E-Paper
Advertisement

మీడియాటెక్ ప్రాసెసర్‌తో Samsung Galaxy Tab S12 Ultra.. లాంచ్‌కు ముందే పూర్తి వివరాలు లీక్!

మీడియాటెక్ ప్రాసెసర్‌తో Samsung Galaxy Tab S12 Ultra.. లాంచ్‌కు ముందే పూర్తి వివరాలు లీక్!
Advertisement

Samsung Galaxy Tab S12 Ultra: ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ నుంచి మరో ఫ్లాగ్‌షిప్ ట్యాబ్లెట్ మార్కెట్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. కంపెనీ త్వరలో Galaxy Tab S12 సిరీస్‌ను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తుండగా.. ఇందులో ప్రీమియం మోడల్ Galaxy Tab S12 Ultra తాజాగా గూగుల్ ప్లే కన్సోల్‌లో కనిపించింది. దీంతో ఈ ట్యాబ్లెట్‌కు సంబంధించిన కీలక వివరాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే Galaxy Tab S12 Plusకు సంబంధించిన లీకులు వెలువడగా.. ఇప్పుడు Ultra మోడల్ కూడా లిస్టింగ్‌లో కనిపించడం సిరీస్ లాంచ్‌కు మరింత బలం చేకూరుస్తోంది.

3 వేరియంట్లలో అల్ట్రా మోడల్..

గూగుల్ ప్లే కన్సోల్ లీక్స్ ప్రకారం.. శాంసంగ్ ఈ ట్యాబ్‌ను మూడు మోడల్ నెంబర్లతో తెస్తోంది. కేవలం వైఫై సపోర్ట్ చేసే మోడల్ నెంబర్ SM-X940 కాగా, 5G నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేసే మరో రెండు సెల్యులార్ వేరియంట్లు SM-X946B, SM-X946N పేర్లతో రానున్నాయి. వేర్వేరు దేశాల కోసం వేర్వేరు మోడళ్లను సిద్ధం చేస్తున్నందున.. ఈసారి గ్లోబల్ మార్కెట్‌తో పాటు భారతదేశంలో కూడా దీని లాంచ్ ఉండే అవకాశం ఉంది.

Advertisement

Also Read: టెక్ వరల్డ్‌లో శాంసంగ్ సంచలనం.. ఒకేసారి 4 కొత్త ఫోల్డబుల్ ఫోన్లు, లాంచ్ ఎప్పుడంటే?

మీడియాటెక్ ప్రాసెసర్ వాడనున్నారా?

గతంలో వచ్చిన గీక్‌బెంచ్ లీక్స్ ఆధారంగా చూస్తే.. ఈ కొత్త అల్ట్రా ట్యాబ్‌లో మీడియాటెక్ డిమ్యాన్సిటీ 9500 ప్రాసెసర్‌ను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాసెసర్ వేగం, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చేలా డిజైన్ చేశారు. సాధారణంగా శాంసంగ్ తమ ప్రీమియం ట్యాబ్‌లలో వేరే చిప్‌సెట్‌లను వాడుతుంటుంది. కానీ ఈసారి మీడియాటెక్ వైపు మొగ్గు చూపడం విశేషం. ఇది నిజమైతే మాత్రం ప్రాసెసింగ్, గేమింగ్ విషయంలో ఈ ట్యాబ్ చాలా స్పీడ్‌గా పనిచేస్తుంది.

సిరీస్‌లో మొత్తం 3 మోడళ్లు..

Advertisement

కేవలం అల్ట్రా మోడల్ మాత్రమే కాకుండా.. శాంసంగ్ ఈ సిరీస్‌లో Galaxy Tab S12 Plus, బేసిక్ మోడల్ Tab S12ను కూడా లాంచ్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే Tab S12 Plusకు సంబంధించిన గ్లోబల్, ఆసియా, అమెరికా వేరియంట్ల సమాచారం కూడా ఆన్‌లైన్‌లో బయటికొచ్చింది. వినియోగదారులకు వారి అవసరాలు, బడ్జెట్‌ను బట్టి నచ్చిన మోడల్‌ను ఎంచుకునే వెసులుబాటును కంపెనీ కల్పించబోతోంది.

ధర, లాంచ్ వివరాలు ఇలా..

ప్రస్తుతానికి కంపెనీ అధికారికంగా ఈ కొత్త సిరీస్ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. కాబట్టి.. దీని అసలు ఫీచర్లు, భారత్‌లో వీటి ధర ఎంత ఉంటుంది? ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? అనే విషయాలపై ఇంకా స్పష్టత లేదు. అయితే వరుసగా గూగుల్ ప్లే కన్సోల్‌లో ఇవి దర్శనమిస్తుండటంతో.. రాబోయే కొన్ని వారాల్లోనే శాంం‌సంగ్ ఈ లైనప్‌ను అధికారికంగా మార్కెట్‌లోకి పరిచయం చేసే అవకాశం ఉంది.

Also Read: 1200mAh బ్యాటరీ, IP52 రేటింగ్‌తో వస్తున్న కొత్త HMD 4G ఫోన్.. ధర కూడా తక్కువే!

Tags

Related News

యూట్యూబ్‌లో ఏ వీడియో క్వాలిటీకి ఎంత డేటా ఖర్చవుతుందో తెలుసా?

ఐఫోన్ బ్యాటరీని బ్యాక్‌గ్రౌండ్‌లో తినేస్తున్నది ఇదే.. ఈ ఒక్క సెట్టింగ్ మార్చండి చాలు!

ఫోన్ అడిక్షన్ అనుకుంటున్నారా? ఉదయాన్నే ఫోన్ చూడటం వెనుక అసలు సైకాలజీ ఇదే!

పవర్ బ్యాంక్‌ వాడుతున్నారా? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు!

ఆపిల్ వాచ్..పాత లుక్కే అయినా పర్ఫార్మెన్స్‌లో అదుర్స్!

రూ.50 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీలు..అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఇవే బెస్ట్!

ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

బ్లూటూత్ తరచూ డిస్‌కనెక్ట్ అవుతోందా?నిమిషాల్లో ఇలా సాల్వ్ చేసుకోండి!

Big Stories

Advertisement
×