E-Paper
Advertisement

నిందితుల కోసం కదులుతున్న కారుపైకి దూకిన పోలీస్.. ఏకంగా 40 కిలో మీటర్లు కళ్లు చెదిరే ఛేజ్!

నిందితుల కోసం కదులుతున్న కారుపైకి దూకిన పోలీస్.. ఏకంగా 40 కిలో మీటర్లు కళ్లు చెదిరే ఛేజ్!
Advertisement

Dramatic Police Chase: పోలీసుల డ్యూటీ అంటే కేవలం వాహనాలను ఆపి తనిఖీ చేయడం, కేసులు నమోదు చేయడం మాత్రమే కాదు. కొన్ని సందర్భాల్లో పరిస్థితులు ఊహించని మలుపు తీసుకుంటాయి. అలాంటి సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధి నిర్వహించాల్సి వస్తుంది. తమిళనాడులోని కోయంబత్తూరు సమీపంలో హెడ్ కానిస్టేబుల్ వేల్మురుగన్ ఎదుర్కొన్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

జనరల్ చెకింగ్స్ తో మొదలై..

కోవిల్‌పాలయం సమీపంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. అదే సమయంలో తెల్లటి హ్యుండాయ్ క్రెటా కారును ఆపేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే, కారులో ఉన్న వ్యక్తులు ఆపకుండా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు ఆ వాహనాన్ని వెంబడించారు. కొచ్చి–సేలం హైవేపై వేగంగా వెళ్తున్న కారును ఆపేందుకు ప్రయత్నించారు.

కారు రూఫ్ మీదికి దూకిన కానిస్టేబుల్

Advertisement

ఈ సమయంలో హెడ్ కానిస్టేబుల్ వేల్మురుగన్ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వేగంగా వెళ్తున్న కారుపైకి ఆయన దూకి, దాని పైకప్పుపై ఉన్న పట్టీలను గట్టిగా పట్టుకున్నాడు. కారును ఆపేందుకు ప్రయత్నించాడు. కారు వేగం పెంచినా ఆయన పట్టును వదల్లేదు. రోడ్డు మీద వాహనాలు తిరుగుతున్న సమయంలో, ప్రమాదకర పరిస్థితుల్లోనూ కారును ఆపించేందుకు ప్రయత్నించాడు.

40 కిలోమీటర్ల పాటు కొనసాగిన ఛేజ్

కారు దాదాపు 40 కిలోమీటర్ల మేర ప్రయాణించిన సమయంలో వేల్మురుగన్ దానిపై అలాగే ఉండిపోయాడు. ఈ ఛేజ్‌ లో రద్దీగా ఉన్న రోడ్లు, టోల్ ప్లాజా మీదుగా కొనసాగింది. ఒక్క క్షణం పట్టు జారినా కానిస్టేబుల్ ప్రాణాలు పోయేవి. కానీ, ఆయన అలాగే పట్టుకుని ఉండిపోయాడు.

గుట్కా రవాణా అడ్డుకునేందుకు..   

Advertisement

పోలీసుల సమాచారం ప్రకారం, ఈ కారులో భారీ మొత్తంలో నిషేధిత గుట్కా తరలిస్తున్నట్లు అనుమానించారు. ఈ సరుకును బెంగళూరు నుంచి తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. చివరకు అవినాశి సమీపంలో పోలీసులు కారును అడ్డుకున్నారు. వాహనంలో ఉన్న బాబు ధార, రాజేష్, సురేష్ అనే ముగ్గురిని అరెస్టు చేశారు. వారి నుంచి నిషేధిత పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

కానిస్టేబుల్ ధైర్యంపై ప్రశంసలు

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వేల్మురుగన్ సాహసంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. విధి పట్ల ఆయన చూపిన నిబద్ధతను అభినందిస్తున్నారు. అయితే, ఇలాంటి ప్రమాదకరమైన ఛేజ్‌లలో పోలీసుల భద్రతపై కూడా చర్చ మొదలైంది. అక్రమ రవాణా వాహనాన్ని ఆపే క్రమంలో అధికారి ప్రాణాలను పణంగా పెట్టే పరిస్థితి ఎందుకు రావాలనే ప్రశ్నలు కొందరు లేవనెత్తుతున్నారు. వేల్మురుగన్ చేసిన సాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also: బోగీలోనే మూత్రం పోసిన తాగుబోతు, అందులోనే దొర్లించి.. చితక్కొట్టిన ప్రయాణికులు!

Tags

Related News

బోగీలోనే మూత్రం పోసిన తాగుబోతు, అందులోనే దొర్లించి.. చితక్కొట్టిన ప్రయాణికులు!

గగనతనంలో గల్లి చాయ్.. ఎయిర్ ఇండియా సరికొత్త ప్రయోగం!

కొరియాలో పార్సిల్స్ టేప్స్ మీద పిల్లల ఫోటోస్ ఎందుకు ఉంటాయో తెలుసా? భలే ఐడియా!

నార్మల్ ప్యాసింజర్ లా వెళ్తూ.. రైలులో సివిక్ సెన్స్ లేని వాళ్లకి మొట్టికాయలు వేసిన ఆదా శర్మ!

కదిలే రైల్లో అదిరిపోయే కేఫే.. వేడి కాఫీ తాగుతూ వెళ్తుంటే ఆ కిక్కే వేరప్పా!

రాత్రివేళ లాంగ్ డ్రైవ్‌ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పక పాటించండి

ప్రపంచంలో వింతైన రైళ్లు.. వీటి ప్రయాణం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Big Stories

Advertisement
×