BigTV English

Redmi K70 Ultra: రెడ్‌మి కె 70 అల్ట్రా ప్రీ-ఆర్డర్స్ స్టార్ట్.. ఫోన్ మాత్రం అద్భుతంగా ఉంది బాసు..!

Redmi K70 Ultra: రెడ్‌మి కె 70 అల్ట్రా ప్రీ-ఆర్డర్స్ స్టార్ట్.. ఫోన్ మాత్రం అద్భుతంగా ఉంది బాసు..!

Redmi K70 Ultra Launching This Month: ప్రముఖ చైనీస్ టెక్ బ్రాండ్ షియోమి కంపెనీ తన రెడ్‌మి లైనప్‌లో కొత్త కొత్త ఫోన్లను రిలీజ్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే రెడ్‌మి ఫోన్లు మార్కెట్‌లోకి వచ్చి బాగా పాపులర్ అయ్యాయి. అందువల్లనే కంపెనీ తమ కొత్త ఫోన్లలో అద్భుతమైన ఫీచర్లు అందించి మరికొన్నింటిని తరచూ పరిచయం చేస్తుంది. ఇప్పుడు అదే పనిలో ఉంది. త్వరలో అంటే ఈ నెలలో Redmi K70 Ultra స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనుంది. ఈ విషయాన్ని Redmi ఇవాళ ప్రకటించింది.


అంతేకాకుండా ఈ ఫోనుకు సంబంధించిన ప్రీ-ఆర్డర్‌లు కూడా ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి. ఇందులో భాగంగానే వినియోగదారులు ప్రతి ప్రీ-ఆర్డర్‌తో Redmi Smart Band 2ని కూడా పొందుతారు. కాగా ఈ Redmi K70 Ultra ఫోన్ అత్యుత్తమమైనదిగా కంపెనీ పేర్కొంది. ఇప్పుడు ఈ Redmi K70 Ultra గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. Redmi గేమింగ్ అనుభవంపై ప్రస్తుతం ఫోకస్ పెట్టింది. తమ ఫోన్ వినియోగదారులకు అత్యుత్తమ గేమింగ్ అనుభవాన్ని అందించడానికి ప్రయత్నిస్తుంది.

ఈ ఫోన్‌లో అందించిన రిజల్యూషన్ కంటే తక్కువ రిజల్యూషన్‌లో గేమ్‌ను ఆడటం అండ్ దానిని తిరిగి మునుపటి రిజల్యూషన్‌కు పెంచడం ఇందులో ఉంటుంది. ఇది మంచి గేమింగ్ అనుభవాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek డైమెన్సిటీ 9300+ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. Xiaomi x TCL Huaxing సంయుక్తంగా అభివృద్ధి చేసిన C8+ బ్రైట్‌నెస్ మెటీరియల్‌ని యూజ్ చేస్తుంది.


Also Read: బడ్జెట్ కింగ్ మొబైల్ వచ్చేస్తోంది.. రెడ్ ‌‌మీ కొత్త స్మార్ట్‌ఫోన్.. అర్థమైందా రాజా!

దీనిపై Xiaomi చైనా మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్, Redmi బ్రాండ్ జనరల్ మేనేజర్ వాంగ్ టెంగ్ మాట్లాడుతూ.. Redmi K70 Ultra కొత్త తరం ఫోన్ 1.5K డిస్‌ప్లేను మొదటిసారిగా ప్రదర్శిస్తుందని తెలిపారు. ఇది ది బెస్ట్ ఐ ప్రొటెక్షన్‌ను అందిస్తుందని తెలిపారు. ప్యానెల్ క్వాలిటీలో మెరుగుదల చూడవచ్చని అన్నారు. ఇకపోతే ఈ ఫోన్ గురించి ఇప్పటి వరకు లీక్ అయిన సమాచారం ప్రకారం.. ఈ ఫోన్ గీక్‌బెంచ్ సింగిల్ టెస్ట్‌లో 2242 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్‌లో 7237 పాయింట్లు సాధించిందని తెలుస్తోంది.

ఇది 1.5K+120Hz మోడ్‌లో ‘జెన్‌షిన్ ఇంపాక్ట్’ని అమలు చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో డైమెన్సిటీ 9300+తో స్వతంత్ర గ్రాఫిక్స్ చిప్ కూడా ఉంది. ఇది 120W ఫాస్ట్ ఛార్జింగ్‌ మద్దతుతో 5500mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మెటల్ మిడిల్ ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్‌తో వస్తుంది. అలాగే డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్సీ కోసం IP68 రేటింగ్‌ను కలిగి ఉంది.

Tags

Related News

WhatsApp Scam: వాట్సాప్ నయా స్కామ్, షేర్ చేశారో అకౌంట్ ఖాళీ అవ్వడం పక్కా!

POCO M7 Plus 5G vs Vivo T4x 5G: పోకో, వివో ఫోన్ల గట్టి పోటీ.. ₹17,000 లోపు ధరలో ఏది బెస్ట్?

iPhone 14 Discount: ఐఫోన్ 14పై షాకింగ్ డిస్కౌంట్.. రూ.30000 వరకు తగ్గింపు!

Lava AMOLED 2 vs Moto G45 vs iQOO Z10 Lite: రూ.15000 బడ్జెట్‌లో కొత్త ఫోన్లు.. ఏది కొనుగోలు చేయాలంటే?

Pixel 9 Pro Fold Discount: గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్‌పై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ.43,000 తగ్గింపు..

HTC Vive Eagle Glasses: వాయిస్ కంట్రోల్‌తో వీడియో, ఫొటోలు తీసే ఏఐ గ్లాసెస్.. హెచ్‌టిసి వైవ్ ఈగల్ లాంచ్

Big Stories

×