E-Paper
Advertisement

బ్లూటూత్ కాలింగ్, 140+ స్పోర్ట్స్ మోడ్స్.. షియోమీ నుంచి రూ.5,000కే అమోలెడ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్!

బ్లూటూత్ కాలింగ్, 140+ స్పోర్ట్స్ మోడ్స్.. షియోమీ నుంచి రూ.5,000కే అమోలెడ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్!
Advertisement

Redmi Watch 6 Active: ప్రముఖ షియోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మీ నుంచి మరో కొత్త స్మార్ట్‌వాచ్‌ను చైనా మార్కెట్లో విడుదల చేసింది. ‘రెడ్‌మీ వాచ్  6 యాక్టివ్’ పేరుతో తీసుకొచ్చిన ఈ వాచ్.. స్టైలిష్ లుక్‌తో పాటు రోజువారీ వాడకానికి ఉపయోగపడే అనేక రకాల ఫీచర్లను అందిస్తోంది. బడ్జెట్ ధరలో లభించే ఈ స్మార్ట్‌వాచ్ వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకునేలా కనిపిస్తోంది.

కళ్లుచెదిరే డిస్‌ప్లే, అద్భుతమైన డిజైన్..

ఈ స్మార్ట్‌వాచ్‌లో 1.85 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. దీనిలో ఉన్న ఆల్వేస్ ఆన్ ఫీచర్ వల్ల సమయాన్ని ఎప్పటికప్పుడు సులువుగా చూసుకోవచ్చు. 1200 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ ఇస్తుండటంతో ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే స్క్రీన్ రక్షణ కోసం మైక్రో కర్వ్‌డ్ గ్లాస్ ఉపయోగించారు. గన్ మెటల్, పింక్ ఆరెంజ్, సిల్వర్ రంగుల్లో లభించే ఈ వాచ్ చేతికి చాలా తేలికగా, ప్రీమియం లుక్‌తో అమరుతుంది.

Advertisement

Also Read: 100% ఛార్జ్ చేయడం ఫోన్‌కు డేంజరా.. టెక్ నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా?

హెల్త్ ఫీచర్లు, స్పోర్ట్స్ మోడ్స్..

ఫిట్‌నెస్ ప్రియుల కోసం ఈ వాచ్‌లో 140 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్స్ ఇచ్చారు. నడక, రన్నింగ్, సైక్లింగ్ వంటి రోజువారీ వ్యాయామాలను ఇది ఆటోమేటిక్‌గా గుర్తించగలదు. ఇక ఆరోగ్య సంరక్షణ కోసం హృదయ స్పందన రేటు, రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను నిరంతరం పర్యవేక్షించే సెన్సార్లు ఉన్నాయి. నిద్ర నాణ్యత, మానసిక ఒత్తిడి, మహిళల ఆరోగ్య ట్రాకింగ్ వంటి ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. నీరు, దూళి నుంచి రక్షణ కోసం ఐపీ68 రేటింగ్ కూడా అందించారు.

బ్లూటూత్ కాలింగ్, ఇతర కనెక్టివిటీ..

Advertisement

ఈ స్మార్ట్‌వాచ్ ద్వారా నేరుగా ఫోన్ కాల్స్ మాట్లాడే సదుపాయం ఉంది. ఫోన్‌తో పనిలేకుండా వాచ్ నుంచే కాల్స్ మాట్లాడటానికి బ్లూటూత్ 5.3 టెక్నాలజీ ఉపయోగపడుతుంది. షియోమీ సొంత ఆపరేటింగ్ సిస్టమ్ సర్జ్ ఓఎస్‌పై పనిచేసే ఈ వాచ్ ద్వారా సంగీతం నియంత్రించడం, కెమెరా రిమోట్ కంట్రోల్, వెదర్ అప్‌డేట్స్, అలారమ్స్ వంటి అనేక ఫీచర్లను సులభంగా ఉపయోగించుకోవచ్చు.

బ్యాటరీ లైఫ్, ధర వివరాలు..

ఇందులో 470mah బ్యాటరీని అమర్చారు. సాధారణ వాడకంలో ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 18 రోజుల వరకు పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. డిస్‌ప్లే ఎప్పుడూ ఆన్‌లో ఉంచితే 6 రోజుల వరకు వస్తుంది. చైనాలో దీని ధర సుమారు రూ.4,900గా ఉంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్ల రెండింటికీ ఇది సపోర్ట్ చేస్తుంది.

Also Read: అద్భుతమైన AI ఫీచర్లు, కళ్లుచెదిరే డిజైన్‌తో కొత్త 5G ఫోన్ వచ్చేసింది.. ధర ఎంతంటే?

Tags

Related News

Jio రూ.299 vs Airtel రూ.349.. రెండిటిలో ఏ ప్లాన్ బెస్ట్.. దేనివల్ల బెనిఫిట్స్ ఎక్కువ?

కెమెరా హిస్టరీలోనే బిగ్ చేంజ్.. 68MP స్క్వేర్ సెల్ఫీ కెమెరాతో వస్తున్న కొత్త ఫోన్ ఇదే!

ఇదేందయ్యా ఇది..రూ.14 వేలకే 43 ఇంచుల స్మార్ట్ టీవీనా?

అద్భుతమైన AI ఫీచర్లు, కళ్లుచెదిరే డిజైన్‌తో కొత్త 5G ఫోన్ వచ్చేసింది.. ధర ఎంతంటే?

తక్కువ ధర..సూపర్ డిస్‌ప్లే! మార్కెట్‌లో..హల్ చల్ చేస్తున్న 5 వాచెస్

మల్టీటాస్కింగ్ అదరగొట్టాలా? అయితే.. ఈ 5 లెనోవో ల్యాప్‌టాప్స్ మీ కోసమే!

అద్భుతమైన లుక్, మిలిటరీ గ్రేడ్ బిల్డ్‌తో వచ్చేస్తున్న Lava Bold N4 Lite.. లాంచ్ ఎప్పుడంటే?

Big Stories

Advertisement
×