Samsung Galaxy S25 : ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ సామ్సాంగ్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ మొబైల్స్ ను తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా జనవరి 2025లో జరగనున్న Samsung Unpacked ఈవెంట్‌లో Samsung Galaxy S25 సిరీస్ లాంఛ్ కానుంది. ఇందులో Samsung Galaxy S25, Samsung Galaxy S25 Plus, Samsung Galaxy S25 Ultra అనే మూడు కొత్త మెుబైల్స్ రాబోతున్నాయి. అయితే ఈ మెుబైల్ ఫీచర్స్ తో పాటు ప్రీ బుకింగ్స్ డీటెయిల్స్ తాజాగా లీక్ అయ్యాయి.
Samsung Galaxy S25 Ultra స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ వంటి ఫీచర్లతో భారతీయ మార్కెట్లోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఇది కొత్త కలర్ వేరియంట్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్ అయినందున, Samsung Galaxy S25లో 6.17 అంగుళాల AMOLED డిస్‌ప్లే రాబోతుంది. ఇక QHD+ రిజల్యూషన్, LTPO ప్యానెల్, HDR10+ స్టాండర్డ్ సపోర్ట్, 120Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉన్నాయి.
Samsung Galaxy S25 ఫీచర్స్ – సామ్సాంగ్ ఈ మొబైల్స్ లో పవర్ ఫుల్ ప్రాసెసర్ ను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగా Exynos లేదా Snapdragonను ఎంచుకునే ప్రయత్నం చేసింది. అయితే Samsung Galaxy S25ను MediaTek Dimensity 9400 SoCతో లాంఛ్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక సామ్‌సంగ్ మార్కెట్‌ను బట్టి ఎక్సినోస్ 2500 లేదా స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌లను మరోసారి ఎంచుకునే ఛాన్స్ ఉంది. అయితే ఈ చిప్‌సెట్‌తో సంబంధం లేకుండా ఫోన్ బేస్ వేరియంట్‌లో 12GB RAMను తీసుకొస్తుంది. ఈ చిప్‌సెట్ ఫోన్‌లో గెలాక్సీ AI ఫీచర్స్ ఉన్నాయి. ఇక ఇందులో 7 సంవత్సరాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లతో Android 15-ఆధారిత OneUI 7తో కూడా వచ్చే ఛాన్స్ ఉంది.
కెమెరా విషయానికి వస్తే.. Samsung Galaxy S25 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్‌తో 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉండనున్నాయి. ఇక డిస్ ప్లే పంచ్ హోల్ 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వచ్చేసింది. Samsung Galaxy S25 Ultra స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ తో రాబోతుంది. ఇక 16GB RAM + 1TB అంతర్గత స్టోరేజ్ తో హై ఎండ్ వేరియంట్‌లో అందించబడుతుంది. Samsung Galaxy AI ఫీచర్స్ సైతం ఉండనున్నాయి.
ఈ సిరీస్ లో మూడు మొబైల్స్ తో పాటు సామ్సాంగ్ స్లిమ్ మొబైల్ సైతం లాంఛ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్టు వార్తలు వినిపించినప్పటికీ.. కొద్ది రోజుల తేడాతో సామ్సాంగ్ స్లిమ్ మొబైల్ వచ్చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే నిజానికి ఈ మొబైల్స్ జనవరి 22న లాంఛ్ కాబోతున్నాయని తెలుస్తోంది. అయితే ఫ్రీ బుకింగ్స్ మాత్రం కొన్ని రోజుల తేడాతో మొదలుకానున్నట్టు సమాచారం. ఫిబ్రవరి 24, 2025 నుంచి ఈ మొబైల్స్ అందుబాటులోకి రానున్నాయని తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు దీనికి సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని సామ్సాంగ్ తన అధికార వెబ్సైట్లో వెల్లడించలేదు. ఇక త్వరలోనే లాంఛ్ కానున్న నేపథ్యంలో మరిన్ని ఫీచర్స్ వెల్లడయ్యో ఛాన్స్ కనిపిస్తుంది.
ALSO READ : రెడ్ మీ 14C లాంఛ్ డేట్ ఫిక్స్! దిమ్మతిరిగే ఫీచర్స్ బాస్