E-Paper
Advertisement

ఏఐ సునామీ.. సగం ఉద్యోగాలు మాయం? ఓపెన్ ఏఐ బాస్ సంచలన వ్యాఖ్యలు!

ఏఐ సునామీ.. సగం ఉద్యోగాలు మాయం? ఓపెన్ ఏఐ బాస్ సంచలన వ్యాఖ్యలు!
Advertisement

Sam Altman jobs warning: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచాన్ని ఏలుతున్న తరుణంలో.. ఉద్యోగ భద్రతపై సామాన్యుడి నుంచి సాఫ్ట్‌వేర్ నిపుణుల వరకు అందరిలోనూ ఒకటే ఆందోళన. ఈ ఉత్కంఠకు మరింత ఆజ్యం పోస్తూ.. చాట్ జీపీటీ సృష్టికర్త, ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టెక్ రంగంలో చర్చనీయాంశమయ్యాయి. ఏఐ ప్రభావంతో ప్రస్తుతం మనం చూస్తున్న చాలా ఉద్యోగాలు భవిష్యత్తులో కనుమరుగవుతాయని బాంబు పేల్చారు. అయితే ఈ మార్పు మానవజాతికి ముప్పు కాదు.. ఒక అద్భుతమైన మలుపు అని ఆయన ఊర‌ట‌నిచ్చారు.

శామ్ ఆల్ట్‌మన్ విశ్లేషణ ప్రకారం.. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ పాత పద్ధతులు మాయమవ్వడం సహజం. ఇప్పుడు ఏఐ కూడా అదే చేస్తోంది. “ప్రస్తుతం ఉన్న చాలా ఉద్యోగాలు త్వరలోనే చరిత్రగా మిగిలిపోతాయి. కానీ దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ ఉద్యోగాల స్థానంలో మనం ఊహించని నూతన ఉపాధి మార్గాలు పుట్టుకొస్తాయి.” అని ఆయన పేర్కొన్నారు. ఈ మార్పు వల్ల ప్రజల భవిష్యత్తు ఇప్పటికన్నా ఎంతో మెరుగ్గా, సుసంపన్నంగా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

ఉద్యోగాలు పోతే మనుషులు ఖాళీగా ఉంటారనే వాదనను ఆల్ట్‌మన్ పూర్తిగా తోసిపుచ్చారు. “ఏఐ యుగంలో మనుషులు గతంలో కంటే మరింత బిజీగా ఉంటారు. అయితే ఆ బిజీ రొటీన్ పనుల కోసం కాదు.. మరింత అర్థవంతమైన, సంతృప్తినిచ్చే సృజనాత్మక పనుల కోసం ఉంటుంది.” అని ఆయన విశ్లేషించారు. అంటే, మనిషి చేసే శ్రమ తగ్గుతుందని.. ఆలోచనలకు, ఆవిష్కరణలకు పదును పెట్టే పనులు పెరుగుతాయని ఆయన ఉద్దేశం. ఉద్యోగాలు పోతాయనే భయాలు కేవలం స్వల్పకాలికమేనని.. దీర్ఘకాలంలో మానవ నాగరికత మరో మెట్టు పైకి ఎక్కుతుందని ఆయన భరోసా ఇచ్చారు.

అయితే ఈ మార్పు అంత సులభంగా జరగదని ఆల్ట్‌మన్ హెచ్చరించారు. పాత రకమైన ఉద్యోగాల నుంచి కొత్త రకమైన నైపుణ్యాల వైపు మళ్ళే క్రమంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో కొంత అలజడి, సర్దుబాట్లు తప్పవని ఆయన అన్నారు. ప్రభుత్వాలు, సంస్థలు ఈ మార్పును తట్టుకునేలా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ ‘ట్రాన్సిషన్ పీరియడ్’ (Transition Period) లో వచ్చే ఒడిదుడుకులను సమర్థవంతంగా ఎదుర్కొంటేనే భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Read Also: ఆండ్రాయిడ్, ఐఫోన్ రెండింటికీ సూపర్.. Mi Band 6 ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×