E-Paper
Advertisement

అద్భుతమైన AI ఫీచర్లు, కళ్లుచెదిరే డిజైన్‌తో కొత్త 5G ఫోన్ వచ్చేసింది.. ధర ఎంతంటే?

అద్భుతమైన AI ఫీచర్లు, కళ్లుచెదిరే డిజైన్‌తో కొత్త 5G ఫోన్ వచ్చేసింది.. ధర ఎంతంటే?
Advertisement

POVA 8 Pro 5G: బడ్జెట్‌లో అదిరిపోయే స్టైల్, మైండ్ బ్లాక్ అయ్యే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. భారత మార్కెట్లోకి POVA 8 Pro 5G స్మార్ట్‌ఫోన్ అఫీషియల్‌గా ఎంట్రీ ఇచ్చింది. మార్కెట్లో విడుదలైన క్షణం నుంచే ఈ ఫోన్ తన డిజైన్, కెమెరాతో టెక్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

వెనుక వైపు లైటింగ్ డిజైన్..

ఈ ఫోన్‌లో అందరినీ ఆకట్టుకునే ప్రధానమైన విశేషం దీని వెనుక భాగంలో ఉండే ‘అలైవ్ మ్యాట్రిక్స్ డిస్‌ప్లే’. ఫోన్ వెనుక వైపు ఇచ్చే ఈ చిన్న డాట్ మ్యాట్రిక్స్ ప్యానెల్ వల్ల నోటిఫికేషన్లు, ఛార్జింగ్ శాతం, టైమర్ వంటి వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి. అంతేకాదు.. ఫోన్‌ను బోర్లా పెట్టినప్పుడు ఇది ఒక డెస్క్ క్లాక్‌లా మారిపోతుంది. ఫోన్ చూసేందుకు చాలా కొత్తగా, ప్రీమియంగా కనిపిస్తుంది.

కాల్స్ సంగతి AI చూసుకుంటుంది..

Advertisement

ఈ డివైజ్‌లో ఇచ్చే AI అసిస్టెంట్ అసలైన హైలైట్ అని చెప్పుకోవాలి. మనకు వచ్చే నార్మల్ కాల్స్‌తో పాటు వాట్సప్ కాల్స్‌ను కూడా ఇది రికార్డ్ చేసి, నోట్స్ రూపంలో రాసిస్తుంది. ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషలను ఇది సపోర్ట్ చేస్తుంది. సంభాషణలోని ముఖ్యమైన పాయింట్లను గుర్తించి టూ-డూ లిస్ట్‌గా మార్చి ఇస్తుంది. దీనివల్ల టైమ్ చాలా సేవ్ అవుతుంది.

Also Read: అద్భుతమైన లుక్, మిలిటరీ గ్రేడ్ బిల్డ్‌తో వచ్చేస్తున్న Lava Bold N4 Lite.. లాంచ్ ఎప్పుడంటే?

50 మెగాపిక్సల్ కెమెరా..

Advertisement

ఇక ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో 50MP సోనీ లైటియా 700C మెయిన్ కెమెరా ఉంది. దీనికి తోడు ‘ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్’ (OIS) సపోర్ట్ ఉండటం వల్ల ఫొటోలు, వీడియోలు చాలా షార్ప్‌గా వస్తాయి. ల్యాండ్‌స్కేప్స్ కోసం 8MP అల్ట్రావైడ్ కెమెరా కూడా ఇచ్చారు. మోషన్ ట్రైల్, 3D ఫొటోల వంటి స్మార్ట్ ఫీచర్లు ఫోటోగ్రఫీని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్తాయి.

ధర, ఆఫర్ల వివరాలు..

ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.49,999గా ఉంది. అయితే బ్యాంక్ ఆఫర్ల కింద రూ.3,000 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. దీంతో ఈ హ్యాండ్ సెట్‌ను రూ.46,999కే సొంతం చేసుకోవచ్చు. అలాగే నెలకు రూ.2,777 నుంచి ప్రారంభమయ్యే 18 నెలల నో-కాస్ట్ EMI సౌకర్యం కూడా ఉంది. ఆసక్తి ఉన్నవారు ఫ్లిప్‌కార్ట్ లేదా ప్రముఖ రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

Also Read: 100% ఛార్జ్ చేయడం ఫోన్‌కు డేంజరా.. టెక్ నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా?

Tags

Related News

రూ15,000 లోపే 6000mAh బ్యాటరీ, డ్యూయల్ స్క్రీన్.. హానర్ కొత్త ఫోన్ లాంచ్!

వాట్సప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్.. లింక్డ్ డివైజ్‌లలో ఇక ఆ చాట్స్ కనిపంచవు!

స్టూడెంట్స్‌కి గుడ్ న్యూస్.. ఫ్రీగా ఏడాది పాటు ఫోటోషాప్ సబ్‌స్క్రిప్షన్.. ఇలా క్లెయిమ్ చేసుకోండి!

ఇక సైబర్ నేరగాళ్ల పని గోవిందా.. కేంద్రం తెచ్చిన ఈ సూపర్ టూల్ గురించి తెలుసా?

జియో చౌకైన ప్లాన్ లాంచ్.. రూ.123కే 28 రోజుల వ్యాలిడిటీ.. డైలీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్!

డైమెన్సిటీ 7360 MAX ప్రాసెసర్‌తో ఒప్పో మాస్ ఎంట్రీ.. గేమింగ్ ప్రియులకు పూనకాలే!

స్కూల్ బ్యాగ్ కాదు.. బుల్లెట్ ప్రూఫ్ కవచం.. టర్కీ కంపెనీ వినూత్న ఆవిష్కరణ!

చూడగానే నచ్చేసే క్యూట్ డిజైన్.. బోస్ సౌండ్‌తో నాయిస్ మాస్టర్ బడ్స్ ఓపెన్, ఆఫర్ ధర ఎంతంటే?

Big Stories

Advertisement
×