Action Thriller: ఒక ఊరిని కొన్ని కుటుంబాలు తమ గుప్పిట్లో పెట్టుకుని… చట్టం కంటే తమ మాటే ఎక్కువని చలాయిస్తే ? అలాంటి వ్యవస్థకు ఎదురుగా ఓ సాధారణ కుటుంబం నిలబడితే ఏం జరుగుతుంది ? ఏళ్లుగా దాచిపెట్టిన నిజాలు ఒక్కసారిగా బయటికి వస్తే పరిస్థితి ఎంత దారుణంగా మారుతుంది ? కుటుంబంపై జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఓ వ్యక్తి తిరిగి వస్తే… అతని పోరాటం ఎక్కడికి దారితీస్తుంది ? ఇలాంటి ప్రశ్నలతో సాగే ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘వరవు’ (Varavu – 2026). మరి ఈ మూవీని ఎక్కడ చూడవచ్చు ? కథ ఏంటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
ఓ చిన్న పట్టణంలో పొలాచన్ తన కుటుంబంతో సాధారణ జీవితం గడుపుతుంటాడు. అయితే ఆ ప్రాంతంలో ఏళ్లుగా డబ్బు, రాజకీయ పలుకుబడి, అధికారాన్ని అడ్డుపెట్టుకుని తమ మాటే చట్టంగా నడిపించే ఓ శక్తివంతమైన వర్గం ఉంటుంది. సామాన్య ప్రజలు వాళ్లను ఎదిరించే పరిస్థితి ఉండదు. అలాంటి వ్యవస్థ దృష్టి అనుకోకుండా పొలాచన్ కుటుంబంపై పడుతుంది. ఆ తర్వాత అతని కుటుంబం ఊహించని సమస్యల్లో చిక్కుకుంటుంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆ వర్గం చేసే అరాచకానికి కుటుంబం తీవ్రంగా నష్టపోతుంది.
తమకు ఎదురే లేదన్నట్టుగా వ్యవహరించే ఆ వ్యక్తుల అసలు రూపం బయట పడటం మొదలవుతుంది. కానీ జరిగిన అన్యాయాన్ని అక్కడితో వదిలేయడానికి పొలాచన్ సిద్ధంగా ఉండడు. ఇదే సమయంలో గతంలో జరిగిన కొన్ని విషయాలను వెలికి తీయడానికి ఓ వ్యక్తి తిరిగి వస్తాడు. అతని రాకతో ఆ ఊరిలో ఎన్నో ఏళ్లుగా దాచిపెట్టిన రహస్యాలు కదలడం మొదలవుతుంది. అధికారుల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు… ఎవరెవరు ఈ వ్యవస్థకు అండగా నిలిచారనే విషయాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి.
విచారణ ముందుకు సాగుతున్న కొద్దీ ఇది కేవలం ఓ కుటుంబానికి జరిగిన అన్యాయం కాదని అర్థమవుతుంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న అవినీతి, మోసాలు, అబద్ధాల వెనుక ఉన్న అసలు వ్యక్తులు ఎవరో తెలుసుకునే కొద్దీ ఘర్షణ మరింత ముదురుతుంది. పోలీస్ వ్యవస్థతో జరిగే మైండ్ గేమ్స్, రాజకీయ ఒత్తిళ్లు, ప్రత్యర్థుల దాడులు కథను మరింత రా అండ్ ఇంటెన్స్ గా మారుస్తాయి. చివరికి ఇంత బలమైన వ్యవస్థను ఓ సాధారణ వ్యక్తి ఎలా ఎదుర్కొన్నాడు ? పొలాచన్ కుటుంబానికి జరిగిన అన్యాయానికి న్యాయం ఎలా దక్కింది ? ఏళ్లుగా దాచిన నిజాలన్నీ బయటకు వచ్చిన తర్వాత ఆ ఊరి అధికార వ్యవస్థకు ఏం జరిగింది ? అనేదే ‘వరవు’లో చూడాల్సిన కథ.
‘వరవు’ సెప్టెంబర్ 11 నుంచి ZEE5లో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో విడుదలైన దాదాపు రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. డార్క్ టోన్, రా యాక్షన్, పవర్ పాలిటిక్స్, ప్రతీకార కథాంశాలతో సాగే సినిమాలు ఇష్టపడే వాళ్లకు ‘వరవు’ మంచి వీకెండ్ వాచ్ అవుతుంది. మలయాళ స్టార్ జోజు జార్జ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి షాజీ కైలాస్ దర్శకత్వం వహించారు. ఎ.కె. సాజన్ కథ అందించగా, సామ్ సీఎస్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తో యాక్షన్ సన్నివేశాలు అదిరిపోతాయి.
Read Also: పత్రిక మూతపడే ముప్పులో పడ్డా వెనక్కి తగ్గని రిపోర్టర్లు… న్యూస్‌రూమ్ థ్రిల్లర్ ను డోంట్ మిస్