BigTV English

Game Changer Talk : అన్ని గుడ్ న్యూస్‌లే… దేవుడా ఇక నువ్వే కాపాడాలి

Game Changer Talk : అన్ని గుడ్ న్యూస్‌లే… దేవుడా ఇక నువ్వే కాపాడాలి

Game Changer Talk : “దేవుడా… ఇక నువ్వే కాపాడాలి”
దీన్ని ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో రెండు వర్గాల ఫ్యాన్స్ వాడుతున్నారు. ఒకటి… గేమ్ ఛేంజర్ హిట్.. కాదు కాదు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకునే మెగా అభిమానులు.
మరో వర్గం అంటే… యాంటి మెగా ఫ్యాన్స్. గేమ్ ఛేంజర్ పెద్ద డిజాస్టర్ అవ్వాలని వీరు కోరుకుంటున్నారు.
మీ ఈ రెండు వర్గాలు దేవుడా… ఇక నువ్వే కాపాడాలి అని ఎందుకు అనుకుంటున్నారో ఇప్పుడు చూద్ధాం…


రామ్ చరణ్ లాంగ్ గ్యాప్ తర్వాత గేమ్ ఛేంజర్ మూవీతో వస్తున్నాడు. అది కూడా ఇప్పుడు అన్నీ ప్రతీకూల పరిస్థితులే. ఈ మూవీకి దర్శకత్వం వహించిన శంకర్ ఇటీవల భారతీయుడు 2 అనే మూవీ చేశాడు. ఆ మూవీ భారీ డిజాస్టర్ అయింది. ఇది గేమ్ ఛేంజర్ మూవీపై నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అయింది.

అల్లు అర్జున్ ఎపిసోడ్… బెనిఫిట్ షోల ప్రభావం…


అలాగే అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం… ఈ వ్యవహారంలో రామ్ చరణ్‌తో పాటు మెగా ఫ్యామిలీ అందరూ సైలెంట్ మోడ్‌లో ఉండటం కూడా సినిమాపై కొంత మేర ప్రభావం చూపించే అవకాశం ఉంది. నిజానికి ఈ అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంలో మెగా ఫ్యామిలీపై ఎలాంటి బ్యాడ్ టాక్ రాలేదు. ఒక రకంగా చెప్పాలంటే… మెగా హీరోలు సైలెంట్‌గా ఉండటమే కాసింత ప్లస్ అయిందని చెప్పొచ్చు. అయినా… అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు మరి కొంత మంది యాంటి మెగా ఫ్యాన్స్ గురించి ఆలోచింస్తే… ప్రతి కూలపరిస్థితినే అనుకోవచ్చు.

అన్నింటి కంటే ముఖ్యమైనది… గేమ్ ఛేంజర్‌కి టికెట్ ప్రైజ్ లు పెంచుకోవడానికి, బెనిఫిట్ షోలకు అనుమతి ఉండకపోవచ్చు. ఇది గేమ్ ఛేంజర్ మూవీ ఓపెనింగ్స్, కలెక్షన్లపై భారీ ప్రభావం చూపించబోతుందని చెప్పొచ్చు.

ఊరటనిస్తున్న లీక్స్…

ఇవి అన్ని పక్కనపెడితే… గేమ్ ఛేంజర్ మూవీ నుంచి కొన్ని లీక్స్ వస్తున్నాయి. ఈ లీక్స్ రామ్ చరణ్ అభిమానులతో పాటు మెగా ఫ్యాన్స్ ను ఊరటనిస్తున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన ప్రతి లీక్ పాజిటివ్ గానే ఉంది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఖాయం అని ఈ లీక్స్ తో ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ఫస్టాఫ్ యావరేజ్ గా ఉన్న ఇంట్రెస్టింగ్ ఉంటుందని, ఇంటర్వెల్ బ్లాస్ అయ్యేలా ఉంటుందని, ఇక సెకండాఫ్ అయితే నెక్ట్స్ లెవల్ అని లీక్స్ వస్తున్నాయి.

శంకర్ మార్క్ క్లైమాక్స్…

సినిమాలో కొన్ని సాంగ్స్, యాక్షన్ సీక్వెన్స్ సూపర్‌గా వచ్చాయట. అలాగే శంకర్ సినిమాలంటే.. క్లైమాక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. కానీ, అది భారతీయుడు 2లో మిస్ అయింది. అయితే ఇప్పుడు గేమ్ ఛేంజర్ లో అసలు మిస్ అయ్యే ఛాన్స్ లేదట. శంకర్ మార్క్ క్లైమాక్స్ సినిమాలో ఉంటుందని టాక్.

ఎస్‌జే సూర్య, శ్రీకాంత్ & అంజలి…

గేమ్ ఛేంజర్ మూవీ అంటే రామ్ చరణ్, కియారా తర్వాత ఎక్కువ కనిపిస్తుంది ఎస్ జే సూర్య. ఈ సినిమాలో ఈయన విలన్ పాత్ర చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ పాత్రకు సంబంధించి ఒక్క క్లూ కూడా ఇవ్వలేదు. ఈ పాత్రతో ఆడియన్స్ ను థ్రిల్ చేయాలని, సర్ప్రైజ్ చేయాలని శంకర్ చూస్తున్నారట. అంత అద్భుతంగా ఈ క్యారెక్టర్ ఉంటుందని తెలుస్తుంది. అలాగే శ్రీకాంత్ పాత్ర కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుందని సమాచారం.

ఇక అంజలి అయితే… సినిమాలో థ్రిల్ అవ్వడం పక్కా అని అంటున్నారు. సినిమాను మలుపు తిప్పే పాత్ర ఆమెది అని సమాచారం. సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఈ క్యారెక్టర్ కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారట.

ఇలా గేమ్ ఛేంజర్ మూవీ నుంచి ఎలాంటి లీక్ వచ్చినా… పాజిటివ్ గానే ఉంటుంది. దీంతో చరణ్ అభిమానులు… ఇప్పటి వరకు అంతా పాజిటివ్ గానే ఉంది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేలా చూడాలి అంటూ దేవుడా… ఇక సినిమాను నువ్వే చూడాలి అంటూ వేడుకుంటున్నారు.

అలాగే యాంటి మెగా ఫ్యాన్స్ అయితే… ఈ సినిమా లీక్స్ వల్ల కూడా పాజిటివిటీని క్రియేట్ చేసుకుంటుంది. ఈ సినిమా ఫెయిల్ అయ్యేలా దేవుడా ఇక చూసుకోవాలి అని అనుకుంటున్నారట.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×