Surekha Vani: సురేఖ వాణి (Surekha Vani) .. ఈమె గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. కరోనా వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా మారిపోయింది. కానీ ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ తన అద్భుతమైన నటనతో, కామెడీ ఎక్స్ప్రెషన్స్ తో అందరిని ఆకట్టుకునేది. 2015 నాటికే 45 సినిమాలకు పైగా నటించి.. తన నటనతో అందరి హృదయాలను దోచుకుంది. 1981 ఏప్రిల్ 29న ఆంధ్రప్రదేశ్ విజయవాడలో జన్మించిన సురేఖ వాణికి.. చిన్నప్పటినుంచే సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే 8వ తరగతి చదివేటప్పుడే విజయవాడలోని ఒక ప్రాంతీయ ఛానల్ లో ఒక పిల్లల కార్యక్రమానికి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించింది.
నటిగానే కాదు హోస్ట్ గా కూడా గుర్తింపు..
ఇంటర్మీడియట్ పూర్తి అయ్యేసరికి పూర్తిస్థాయి వ్యాఖ్యాతగా మారిన ఈమె.. పెళ్లయిన తర్వాత ప్రముఖ టీవీ ఛానల్ లో భర్తతో కలిసి ‘మా టాకీస్’, ‘హార్ట్ బీట్’ అనే కార్యక్రమాలతో పాటు భర్త దర్శకత్వంలో వచ్చిన ‘మొగుడ్స్ పెళ్లామ్స్’ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించింది సురేఖ వాణి. ఇక 2005లో వచ్చిన ‘శీనుగాడు చిరంజీవి ఫ్యాన్’ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సురేఖ ‘భద్ర’, ‘బొమ్మరిల్లు’ సినిమాలలో తన పాత్రలతో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇకపోతే కెరియర్ పీక్స్ లో ఉండగానే కరోనా మహమ్మారి రావడంతో వచ్చిన అవకాశాలు కూడా కోల్పోయాయి. ఇక చివరిగా కన్నప్ప సినిమాలో ఈమె భాగమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ జూన్ 27న సినిమా రిలీజ్ అయ్యే వరకు ఈమె పాత్ర ఉందా లేదా అన్నది సస్పెన్స్ గానే మిగిలిందని చెప్పవచ్చు.
టాటూ వేయించుకున్న సురేఖ వాణి..
ఇకపోతే కరోనా దగ్గర నుంచి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ చిట్టి పొట్టి బట్టలతో అటు నెటిజన్స్ చేత ట్రోల్స్ ఎదుర్కొంటూ కూడా జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది సురేఖ వాణి. తన కూతురు సుప్రీతా తో కలిసి పలు వెకేషన్ కి వెళ్తూ మరింత బిజీగా మారిపోయింది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనకు చెందిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకునే ఈమె.. తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు ఇది కాస్త వైరల్ గా మారింది. ఇందులో ఈమె శ్రీవారి పాదాలను తన చేతి మీద టాటూగా వేయించుకుంది.
ALSO READ: HBD Actress Sarada: ఆమె పెట్టిన శాపం.. శారద జీవితాన్ని నరకంగా మార్చిందా?
ఆ పెదబాబు వెనకే నా అడుగులు – సురేఖ వాణి
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోని, వీడియోని కూడా ఆమె సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ.. “ఆ పెదబాబు అడుగుల వెనకే ఉన్నాను” అంటూ క్యాప్షన్ కూడా జోడించింది. ఇకపోతే క్యాప్షన్ చూసి ఎవరా పెదబాబు అని నెటిజన్స్ కామెంట్లు చేశారు. కానీ ఆ తర్వాత ఆమె శ్రీ వెంకటేశ్వర స్వామి పాదరక్షలను టాటుగా వేయించుకుందని తెలిసి ఆమెకు స్వామి పై ఉన్న భక్తిని చూసి మురిసిపోతున్నారు. మొత్తానికైతే సురేఖ వాణి తన చేతిపై టాటూ వేయించుకుంటున్న వీడియో షేర్ చేయడంతో.. ఆ టాటూ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==