Neeraj Chopra Marraige: భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ( Neeraj Chopra ) అదిరిపోయే శుభవార్త చెప్పాడు. తాజాగా పెళ్లి చేసుకున్న నీరజ్ చోప్రా… ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. పెళ్లి చేసుకున్న ఫోటోలను… సోషల్ మీడియాలో పెట్టి… శుభవార్త అందించాడు. నీరజ్ – హిమని ( Himani) అనే క్యాప్షన్ ఇస్తూ… పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టాడు నీరజ్ చోప్రా. దీంతో… నీరజ్ చోప్రా పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read: ICC U19 Women’s T20 World Cup: ఖాతా తెరిచిన టీమిండియా.. విండీస్ పై గ్రాండ్ విక్టరీ
రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత ఐన నీరజ్ చోప్రా ( Neeraj Chopra ) పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టడంతో.. ఆయన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. నీరజ్ తన పెళ్లికి సంబంధించిన వివరాలను ముందుగా చెప్పకముందే… నేరుగా పెళ్లి చేసుకోవడమే ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే నీరజ్ చోప్రా ( Neeraj Chopra Marraige ) తన పెళ్లి గురించి వార్తలను పబ్లిక్ చేసిన తర్వాత అతనికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ క్రికెటర్ సురేష్ రైనా (Suresh Raina) , నటుడు గజరాజ్ రావు ఇద్దరు కూడా నీరజ్ చోప్రా కు ( Neeraj Chopra ) శుభాకాంక్షలు చెప్పారు. “నీరజ్ చోప్రా ( Neeraj Chopra ) దంపతుల ప్రయాణం అందమైన జ్ఞాపకాలు, తిరుగులేని విజయాలతో నిండి ఉండాలి” అని రైనా ఎక్స్‌లో పోస్ట్‌లో పేర్కొన్నారు.
Also Read: Abhinav Manohar: SRH చేతిలో మరో డేంజర్ ఆల్ రౌండర్.. క్యావ్యాపాప ప్లాన్ అదుర్స్ !
ఇది ఇలా ఉండగా… గతంలో నీరజ్ చోప్రా అలాగే షూటర్ మనుభాకర్ ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మొన్నటి ఒలంపిక్స్ సమయంలోనే.. ఈ వార్త బాగా వైరల్ అయింది. అంతేకాదు నీరజ్ చోప్రా అలాగే మను భాకర్… అనుకోకుండా ఒక ప్లేస్ లో కనబడడంతో… వారిద్దరు నిజంగానే ప్రేమలో ఉన్నట్లు వార్తలు కూడా వైరల్ అయ్యాయి. వీరు ఇద్దరూ గత కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారని కూడా కొంతమంది ప్రచారం చేశారు.
కానీ చివరికి అదేం…. లేదని రెండు కుటుంబ సభ్యులు చెప్పడంతో అందరూ సైలెంట్ అయిపోయారు. అయినప్పటికీ కొంతమంది వారి మధ్య ప్రేమ ఉందని ప్రచారం చేశారు. అయితే ఇలాంటి నేపథ్యంలో రహస్యంగా హిమని అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని.. ఫ్యాన్స్ అందరికీ షాక్ ఇచ్చాడు నీరజ్ చోప్రా. దీంతో… ఫ్యాన్స్ అందరూ… నీరజ్ చోప్రా కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆ జంట నిండు నూరేళ్లు హ్యాపీగా ఉండాలని ఆశీర్వాదం ఇస్తున్నారు.
जीवन के नए अध्याय की शुरुआत अपने परिवार के साथ की। 🙏
Grateful for every blessing that brought us to this moment together. Bound by love, happily ever after.
नीरज ♥️ हिमानी pic.twitter.com/OU9RM5w2o8
— Neeraj Chopra (@Neeraj_chopra1) January 19, 2025