E-Paper
Advertisement

ipad Air pricing Error: రూ.80,000 ఐప్యాడ్‌ పొరపాటున కేవలం రూ.1,500కే సేల్.. తరువాత కస్టమర్లకు షాకిచ్చిన కంపెనీ

ipad Air pricing Error: రూ.80,000 ఐప్యాడ్‌ పొరపాటున కేవలం రూ.1,500కే సేల్.. తరువాత కస్టమర్లకు షాకిచ్చిన కంపెనీ
Advertisement

ipad Air pricing Error| ఎంత పెద్ద కంపెనీలైనా కొన్ని సార్లు ఎవరూ ఊహించని పెద్ద పెద్ద తప్పిదాలు చేస్తుంటాయి. దాని కారణంగా పెద్ద ఇబ్బందులు ఎదుర్కొవడం తప్పదు. తాజాగా ఇలాంటి అనుభవమే ఇటలీ దేశానికి చెందిన ఒక పెద్ద ఎలక్ట్రానిక్స్ రిటైలర్ కంపెనీ మీడియా వరల్డ్ (MediaWorld) కు ఎదురైంది. ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ కంపెనీకి చెందిన ఎంతో ఖరీదైన ఐప్యాడ్ ని అతి తక్కువ ధరకు కస్టమర్లకు విక్రయించేసింది. తీరా అదంతా ప్రైసింగ్ ఎర్రర్ (తప్పుడు ధర) అని చెప్పి కస్టమర్లకు కండీషన్లు పెట్టింది.

ఏం జరిగింది?

13 అంగుళాల ఆపిల్ ఐప్యాడ్ ఎయిర్ (Apple iPad Air) సాధారణంగా 879 యూరోలు (భారత కరెన్సీలో సుమారు రూ.80,000) ధర ఉంటుంది. కానీ ఒక టెక్నికల్ లోపం వల్ల లాయల్టీ ప్రోగ్రామ్ పేజీలో ఈ టాబ్లెట్ కేవలం 15 యూరోలకే (సుమారు రూ1,500)కే లిస్ట్ అయింది. ఇది చూసి చాలా మంది కస్టమర్లు ఈ అద్భుతమైన ఆఫర్‌తో వెంటనే లాభం పొందాలని ఆర్డర్ చేసేశారు.

తప్పు తెలుసుకున్న కంపెనీ

Advertisement

కొన్ని రోజుల తర్వాత MediaWorldకి తప్పుడు ధర గురించి తెలిసింది. భారీ నష్టం నుంచి తప్పించుకోవడానికి కంపెనీ వెంటనే కస్టమర్లు అందరికీ ఈ-మెయిల్ పంపించింది. “ఈ ధర పొరపాటున లిస్ట్ అయింది. ఇది తప్పుడు ధర. మేము ఈ ధరలో ఐప్యాడ్ ఎయిర్ ఇవ్వలేం” అని ఈ మెయిల్ లో పేర్కొంది. అలాగే ఆర్డర్ చేసిన వారికి రెండు కండీషన్లు పెట్టింది.

ఆప్షన్ 1: ఐప్యాడ్ తిరిగి ఇవ్వండి

ఇప్పటికే డెలివరీ పొందిన కస్టమర్లు.. టాబ్లెట్‌ను తిరిగి పంపితే మీ 15 యూరోలు పూర్తిగా తిరిగి రిఫండ్ చేస్తాం. అదనంగా కంపెనీ మీకు 20 యూరోలు విలువైన గిఫ్ట్ వౌచర్ కూడా ఇస్తుంది. కానీ ఐప్యాడ్ పర్ఫెక్ట్ కండీషన్‌లో ఉండాలి.

ఆప్షన్ 2: పూర్తి ధర చెల్లించాలి

Advertisement

ఐప్యాడ్ మీ దగ్గరే ఉంచుకోవాలంటే మిగిలిన బ్యాలెన్స్ మొత్తం చెల్లించాలి. కానీ కంపెనీ కొంచెం డిస్కౌంట్ ఇస్తానని చెప్పింది – అసలు ధర కంటే కొంచెం తక్కువకే ఇస్తారు.

కంపెనీ మెయిల్స్ చూసిన కస్టమర్లు చాలా మంది కోపంగా ఉన్నారు. “ఆర్డర్ కన్ఫర్మ్ అయింది కదా, ఇప్పుడు ఎలా మార్చేస్తారు?” అని అందరూ అడుగుతున్నారు. కొందరు లాయర్‌ని కలవాలని, కోర్టుకి వెళ్లాలని అనుకుంటున్నారు.

కస్టమర్లు ఏం చేయాలి?

  • కంపెనీ నుంచి వచ్చిన అన్ని మెయిల్స్, ఆర్డర్ కన్ఫర్మేషన్, పేమెంట్ రసీదులు సేవ్ చేసుకోవాలి.
  • రెండు ఆప్షన్లనూ జాగ్రత్తగా చదవండి.
  • ఐప్యాడ్ తిరిగి ఇస్తే పర్ఫెక్ట్ కండీషన్‌లో ఉండేలా చూసుకోండి.
  • డబ్బు చెల్లించి దాన్ని సొంతం చేసుకోవాలనుకున్నవారు. ఫైనల్ ధర ఎంత అని ముందే క్లారిటీ తీసుకోండి.
  • మీ తప్పు లేదు కాబట్టి.. ఇక ఆ ఐప్యాడ్ మీ సొంతం అని భావిస్తే లాయర్ సలహా తీసుకోండి.

ఆన్‌లైన్ షాపింగ్ చేసేవాళ్లకి ఒక హెచ్చరిక

ఇలాంటి ధరల తప్పులు ఎప్పుడైనా జరగొచ్చు. చాలా కంపెనీలు తప్పిదం జరిగిందని తక్కువ ధరలో డెలివరీ చేయవు. ఆర్డర్ క్యాన్సిల్ చేసేస్తాయి. కాబట్టి షాపింగ్ చేసేటప్పుడు టర్మ్స్, కండీషన్స్ (షరతులు) ఒకసారి చదవడం మంచిది. ఇప్పుడు ఈ ఐప్యాడ్ తప్పుడు ధర గురించే ఇటలీలో హాట్ టాపిక్ నడుస్తోంది.

Also Read: దేశంలో నకిలీ ఫోన్ల విక్రయాలు.. ఒకేసారి 100కు పైగా ఐఫోన్లు డెడ్..

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×