E-Paper
Advertisement

అదరగొట్టే ఫీచర్లతో Redmi 17C 5G వచ్చేస్తోంది.. ధర, లాంచ్ వివరాలు ఇవే!

అదరగొట్టే ఫీచర్లతో Redmi 17C 5G వచ్చేస్తోంది.. ధర, లాంచ్ వివరాలు ఇవే!
Advertisement

Redmi 17C 5G: బడ్జెట్ ధరలో మంచి 5G ఫోన్ కోసం చూస్తున్న వారికి షావోమీ శుభవార్త చెప్పింది. భారత మార్కెట్లోకి ‘రెడ్‌మీ 17C 5G’ స్మార్ట్‌ఫోన్‌ను అక్టోబర్ 1న విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే ఈ ఫోన్‌కు సంబంధించిన టీజర్లను కంపెనీ విడుదల చేస్తూ.. డిజైన్, కలర్ ఆప్షన్లపై ఒక స్పష్టత ఇచ్చింది. ఇప్పటికే సింగపూర్‌లో లాంచ్ అయిన ఈ మోడల్.. దాదాపు అవే ఫీచర్లతో భారత్‌లోకి అడుగుపెట్టబోతోంది. బ్రౌన్, పర్పుల్, బ్లాక్ కలర్స్‌లో వచ్చే ఈ హ్యాండ్ సెట్.. బడ్జెట్ ప్రియులను ఆకట్టుకోనుంది.

డిస్‌ప్లే, ప్రాసెసర్:

ఈ Redmi 17C 5G ఫోన్ ప్రధాన ఆకర్షణ 6.9 అంగుళాల HD ప్లస్ డిస్‌ప్లే. 120Hz రీఫ్రెష్ రేట్ ఉండటం వల్ల సోషల్ మీడియా స్క్రోలింగ్, గేమింగ్ చాలా స్మూత్‌గా సాగుతాయి. అలాగే వెలుతురులో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 810 నిట్స్ బ్రైట్‌నెస్ అందించారు. నిత్యం ఫోన్ వాడే వారి కోసం మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ను ఇందులో వాడారు. ఇది రోజువారీ పనులను వేగంగా పూర్తి చేయడమే కాకుండా.. 5G నెట్‌వర్క్‌కు పూర్తి స్థాయిలో సపోర్ట్ ఇస్తుంది.

Advertisement

Also Read: ఇప్పుడే కొనేస్తే మంచిది.. అక్టోబర్ నుంచి టీవీలు, ఏసీలు సహా గృహోపకరణాల ధరలు పెరిగే అవకాశం!

కెమెరా, స్టోరేజ్:

ఫోన్ వెనుక వైపు రెండు కెమెరాల సెటప్ ఉంది. ఇందులో ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్ కాగా.. దానికి తోడుగా మరో సెకండరీ కెమెరాను ఇచ్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ మాట్లాడటానికి ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ వాటర్‌డ్రాప్ నాచ్ కెమెరా ఉంది. ఫోటోలు, వీడియోలు ఎక్కువగా స్టోర్ చేసుకునే వారి కోసం మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్ పెంచుకునే సౌకర్యాన్ని కూడా అందించారు. సామాన్య వినియోగదారులకు ఈ కెమెరా అవుట్‌పుట్, స్టోరేజ్ ఆప్షన్లు ఖచ్చితంగా నచ్చుతాయి.

బ్యాటరీ, ఛార్జింగ్:

Advertisement

రెడ్‌మీ 17C 5Gలో మరో పెద్ద ప్లస్ పాయింట్ 6000mAh బ్యాటరీ. ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే రోజంతా హ్యాపీగా వాడుకోవచ్చు. దీనికి తోడు 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల ఫోన్ త్వరగా ఛార్జ్ అవుతుంది. వీడియోలు ఎక్కువగా చూసే వారికి, ఇంటర్నెట్ వాడే వారికి ఈ బ్యాటరీ బ్యాకప్ బాగా ఉపయోగపడుతుంది. భారీ ఫీచర్లతో వచ్చే ఫ్లాగ్‌షిప్ మోడళ్లకు భిన్నంగా, సామాన్యుల బడ్జెట్ పరిధిలోనే అత్యుత్తమ బ్యాటరీ లైఫ్ ఇచ్చేలా కంపెనీ దీనిని డిజైన్ చేసింది.

లాంచ్ వివరాలు:

అక్టోబర్ 1న జరగబోయే అధికారిక వేడుకలో ఈ ఫోన్ ధర, వేరియంట్లు, సేల్ ఆఫర్లను కంపెనీ వెల్లడించనుంది. సరసమైన ధరకే పెద్ద స్క్రీన్, 5G కనెక్టివిటీ, పెద్ద బ్యాటరీ కోరుకునే వారికి ఇది మార్కెట్లో గట్టి పోటీని ఇవ్వడం ఖాయం. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్లు కోరుకునే వారికి ఈ ఫోన్ సరైన ఎంపికగా నిలవనుంది.

Also Read: టైప్ చేసే పనిలేదు.. ChatGPT కొత్త వాయిస్ ఫీచర్ చూస్తే ఆఫీస్ ఉద్యోగులు ఎగిరి గంతులేస్తారు!

Tags

Related News

ఇంత భారీగా ధర తగ్గుతుందని ఎవరూ ఊహించి ఉండరు.. Galaxy Z Fold 4 ఇప్పుడు రూ.89 వేలకే!

ఇప్పుడే కొనేస్తే మంచిది.. అక్టోబర్ నుంచి టీవీలు, ఏసీలు సహా గృహోపకరణాల ధరలు పెరిగే అవకాశం!

టైప్ చేసే పనిలేదు.. ChatGPT కొత్త వాయిస్ ఫీచర్ చూస్తే ఆఫీస్ ఉద్యోగులు ఎగిరి గంతులేస్తారు!

ఎంపీ రాఘవ్ చద్దా పోరాటం.. దిగొచ్చిన ట్రాయ్, మొబైల్‌ ప్రీపెయిడ్‌ ప్లాన్లు ఇకపై 30 రోజులు

ఉచిత ఇంటర్నెట్ టీవీకి చెక్? టెలికాం నిబంధనల దిశగా ట్రాయ్ అడుగులు!

వామ్మో.. ఫోన్ అప్‌డేట్ వెనుక ఇంత ప్రాసెస్ ఉందా? కోడింగ్ నుంచి మీ మొబైల్ వరకు ఎలా వస్తుందంటే!

కరెంట్ పోయిన వెంటనే..తప్పకుండా ఆపేయాల్సిన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్

Big Stories

Advertisement
×