AC Explosion| ఎండాకాలంలో దాదాపు ప్రతీ ఇంట్లో ఎయిర్ కండిషనర్ల వినియోగం జరుగుతోంది. అది ఇల్లైనా, ఆఫీసైనా, షాపు అయినా. కానీ దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీ సెల్సియస్ దాటి భరించలేని స్థితికి చేరుకున్నాయి. అందుకే ఈ వేడి నుంచి ఉపశమనం కోసం ఎక్కువ శాతం ప్రజలు ఏసీలు ఉపయోగిస్తున్నారు. ఏసీలు చల్లని గాలిని అందించినా.. సరైన జాగ్రత్తలు పాటించకపోతే పేలిపోయే ప్రమాదం ఉంది. ఇటీవల చాలా ప్రాంతాల్లో ఏసీలు పేలిపోతున్న ఘటనలు జరుగుతున్నాయి. హైదరాబాద్ నగరంలో కూడా ఏసీ పేలిపయి 17 మంది చనిపోయారు. వీరిలో 8 మంది చిన్నపిల్లలే ఉండడం బాధాకరం. ఏసీలు పేలిపోవడానికి అసలైన కారణం వాటి వినియోగం సరిగా చేయకపోవడం.
ముఖ్యంగా మే, జూన్ నెలల్లో ప్రజలు వేడి నుంచి ఉపశమనం కోసం ఏసీల చలగాలిని ఆశ్రయిస్తారు. ఈ క్రమంలో 24 గంటలు ఏసీల వినియోగిస్తున్నారు. ఇలా విరామం లేకుండా ఏసీలు 24 గంటలూ రన్ చేస్తే అవి పేలిపోతున్నాయి. అందుకే సమ్మర్ సీజన్ లో జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం.
మే, జూన్ నెలలో ఏసీలు నడిపే సమయంలో ఈ టిప్స్ గుర్తుంచుకోండి
రెగులర్ సర్వీసింగ్: ఏసి సరిగా పనిచేస్తూ ఉండాలంటే రెగులర్ గా దాన్ని సర్వీస్ చేయిస్తూ ఉండాలి. ప్రతి 600 గంటల వినియోగం తరువాత ఏసీ సర్వీస్ తప్పనిసరిగా షెడ్యూల్ చేయాలి.
విరామం లేకుండా వినియోగించడం సరికాదు: చాలా మంది ఇండ్లలో, ఆఫీసుల్లో ఏసీని 15 గంటలపాటు ఆపకుండా ఆన్ లోనే ఉంచుతారు. ఇలా చేస్తే ఏసీ పేలిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఏసీని ప్రతి 4 నుంచి 5 గంటలు రన్ చేశాక దానికి ఒకటి లేదా రెండు గంటలపాటు ఆఫ్ చేయాలి.
ఫిల్టర్ క్లీన్ చేయాలి: ఏసీ ఫిల్టర్ లో ఎయిర్ ఫ్లో బాగా రావాలంటే.. దాని ఫిల్టర్ క్లీన్ గా ఉండడం తప్పనిసరి. అందులో దుమ్ము, ధూళి చేరితే కంప్రెసర్ పై కూలింగ్ పెంచడానికి ఒత్తిడి పెరుగుతుంది. అందుకే ఏసీ ఫిల్టర్ ని ప్రతి 4 నుంచి 5 వారాలకు క్లీన్ చేస్తూ ఉండాలి.
ఏసీలో నుంచి గ్యాస్ లీక్: ఏసీ నుంచి గ్యాస్ లీక్ అవుతూ ఉంటే అది పేలిపోయే ప్రమాదం ఉంది. ఇది చాలా సీరియస్ సమస్య. లీకవుతున్న గ్యాస్ వేడి కంప్రెసర్ కు తగిలితే అది పేలిపోతుంది. వేసవికాలంలో ఏసి లో నుంచి గ్యాస్ లీక్ కాకుండా జాగ్రత్తగా చెక్ చేస్తూ ఉండాలి. లీక్ అవుతుంటే వెంటనే దాన్ని రిపేర్ చేయించాలి.
Also Read: ఫోన్ చోరి అయిందా? దొంగలు ఆ ఫోన్ ఉపయోగించకుండా ఉండేందుకు కొత్త ఫీచర్
స్టేబిలైజర్ తప్పనిసరి: మీరు నివసించే ప్రాంతంలో కరెంట్ వోల్టోజ్ సరిగా లేకుంటే.. ఏసి డ్యామేజ్ కాకుండా స్టేబిలైజర్ వినియోగించాలి.
ఏసి టెంపరేచర్: ఏసీల వల్ల కరెంట్ వినియోగం ఎక్కువగా జరుగుతుంది. అందుకే ఏసీని 24 డిగ్రీల టెంపరేచర్ పై సెట్ చేసి పెట్టాలి. ఎక్కువగా మైనస్ టెంపరేచర్ లో పెడితే కరెంట్ వినియోగం చాలా ఎక్కువగా జరుగుతుంది.
ఈ జాగ్రత్తలనీ పాటిస్తే ఏసీ ప్రమాదాలు జరగకుండా వేసవి కాలం చల్లగా సాగిపోతుంది.