OTT Movie : సైకలాజికల్ థ్రిల్స్, ఊహించని ట్విస్ట్‌లతో ఒక హారర్ సినిమా ఓటీటీలో కేక పెట్టిస్తోంది. చివరి వరకు సీట్ ఎడ్జ్ థ్రిల్ తో కట్టిపడేస్తుంది. ఇందులో చనిపోయిన ఒక సైకో ఆత్మ కొంతమందిని ట్రాప్ చేస్తుంది. ఇది ఒక గేమ్ లా సాగుతుంది. ఒక్కో ట్విస్టుకు ఊపిరి బిగబెట్టాల్సిందే. ఎందుకంటే కంటెంట్ అంత ఘోరంగా ఉంటుంది. మనుషుల్ని హింసించే విధానం ఒక కొత్త స్టైల్ లో ఉంటుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో ఉంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
కథలోకి వెళ్తే
సా III ముగింపులో జాన్ అనే సైకో చనిపోతాడు. సా IVలో అతని ఆటలు కొనసాగుతాయని చూపిస్తుంది. సినిమా జాన్ శవపరీక్షతో ప్రారంభమవుతుంది. ఇక్కడ అతని కడుపులో ఒక ఆడియో టేప్ ను గుర్తించడం జరుగుతుంది. ఈ టేప్‌ను డిటెక్టివ్ మార్క్ హాఫ్‌మన్ వింటాడు. అందులో జాన్ తన ఆటలు ఇంకా ముగియలేదని చెబుతాడు.
ఈ కథ ప్రధానంగా కమాండర్ డేనియల్ రిగ్ చుట్టూ తిరుగుతుంది. అతను తన కోలీగ్స్ అయిన డిటెక్టివ్ ఎరిక్ మాథ్యూస్, హాఫ్‌మన్‌ను రక్షించడానికి జాన్ ఆడే ఆటలో చిక్కుకుంటాడు. ఇప్పుడు రిగ్‌కు 90 నిమిషాల సమయం ఉంటుంది. ఒక్కొక్క ట్రాప్‌ను దాటుకుంటూ, జాన్ సూచనలను పాటించాలి. ఈ ప్రయాణంలో అతను కొంతమంది వ్యక్తులను ఎదుర్కొంటాడు. వీళ్ళు జాన్ ట్రాప్‌లో చిక్కుకుని, తమను తాము రక్షించుకోవడానికి భయంకరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది.
మొదటి ట్రాప్‌లో, ఒక వ్యక్తి కళ్లు కుట్టివేయబడి, మరొకరి నోరు కుట్టివేయబడి, ఒక వించ్‌కు గొలుసులతో కట్టబడి ఉంటారు. రెండవ టెస్ట్‌లో, రిగ్ ఒక మహిళను రక్షించడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆమె అతనిపై దాడి చేస్తుంది. ఎందుకంటే ఆమెకు రిగ్‌ను చంపకపోతే జైలుకు వెళ్లాలని చెప్పబడి ఉంటుంది. ఈ గేమ్ ఇలా సాగుతుంటే, ఇంతలో FBI ఏజెంట్ స్ట్రామ్, జాన్ భార్య జిల్ టక్ నుండి జాన్ గతం తెలుసుకుంటాడు.
ఇక చివరి టెస్ట్‌లో, రిగ్ మీట్‌ప్యాకింగ్ ప్లాంట్‌కు చేరుకుంటాడు. అక్కడ ఎరిక్ మాథ్యూస్, హాఫ్‌మన్, ఆర్ట్ బ్లాంక్ ఒక ట్రాప్‌లో ఉంటారు. రిగ్ 90 నిమిషాల టైమర్ ముగిసేలోపు తలుపు తెరిస్తే, ఎరిక్ తల రెండు ఐస్ బ్లాక్స్ మధ్య నలిగిపోతుంది. హాఫ్‌మన్ ఎలక్ట్రోక్యూట్ అవుతాడు. చివరికి రిగ్ ఆ తలుపు తెరుస్తాడా ? జాన్ గతం ఏమిటి ? ఈ గేమ్ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
ప్రైమ్ వీడియోలో
‘సా IV’ (Saw IV) అనేది డారెన్ లిన్ బౌస్మాన్ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్-మిస్టరీ చిత్రం. ఇది సా సిరీస్‌లో నాల్గవ చిత్రం. సా III (2006) కు సీక్వెల్. ఇందులో టోబిన్ బెల్, కాస్టాస్ మాండిలోర్, స్కాట్ ప్యాటర్సన్, బెట్సీ రస్సెల్, లిరిక్ బెంట్ ప్రధాన పాత్రల్లో నటించారు. IMDbలో 5.9/10 రేటింగ్ తో ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఈ సినిమా $10 మిలియన్ బడ్జెట్‌తో, ప్రపంచవ్యాప్తంగా $140 మిలియన్లు సంపాదించింది.
Read Also : బ్రిడ్జి కింద మనుషుల ఎముకలు… 40 ఏళ్ల మిస్టరీ… మతిపోగొట్టే ట్విస్టులున్న ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్