Samsung Galaxy A07| శామ్‌సంగ్ కంపెనీ తాజాగా గెలాక్సీ A07 4G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లను అందిస్తుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా మరియు 5,000mAh భారీ బ్యాటరీ ఉన్నాయి. మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. అలాగే 8GB ర్యామ్ వరకు స్టోరేజ్ ఆప్షన్లను అందిస్తుంది.
శామ్‌సంగ్ గెలాక్సీ A07 4G వివిధ ర్యామ్, స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తుంది. 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ ఉన్న వేరియంట్ ధర సుమారు 7,500 రూపాయలు. 4GB ర్యామ్, 128GB స్టోరేజ్ ధర సుమారు 8,900 రూపాయలు. 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ ఉన్న మోడల్ ధర 10,500 రూపాయలు, అత్యంత భారీ వేరియంట్ 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ ధర 12,400 రూపాయలు. ఈ ఫోన్ బ్లాక్, గ్రీన్ లైట్ పర్పుల్ రంగుల్లో లభిస్తుంది.
డిస్‌ప్లే, డిజైన్
ఈ ఫోన్‌లో 6.7 అంగుళాల హెచ్‌డీ+ ఇన్ఫినిటీ-యూ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. ఇది 720×1600 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. ఫోన్ కొలతలు 164.4 మిమీ పొడవు, 77.4 మిమీ వెడల్పు, 7.6 మిమీ మందం, బరువు 184 గ్రాములు. ఇది తేలికైన ఫోన్‌గా ఉండి, బరువైన ఫోన్లతో ఇబ్బంది పడే వారికి సౌకర్యవంతంగా ఉంటుంది.
పనితీరు
గెలాక్సీ A07 4Gలో 6నానోమీటర్ ఆధారిత మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్ ఉంది. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారంగా వన్ యూఐ 7తో నడుస్తుంది. శామ్‌సంగ్ ఈ ఫోన్‌కు ఆరు సంవత్సరాల ఓఎస్ అప్‌డేట్‌లు, సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తుందని వాగ్దానం చేసింది. ఇందులో ఎల్‌పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్ ఉంది. 256జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో పాటు, మైక్రోఎస్‌డీ కార్డ్ ద్వారా 2టీబీ వరకు స్టోరేజ్‌ను విస్తరించవచ్చు.
కెమెరా వివరాలు
ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ కెమెరా తక్కువ వెలుతురులో కూడా స్పష్టమైన ఫోటోలను తీస్తుంది.
బ్యాటరీ, ఛార్జింగ్
శామ్‌సంగ్ ఈ ఫోన్‌లో 5,000mAh బ్యాటరీని అమర్చింది. ఇది 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది, దీంతో బ్యాటరీని త్వరగా రీఛార్జ్ చేయవచ్చు.
ఇతర ఫీచర్లు
ఈ ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. 4G కనెక్టివిటీ, బ్లూటూత్ 5.3, జీపీఎస్, వై-ఫై 802.11 a/b/g/n/ac (2.4/5 GHz), యూఎస్‌బీ టైప్-సీ, 3.5మిమీ ఆడియో జాక్‌లు ఉన్నాయి. ఇది ఐపీ54 రేటింగ్‌ను కలిగి ఉంది. ఇది నీరు, దుమ్ము నుంచి ఫోన్ కు రక్షణ కల్పిస్తుంది.
Also Read: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?