E-Paper
Advertisement

భాగ్యనగరం వాసులకు బిగ్ అలర్ట్.. 36 గంటలపాటు నీళ్లు బంద్, ఏయే ప్రాంతాల్లో అంటే..

భాగ్యనగరం వాసులకు బిగ్ అలర్ట్.. 36 గంటలపాటు నీళ్లు బంద్, ఏయే ప్రాంతాల్లో అంటే..
Advertisement

Hyderabad city: ఎల్‌నినో కారణంగా వర్షాలు లేక సామాన్యులు విలవిలలాడిపోతున్నారు. ఇదే క్రమంలో హైదరాబాద్ సిటీవాసులకు పిడుగులాంటి వార్త చెప్పింది జలమండలి అధికారులు. వాటర్ పైపులైన్లు మరమ్మతుల నిమిత్తం హైదరాబాద్ సిటీలోని వివిధ ప్రాంతాల్లో 36 గంటలపాటు నీళ్లుకు అంతరాయం ఏర్పడనుంది. ఈ క్రమంలో నీటిని పొదుపు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

భాగ్యనగరం వాసులకు బిగ్ అలర్ట్.. 36 గంటలపాటు నీళ్లు బంద్

హైదరాబాద్ సిటీలో సోమవారం నుంచి కొన్ని ప్రాంతాలకు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. ఈ విషయాన్ని జల మండలి అధికారులు స్వయంగా ప్రకటించారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు అంతరాయం ఏర్పడింది. అందుకు కారణాలు లేకపోలేదు.

నీళ్లకు అంతరాయం కలిగే ప్రాంతాలివే

Advertisement

నాసర్లపల్లి నుంచి గొడకొండ్ల వరకు డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్‌‌‌‌లో దెబ్బతిన్న ఎంఎస్ ఎయిర్ టీలు, వాల్వ్లను మార్చే పనులు చేస్తోంది వాటర్ బోర్డు. ఈ క్రమంలో ప్రజలను అలర్ట్ చేశారు. ముఖ్యంగా ఆదిబట్ల, కమ్మగూడ, గుర్రంగూడ, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటోనగర్, అల్కాపురి, బీరప్పగడ్డ, హబ్సిగూడ, రామంతాపూర్, వెంకట్‌రెడ్డి నగర్, ఉప్పల్, నాచారం, హెచ్‌ఎంటీ నగర్, తార్నాక, బౌద్ధనగర్, లాలాపేట్ అంతరాయం ఏర్పడవచ్చని తెలిపింది.

ALSO READ: ఘోర రోడ్డు ప్రమాదం.. అమెరికాలో తెలుగు మహిళ మృతి, సొంతూరు మహబూబాబాద్ జిల్లా

Advertisement

దీనికితోడు హస్మత్‌పేట్, ప్రకాశ్‌నగర్, మేకలమండి, భోలక్‌పూర్ , పద్మారావునగర్, బేగంపేట్, సౌత్ సెంట్రల్ రైల్వే, ఎంఈఎస్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, లాలాగూడ వంటి ప్రాంతాలు ఉన్నాయి. అలాగే అడ్డగుట్ట, పట్టిగడ్డ, నల్లగుట్ట, గౌతమ్‌నగర్, ఫిరోజ్‌గూడ, బన్సీలాల్‌పేట్, రాంగోపాల్‌పేట్, సీతాఫల్‌మండి, మెట్టుగూడ, వైశాలీనగర్, మీర్‌పేట్, బడంగ్‌పేట్, ఏఆర్‌సీఐ, బాలాపూర్, మైసారం, బార్కాస్, ఎన్‌పీఏ, శంషాబాద్, మధుబన్, ప్రశాసన్‌నగర్ వంటి ప్రాంతాలు ఉన్నాయి.

Related News

ఘోర రోడ్డు ప్రమాదం.. అమెరికాలో తెలుగు మహిళ మృతి, సొంతూరు మహబూబాబాద్ జిల్లా

100 శాతం ఖైరతాబాద్ సీటు మాదే.. క్లారిటీగా చెప్పిన తెలంగాణ బీజేపీ చీఫ్, మాటల వెనుక లెక్కలివే

సీఎం ఆదేశాలతో పొన్నం సుడిగాలి పర్యటనలు.. ఆర్టీసీ, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి!

వనరుల సమీకరణపై ప్రత్యేక దృష్టి.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

హైదరాబాద్ OYO రూమ్‌లలో వరుస హత్యలు.. 10 రోజుల్లో ముగ్గురు అమ్మాయిల బలి.. అసలు ఏం జరుగుతోంది?

భూపాలపల్లి ఆస్పత్రిలో తప్పిన పెను ప్రమాదం.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత తీవ్ర ఆగ్రహం

ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ సంబరాలు.. ఈసారి ప్రత్యేకం ఏంటో తెలుసా?

Big Stories

Advertisement
×