E-Paper
Advertisement

రోబోట్ వాక్యూమ్ క్లీనర్ Vs హ్యాండ్‌హెల్డ్ వాక్యూమ్ క్లీనర్.. మీ ఇంటికి ఏది బెస్ట్?

రోబోట్ వాక్యూమ్ క్లీనర్ Vs హ్యాండ్‌హెల్డ్ వాక్యూమ్ క్లీనర్.. మీ ఇంటికి ఏది బెస్ట్?
Advertisement

Robot vacuum vs handheld vacuum cleaner: ఈ రోజుల్లో బిజీ లైఫ్ స్టైల్ వల్ల ఇల్లు ఊడవడం, తుడవడం అనేది ఒక పెద్ద టాస్క్‌గా మారిపోయింది. అందుకే మార్కెట్లో రకరకాల వాక్యూమ్ క్లీనర్లు సందడి చేస్తున్నాయి. ఇందులో ముఖ్యంగా ట్రెండింగ్‌లో ఉన్నవి రెండు-ఒకటి మనం అసలు శ్రమపడకుండా ఇల్లు తుడిచేసే ‘రోబోట్ వాక్యూమ్ క్లీనర్’, రెండు మనకు నచ్చిన మూలను పవర్‌ఫుల్‌గా క్లీన్ చేసే ‘హ్యాండ్‌హెల్డ్ వాక్యూమ్ క్లీనర్. మరి ఈ రెండింటిలో మీ అవసరాలకు ఏది పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది? ఏది కొంటే మీ మనీకి వాల్యూ ఉంటుందో ఇప్పుడు చూద్దాం!

రోబోట్ వాక్యూమ్ క్లీనర్:

మీరు రోజంతా ఆఫీస్ వర్క్‌తో బిజీగా ఉండి, ఇల్లు క్లీన్ చేయడానికి అస్సలు టైమ్ దొరకని వారైతే రోబోట్ వాక్యూమ్ క్లీనర్ మీకోసమే పుట్టింది. దీని మెయిన్ హైలైట్ ఏంటంటే.. ఇది పూర్తిగా ఆటోమేటిక్. మీరు ఆఫీస్‌లో ఉన్నా సరే, మీ మొబైల్ యాప్ ద్వారా కమాండ్ ఇస్తే ఇది ఇంట్లో తిరుగుతూ దూళిని క్లీన్ చేస్తుంది.

Advertisement

లేటెస్ట్ రోబోట్ క్లీనర్లలో వ్యాక్యూమింగ్‌తో పాటు మాపింగ్ (తడి క్లాత్ తో తుడవడం) ఫీచర్ కూడా ఉంటోంది. ఇవి ఇంటి మ్యాప్‌ను గుర్తుపెట్టుకుని, సోఫాల కింద, మంచాల కింద దూరి మరీ క్లీన్ చేస్తాయి. ఛార్జింగ్ అయిపో వస్తుందనగా అవే వెళ్ళి హోమ్ డాక్‌కు కనెక్ట్ అయి ఛార్జ్ అవుతాయి. అయితే.. దీని ధర కాస్త ఎక్కువ. సాధారణంగా మార్కెట్లో మంచి రోబోట్ క్లీనర్ ధర రూ. 15,000 నుండి ప్రారంభమై ఫీచర్లను బట్టి రూ. 40,000 వరకు ఉంటుంది. పైగా ఇవి మెట్లు ఎక్కలేవు, కేవలం ఫ్లోర్ మాత్రమే క్లీన్ చేయగలవు.

హ్యాండ్‌హెల్డ్ వాక్యూమ్ క్లీనర్:

రోబోట్ క్లీనర్లు కేవలం నేలను మాత్రమే క్లీన్ చేయగలవు. కానీ హ్యాండ్‌హెల్డ్ లేదా కార్డ్‌లెస్ స్టిక్ వాక్యూమ్ క్లీనర్లు అలా కాదు. వీటితో మీరు ఫ్లోర్‌తో పాటు సోఫాలు, బెడ్స్, కిటికీ రెక్కలు, కర్టెన్లు, కార్ సీట్లు , గోడల మూలల్లో ఉండే బూజును కూడా పవర్‌ఫుల్‌గా క్లీన్ చేయవచ్చు.

Advertisement

ఇందులో ఉండే సక్షన్ పవర్ (లాగే శక్తి) రోబోట్ క్లీనర్ల కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో పెంపుడు జంతువులు ఉండి, వాటి వెంట్రుకలు సోఫాలకు అంటుకుంటే.. వాటిని తీయడానికి హ్యాండ్‌హెల్డ్ క్లీనర్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. దీని ధర కూడా అందరికీ అందుబాటులో ఉంటుంది. మార్కెట్లో మంచి హ్యాండ్‌హెల్డ్ క్లీనర్లు రూ.3,000 నుండి రూ.12,000 లోపే లభిస్తాయి. అయితే, దీనితో సమస్య ఏంటంటే.. మనమే చేత్తో పట్టుకుని ఇల్లంతా తిరగాలి, అంటే శ్రమ మనదే.

Also Read: ఇక బెడ్ పైనుంచి లేవక్కర్లేదు.. రిమోట్ నొక్కితే చాలు! ఏసీ లాంటి గాలి

మీకు ఏది బెటర్?

మీరు అస్సలు శ్రమ పడకూడదు, కేవలం ఫ్లోర్ క్లీన్ అయితే చాలు అనుకుంటే.. కొంచెం బడ్జెట్ పెట్టుకుని రోబోట్ వాక్యూమ్ క్లీనర్ వైపు వెళ్ళిపోవచ్చు. ఇది మీ టైమ్‌ను చాలా సేవ్ చేస్తుంది.

ఒకవేళ మీ బడ్జెట్ తక్కువగా ఉండి, కేవలం ఫ్లోర్ మాత్రమే కాకుండా సోఫాలు, కార్లు, కిటికీలు ఇలా మల్టీపర్పస్ క్లీనింగ్ కావాలనుకుంటే ..హ్యాండ్‌హెల్డ్ వాక్యూమ్ క్లీనర్ బెస్ట్ ఛాయిస్.

స్మార్ట్‌గా ఆలోచిస్తే.. చాలా మంది ఇంట్లో డైలీ క్లీనింగ్ కోసం రోబోట్ క్లీనర్‌ను, వారానికి ఒకసారి డీప్ క్లీనింగ్ (సోఫాలు, కర్టెన్లు) కోసం చిన్న బడ్జెట్ హ్యాండ్‌హెల్డ్ క్లీనర్‌ను వాడుతున్నారు. మీ అవసరాలు ఏంటో చూసుకుని, దానికి తగ్గట్టుగా సరైన గ్యాడ్జెట్‌ను ఎంచుకోండి, మీ ఇంటిని ఎల్లప్పుడూ మెరిపించేయండి.

Tags

Related News

ధర తక్కువ.. బెనిఫిట్స్ ఎక్కువ.. Airtel టాప్ ఎంట్రీ లెవెల్ ప్లాన్స్ ఇవే!

2-పిన్, 3-పిన్ ప్లగ్‌ల మధ్య తేడా ఏంటి? ఇవి కేవలం డిజైన్ కోసమేనా లేక సేఫ్టీ కోసమా?

ల్యాప్‌టాప్ లైఫ్ ఎక్కువ రోజులు రావాలంటే షట్ డౌన్ చేయాలా? లేదా స్లీప్ మోడ్ బెటరా?

ఫోన్ ఛార్జ్ ఇట్టే పోతుందా? ఈ యాప్స్ ఏ కారణం!

120 ఏళ్ల నాటి రాక్షస చేప.. దోమల నివారణకు తెస్తే.. దీవినే మింగేస్తోంది..!

10 గంటలు బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే.. ఓరియంట్ ఫ్యాన్, కరెంట్ లేకపోయినా నో టెన్షన్

రూ.849కే పోర్టబుల్ స్పీకర్..సౌండ్ వింటే మైండ్ బ్లాక్!

రూ.699కే ఫైర్‌బోల్ట్ ఇయర్‌బడ్స్..అదిరిపోయే ఫీచర్లపై ఓ లుక్కేయండి

Big Stories

Advertisement
×