E-Paper
Advertisement

రూ.1,999కే రియల్‌మీ 20000mAh పవర్ బ్యాంక్..ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్స్ అదిరిపోయాయి!

రూ.1,999కే రియల్‌మీ 20000mAh పవర్ బ్యాంక్..ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్స్ అదిరిపోయాయి!
Advertisement

Realme Techlife 20000mAh power bank: ప్రస్తుత డిజిటల్ యుగంలో.. స్మార్ట్‌ ‌ఫోన్, స్మార్ట్‌వాచ్, ఇయర్‌ బడ్స్ ,టాబ్లెట్లు మన డైలీ లైఫ్ స్టైల్‌లో భాగమైపోయాయి. రోజంతా.. వీటిని వాడాలంటే బ్యాటరీ చార్జింగ్ ఎంతో ముఖ్యం. ముఖ్యంగా నిరంతరం ప్రయాణాలు చేసే.. వారికి ఫోన్ చార్జింగ్ ఎప్పుడూ ఒక పెద్ద సవాల్‌లా మారు తుంది. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి ‘రియల్‌మీ’ సంస్థ అత్యంత శక్తివంతమైన, స్టైలిష్ అయిన ‘టెక్‌ లైఫ్ రియల్‌ఫిట్ 20000mAh’ పవర్ బ్యాంక్‌ను మార్కెట్లోకి తెచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1.20000mAh బ్యాటరీ కెపాసిటీ:

Advertisement

ఈ పవర్ బ్యాంక్ మెయిన్ హైలైట్ బలం దాని బ్యాటరీ సామర్థ్యం. 20000mAh పవర్ ఫుల్ కెపాసిటీ ఉండటం వల్ల మీ స్మార్ట్‌ ఫోన్‌ను కనీసం 3 నుంచి 4 సార్లు పూర్తిగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఒక్క సారి ఈ పవర్ బ్యాంక్‌ను ఫుల్ ఛార్జ్ చేస్తే.. రోజంతా లేదా రెండు రోజుల పాటు బ్యాటరీ టెన్షన్ అసలు ఉండదు. కుటుంబంతో కలిసి ట్రిప్స్‌కి వెళ్లేవారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

2. 45W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్:

సాధారణ పవర్ బ్యాంక్‌లతో పోలిస్తే.. ఇది చాలా వేగంగా డివైజెస్‌ను ఛార్జ్ చేస్తుంది. ఇందులో ఉన్న 45 వాట్ల (45W) ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ.. వల్ల మీ స్మార్ట్‌ ఫోన్ క్షణాల్లో చార్జ్ అవుతుంది. ఆఫీస్‌కి వెళ్లే.. హడావుడిలో ఉన్నప్పుడు లేదా అత్యవసర సమయంలో ఇది ఎంతగానో ఉపయోగ పడుతుంది.

3. ఆల్-ఇన్-వన్ కంపాటిబిలిటీ :

Advertisement

ఈ పవర్ బ్యాంక్ కేవలం మొబైల్స్‌కు మాత్రమే పరిమితం కాదు. ఇది స్మార్ట్‌ ఫోన్‌లతో పాటు ఇయర్‌ బడ్స్, స్మార్ట్‌ వాచ్‌లు, స్మార్ట్‌‌బ్యాండ్‌లు, టాబ్లెట్‌లను కూడా చాలా ఛార్జ్ చేయగలదు. చిన్న చిన్న గాడ్జెట్‌లను ఛార్జ్ చేయడానికి ప్రత్యేకమైన లో-కరెంట్ మోడ్ కూడా ఇందులో అందుబాటులో ఉండటం విశేషం.

4. ట్రెండీ డిజైన్, అంబర్ ఎల్లో కలర్ :

సాధారణంగా పవర్ బ్యాంక్‌లు నలుపు లేదా తెలుపు రంగుల్లో బోరింగ్‌గా ఉంటాయి. కానీ.. రియల్‌ మీ ఈ పవర్ బ్యాంక్‌ను ఆకర్షణీయమైన ‘అంబర్ ఎల్లో’కలర్‌లో, చాలా కాంపాక్ట్ సైజ్‌లో డిజైన్ చేసింది. దీన్ని హ్యాండ్‌ బ్యాగ్‌లో లేదా పాకెట్‌లో చాలా ఈజీగా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. దీని స్టైలిష్ లుక్ యూజర్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

5. సేఫ్టీ ప్రొటెక్షన్:

ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను వాడేటప్పుడు సేఫ్టీ చాలా ముఖ్యం. ఈ పవర్ బ్యాంక్‌లో.. మల్టి పుల్ సర్క్యూట్ ప్రొటెక్షన్ సిస్టమ్‌ను అందించారు. ఇది ఓవర్ ఛార్జింగ్, ఓవర్ హీటింగ్ ,షార్ట్ సర్క్యూట్ వంటి సమస్యల నుంచి మీ విలువైన డివైజెస్‌ను పూర్తిగా రక్షిస్తుంది. కేవలం రూ.1,999 ధరకే లభించడం దీనికి మరో ప్లస్ పాయింట్.

తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ , ఫాస్ట్ ఛార్జింగ్ కోరుకునే వారికి ఈ మోడల్ పవర్ బ్యాంక్ బెస్ట్ ఆప్షన్. స్టైలిష్ లుక్, పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌‌తో.. వస్తున్న ఈ గాడ్జెట్‌ను మీసొంతం చేసుకొని ప్రయాణాలను టెన్షన్ ఫ్రీగా.. మార్చుకోండి!

Related News

ఐఫోన్ యూజర్లకు అలర్ట్.. మీ లొకేషన్ లీక్ అవ్వకూడదంటే.. ఈ హిడెన్ ఫీచర్‌ ఆన్ చేసుకోండి!

ఐఫోన్ vs ఆండ్రాయిడ్: డిస్‌ప్లే పగిలినా, బ్యాటరీ పోయినా.. దేనికి రిపేర్ ఖర్చు ఎక్కువ?

రూ.6,599కే బెస్ట్ టీవీ..ఆఫర్ పూర్తవకముందే కొనేయండి!

వేల రూపాయల ఫీచర్లు రూ.999కే..ఆఫర్ మాములుగా లేదుగా!

అమెజాన్ సేల్‌లో సగం ధరకే..బ్రాండెడ్ ఫ్రిజ్‌లు, వెంటనే కొనేయండి

రూ.1,500లోపు బెస్ట్ ఇయర్‌బడ్స్..బడ్జెట్ ధరలో పవర్‌ఫుల్ సౌండ్

బ్రాండెడ్ ల్యాప్ టాప్‌పై భారీ డిస్కౌంట్..ఇంతకంటే బెస్ట్ మోడల్ ఉండదు!

Big Stories

Advertisement
×