Bhubaneswar Railway Station: ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ లోని కొత్త రైల్వే స్టేషన్ నుంచి పలు రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా భువనేశ్వర్ నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఈ రైళ్లు రాకపోకలు కొనసాగించనున్నాయి. మే 11 నుంచి ఈ రైళ్లు ప్రయాణీకులకు అందుబాటులోకి రానున్నాయి. కొత్త రైళ్లు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు మరింత కనెక్టివిటీని పెంచనున్నాయి. ఇండియన్ రైల్వే విడుదల చేసిన నోటిఫకేషన్ ప్రకారం మే 11 నుంచి మూడు ప్రధాన ఎక్స్‌ప్రెస్ రైళ్లు భువనేశ్వర్ కొత్త రైల్వే స్టేషన్ నుంచి కార్యకలాపాలను కొనసాగించనున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECoR) ప్రకటించింది.
ఇంతకీ ఆ రైళ్లు ఏవంటే?
ఈస్ట్ కోస్ట్ రైల్వే నోటిఫికేషన్ ప్రకారం.. త్వరలో ప్రారంభం కాబోయే మూడు రైళ్లు కోణార్క్ ఎక్స్ ప్రెస్ (ముంబై రూట్), విశాఖ ఎక్స్ ప్రెస్ (సికింద్రాబాద్ రూట్), ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ (విశాఖపట్నం రూట్). ఈ రైళ్లు ప్రధాన రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించడంతో పాటు ఒడిషా రాష్ట్ర రాజధాని ఉత్తర ప్రాంతంలో విస్తరిస్తున్న కటక్ నగర అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడనుంది.
⦿ ముంబై- భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్ ప్రెస్ (11019/11020)
ఈ రైలు మే 11 నుంచి భువనేశ్వర్ కొత్త రైల్వే స్టేషన్ నుంచి రాకపోకలు కొనసాగిస్తుంది. ఈ రైలు షెడ్యూల్ చేసిన సమయానికి భువనేశ్వర్ ప్రధాన స్టేషన్‌కు చేరుకుంటుంది. రాత్రి 11:55 గంటలకు బయలుదేరి, మంచేశ్వర్‌లో (12:02–12:04 am) కొద్దిసేపు ఆగి, 12:20 గంటలకు BBSN చేరుకుంటుంది. ముంబైకి తిరుగు ప్రయాణంలో ఇదే రైలు (11020) మే 12 నుండి మధ్యాహ్నం 2:40 గంటలకు భువనేశ్వర్ నుంచి బయల్దేరి, మంచేశ్వర్ లో 2 నిమిషాల పాటు ఆగుతుంది. మధ్యాహ్నం 3:00 గంటలకు ముంబైకి బయల్దేరుతుంది.
⦿ సికింద్రాబాద్- భువనేశ్వర్ విశాఖ ఎక్స్‌ప్రెస్ (17015/17016)
సికింద్రాబాద్‌కు వెళ్లే రైలు సర్వీస్ (17016) మే 11 నుంచి ప్రారంభం అవుతుంది. ముందు ఈ రైలు ప్రధాన స్టేషన్‌కు చేరుకున్న తర్వాత, సాయంత్రం 4:00 గంటలకు బయల్దేరుతుంది. మంచేశ్వర్‌లో ఆగుతుంది 2 నిమిషాలు ఆగుతుంది. సాయంత్రం 4:25 గంటలకు BBSN చేరుకుంటుంది. భువనేశ్వర్-సికింద్రాబాద్ రైలు (17015) మే 12 నుంచి ఉదయం 8:00 గంటలకు భువనేశ్వర్ కొత్త రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరి, మంచేశ్వర్‌లో ఆగుతుంది 2 నిమిషాలు ఆగుతుంది. ఉదయం 8:40 గంటలకు ప్రధాన స్టేషన్ నుండి బయలుదేరుతుంది.
Read Also: తెలుగు రాష్ట్రాలకు వందే భారత్ స్లీపర్ ట్రైన్.. వచ్చేది అప్పుడేనా?
⦿ విశాఖపట్నం-భువనేశ్వర్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ (22819/22820)
మే 12 నుండి ప్రారంభమయ్యే విశాఖపట్నం సర్వీస్ (22820) భువనేశ్వర్ కొత్త స్టేషన్ దగ్గర ప్రయాణం ముగుస్తుంది. ఈ రైలు ప్రధాన స్టేషన్ చేరుకున్న తర్వాత, ఉదయం 12:15 గంటలకు బయలుదేరి, మంచేశ్వర్‌లో2 నిముషాలు ఆగుతుంది. 12:35 గంటలకు కొత్త స్టేషన్ కు చేరుకుంటుంది. భువనేశ్వర్-విశాఖపట్నం రైలు (22819) ఉదయం 7:15 గంటలకు కొత్త స్టేషన్ నుంచి బయలుదేరి, మంచేశ్వర్ లో 2 నిమిషాలు ఆగుతుంది. ఉదయం 7:45 గంటలకు ప్రధాన స్టేషన్ నుండి బయలుదేరుతుంది.
Read Also: మల్కాజ్ గిరిలోనూ రైళ్లు ఆపండి.. కాచిగూడ కంటే ఇదే బెటర్!