్యారు. ఇది ఇలా ఉండగా ఫ్యామిలీ ఫుల్ హౌస్ విత్ రోహిత్ శర్మ అనే హోస్ట్ గా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ పనిచేస్తున్నాడు.