EPAPER

Rybakina beats Elina: వింబుల్డన్ టైటిల్‌పై కన్నేసిన రిబకినా.. సెమీస్‌లో జకోవిచ్‌, అల్కరాస్

Rybakina beats Elina: వింబుల్డన్ టైటిల్‌పై కన్నేసిన రిబకినా.. సెమీస్‌లో జకోవిచ్‌, అల్కరాస్

Rybakina beats Elina: వింబుల్డన్ టోర్నమెంట్ క్లైమాక్స్‌కు చేరుకుంటోంది. పురుషుల విభాగంలో సెమీస్ బెర్తులు దాదాపు ఖరారయ్యాయి. ఇక మహిళల సింగిల్స్ విభాగం వంతైంది. తాజాగా స్వితోలినాపై విజయం సాధించి సెమీస్‌లో అడుగుపెట్టింది ఎలీనా రిబకినా. అంతేకాదు టైటిల్‌పై కన్నేసింది.


లండన్ వేదికగా వింబుల్డన్ టోర్నీ ఆసక్తికరంగా సాగుతోంది. బుధవారం సాయంత్రం జరిగిన మహిళ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో కజికిస్థాన్‌కు చెందిన నాలుగో సీడ్ క్రీడాకారిణి ఎలీనా రిబకినా- ఉక్రెయిన్‌కు చెందిన స్వితోలినాపై విజయం సాధించింది.

రెండు సెట్లను 6-3,6-2 తేడాతో విజయం సాధించి సెమీస్‌కు చేరింది ఎలీనా. పదునైన సర్వీసులతో కోర్టులో చెలరేగింది రిబకినా. చివరివరకు అదే దూకుడు కంటిన్యూ చేయడంతో స్వితోలినా చేతులెత్తేసింది. ఈ మ్యాచ్‌లో ఏడు ఏస్‌లు సంధించిన ఆమె, 28 విన్నర్లు కొట్టింది.


ఇక పురుషుల సింగిల్స్ విభాగంలో ఇటలీ ఆటగాడు లోరెంజో ముసెట్టి సెమీస్‌కు చేరాడు. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో అమెరికాకు చెందిన టేలర్ ఫ్రిట్జ్‌తో తలపడ్డాడు. తొలిసెట్ నుంచే ఇరువురు ఆటగాళ్లు మధ్య నువ్వానేనా అన్నరీతిలో పోరాటం సాగింది. తొలిసెట్‌ను సునాయాశంగా గెలుచుకున్న ఫ్రిట్జ్‌కు తర్వాత సెట్ నుంచి కష్టాలు మొదలయ్యాయి.

ఇటలీ ఆటగాడు ముసెట్టి దూసుకు ముందు రెండు, మూడు సెట్లలో తలవంచాడు. ప్రత్యర్థి బలాబలాలను అంచనా వేసిన ఫ్రిట్జ్, నాలుగో సెట్ ను కైవసం చేసుకున్నాడు. దీంతో ఫైనల్ సెట్ రసవత్తర పోరు సాగుతుందని అభిమానులు భావించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది. ముసెట్టి దూసుకుడు చేతులెత్తేశాడు ఫ్రిట్జ్.

దీంతో ఐదు సెట్లను 3-6, 7-6, 6-2, 3-6, 6-1 తేడాతో ముసెట్టి గెలిచి సెమీస్‌లో అడుగుపెట్టాడు. ఇక మ్యాచ్ ఎనాలసిస్ విషయానికొస్తే.. ముసెట్టి కంటే ఫ్రిట్జ్ ఎక్కువ ఏస్‌లు సంధించాడు. ఫస్ట్ సర్వీస్‌లో కాస్త వెనుకబడ్డాడు అమెరికా ఆటగాడు. సెకండ్ సర్వీసులో మాత్రం ప్రత్యర్థిపై పైచేయి సాధించాడు.

మరో సింగిల్ మ్యాచ్‌లో టైటిల్ ఫేవరేట్ నెంబర్ టూ సీడ్ ఆటగాడు నవోక్ జకోవిచ్ సెమీస్‌కు చేరాడు. తుంటి గాయంతో మ్యాచ్ ప్రారంభానికి ముందే ఆసీస్ ఆటగాడు డిమినార్ తప్పుకున్నాడు. దీంతో జకోవిచ్‌కు మాంచి రెస్ట్ దొరికింది. ఫెదరర్‌తో సమానంగా రికార్డు స్థాయిలో 13వ సారి వింబుల్డన్ సెమీస్‌లో అడుగుపెట్టాడు జకోవిచ్.

Tags

Related News

IND VS NZ: న్యూజిలాండ్ ను చిత్తు చేసిన టీమిండియా

Washington Sundar: 7 వికెట్లతో దుమ్ములేపిన వాషింగ్టన్ సుందర్..కుప్పకూలిన న్యూజిలాండ్ !

IND VS NZ: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్..3 మార్పులతో టీమిండియా !

IND VS NZ: నేటి నుంచే రెండో టెస్ట్..జట్ల వివరాలు, పిచ్ కాండీషన్స్ ఇవే !

Zimbabwe: టీ20ల్లో జింబాబ్వే ప్రపంచ రికార్డ్.. 20 ఓవర్లలో 344 పరుగులు

HCA: HCA ఎన్నికలు, వివాదాలపై సుప్రీంకోర్టు కీలక ప్రకటన !

IPL 2025: కేఎల్‌ రాహుల్‌ ఔట్‌..ఆ బౌలర్‌కు రూ.14 కోట్లు..లక్నో రిటైన్షన్‌ లిస్ట్‌ ఇదే !

Big Stories

×