E-Paper
Advertisement

ఇండస్ట్రీలో విషాదం.. షావుకారు జానకి కన్నుమూత!

ఇండస్ట్రీలో విషాదం.. షావుకారు జానకి కన్నుమూత!
Advertisement

Sowcar Janaki:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ సీనియర్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న షావుకారు జానకి (Sowcar janaki) ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. వారం రోజుల క్రితం శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్న ఆమెను చెన్నైలోనే ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్చారు. ఆగస్టు 19 బుధవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురికాగా , వెంటనే ఆమెను ఐసీయూకి తరలించి వెంటిలేటర్ పై చికిత్స అందించారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి పై స్పందించిన వైద్యులు ఆమె ఆరోగ్యంగానే ఉందని, త్వరగా రికవరీ అవుతుందంటూ ప్రకటించారు. కానీ ఇంతలోనే ఆమె అనంత లోకాలకు వెళ్లిపోవడం అభిమానులను తీవ్ర దుఃఖానికి గురిచేస్తోంది.

కన్నుమూసిన షావుకారు జానకి..

94 సంవత్సరాల వయసున్న షావుకారు జానకి గత కొంతకాలంగా వృద్ధాప్యానికి సంబంధించిన సమస్యలతో పాటు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ చెన్నైలోని ఒక ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ.. ఆగస్టు 21 శుక్రవారం మధ్యాహ్నం 1:59 గంటలకు మరణించారు. 1949లో సినిమా ఇండస్ట్రీకి వచ్చిన షావుకారు జానకి దశాబ్దాల పాటు సినిమా ఇండస్ట్రీకి విశేష సేవలు అందిస్తూ హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ఇటీవల కాలంలో బామ్మగా కూడా అలరించిన ఈమె.. నేడు మరణించారనే వార్త అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ ఒక దిగ్గజాన్ని కోల్పోయింది అంటూ అటు ప్రముఖులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమె మరణానికి సంతాపం వ్యక్తం చేస్తూ..ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

Advertisement

also read:ఓటీటీలోకి లోకేష్ కనగరాజ్ డీసీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

రంగస్థలం నుండి పద్మశ్రీ వరకు..

రంగస్థలం పై నాటకాలు వేస్తూ వందలాది ప్రదర్శనలు ఇచ్చిన ఈమె.. తొలిసారి 1949లో సినీ రంగ ప్రవేశం చేశారు. 1950లో వచ్చిన తెలుగు చిత్రం షావుకారు సినిమా ఈమెకు మంచి విజయాన్ని అందించడంతో ఈ సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకొని షావుకారు జానకి అనే పేరుతో స్థిరపడ్డారు. ముఖ్యంగా తన సినీ కెరియర్లో సుమారుగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో కలుపుకొని 400కు పైగా చిత్రాలలో నటించారు. షావుకారు జానకి బడిపంతులు, సంసారం ఒక చదరంగం, ఎవడే సుబ్రహ్మణ్యం, బాబు బంగారం , కంచె తదితర తెలుగు చిత్రాలలో ఈమె పాత్రలు గుర్తుండిపోయాయి

సినీ సేవకు అందిన పురస్కారం..

Advertisement

ఇకపోతే సినీ పరిశ్రమకు అందించిన విశేష సేవకుగాను 2022లో పద్మశ్రీ అవార్డుతో కేంద్ర ప్రభుత్వం ఈమెను సత్కరించింది. అలాగే ఎన్నో నంది అవార్డులు అందుకున్న ఈమె తమిళనాడులో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే కళైమామణి తో పాటు ఎన్నో పురస్కారాలను సొంతం చేసుకున్నారు షావుకారు జానకి.

Related News

కన్నుమూసిన షావుకారు జానకి.. స్పందిస్తున్న సెలబ్రిటీలు!

పెద్ద వయసు అబ్బాయిలనే ఎందుకు ఇష్టపడతారు? రాశీ సింగ్ కామెంట్స్ వైరల్

స్పిరిట్ మూవీ నుండి దీపికాను తొలగించడంపై సందీప్ సోదరుడు క్లారిటీ!

వరుణ్ దావన్ బిగ్ అచీవ్‌మెంట్.. రియల్లీ గ్రేట్ అంతే..

‘రాకా’ విలన్ కు రెమ్యూనరేషన్ అన్ని కోట్లా..? రిస్క్ అవసరమా..?

‘ఇరుముడి’ ట్విట్టర్ రివ్యూ.. రవితేజ హిట్ కొట్టాడా..?

వితికా షేరు ఏం ఐడియా వేసిందబ్బా! రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే వరలక్ష్మీ దేవి అలంకరణ

Big Stories

Advertisement
×