Samsung Galaxy Watch 4: శాంసంగ్ గెలాక్సీ వాచ్ 4, క్లాసిక్ మోడల్ వాడుతున్న వినియోగదారులకు బ్యాడ్ న్యూస్. ఐదేళ్ల పాటు కంపెనీ అందించిన సాఫ్ట్‌వేర్ అప్డేట్స్‌ను ముగించేసింది. దీంతో ఒక నుంచి ఈ రెండు వాచ్‌లకు ఎలాంటి అప్డేట్స్ రావనే విషయాన్ని గ్రహించాలన్నమాట. సెప్టెంబర్ సెక్యూరిటీ బులిటెన్ ప్రకారం ఇక నుంచి ఈ మోడల్స్‌కు ఎలాంటి అప్‌డేట్స్ రావని శాంసంగ్ అధికారికంగా తెలియజేసింది. అయితే ఈ మార్పు ఆ మోడల్స్ వాచ్‌లపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఇన్నాళ్లు వాచ్‌లు అందించిన సేవలు ఎలా సాగాయన్నవి తెలుసుకుందాం.
2021 ఆగస్టులో విడుదలైన గెలాక్సీ వాచ్ 4, వాచ్ 4 క్లాసిక్ మోడల్స్ టెక్ ప్రపంచంలో ఓ సంచలనం సృష్టించాయి. అప్పటివరకు శాంసంగ్ తమ సొంత టీజెన్ సాఫ్ట్‌వేర్‌పై వాచ్‌లను నడిపించేది. కానీ గూగుల్‌తో కలిసి పనిచేసి ఈ వాచ్‌లతోనే తొలిసారిగా Wear OS ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టింది. దీనివల్ల మనకు గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకునే వీలు దొరికింది.
Also Read: ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక Passkeysను ఇలా ఈజీగా ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు!
సాధారణంగా ఏ కంపెనీ అయినా ఒకటి రెండు అప్‌డేట్లు ఇచ్చి చేతులు దులుపుకుంటుంది. కానీ శాంసంగ్ అలా చేయకుండా ఈ వాచ్‌లకు ఏకంగా 4 పెద్ద ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్లు ఇచ్చింది. మొదట్లో Wear OS 3.5తో వచ్చిన ఈ వాచ్‌లు క్రమంగా Wear OS 4, Wear OS 5, చివరగా Wear OS 6 వరకు అప్‌గ్రేడ్ అయ్యాయి. యూజర్ ఇంటర్‌ఫేస్ విషయానికి వస్తే One UI వాచ్ 4.5 నుంచి మొదలై లేటెస్ట్ One UI వాచ్ 8 వరకు అన్ని అప్డేట్స్‌ను పొందాం.
గత ఆగస్టు నెలలో వచ్చిన సెక్యూరిటీ ప్యాచ్‌తో ఈ వాచ్‌లకు చివరి అప్‌డేట్ అందడంతో కథ ముగిసింది. సెప్టెంబర్ నుంచి శాంసంగ్ క్వార్టర్లీ అప్‌డేట్ జాబితా నుంచి వీటిని పూర్తిగా తొలగించారు. ఇకపై కొత్తగా ఏవైనా సెక్యూరిటీ సమస్యలు తలెత్తితే వాటిని కంపెనీ ప్యాచ్ చేయదు. అయితే ఇక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. శాంసంగ్ గెలాక్సీ 4 వాచ్‌లో ఎప్పటిలాగే అన్ని ఫీచర్లను వాడుకోవచ్చు.
ప్రస్తుతం శాంసంగ్ సెక్యూరిటీ సపోర్ట్ జాబితా గెలాక్సీ వాచ్ 5 సిరీస్ నుంచి మొదలవుతోంది. వాచ్ 5తో పాటు గెలాక్సీ వాచ్ FE మోడల్ కూడా సేఫ్‌గా ఉంది. ఎందుకంటే.. FEఈ మోడల్ వాచ్ 4 హార్డ్‌వేర్‌తోనే వచ్చింది కాబట్టి.. దానికి ఇంకా సపోర్ట్ కొనసాగుతోంది. పాత టీజెన్ వాచ్‌లకు గత ఏడాదే సపోర్ట్ ఆగిపోగా.. ఇప్పుడు వాచ్ 4 వంతు వచ్చింది.
Also Read: రూ.10,000 లోపే 5G ఫోన్? Lava Bold N4 Proపై భారీ అంచనాలు.. ఫీచర్లు ఇవే!