E-Paper
Advertisement

గోల్డెన్ ఛాన్స్ భయ్యా.. ఏకంగా రూ.65,000 తగ్గింపు.. శాంసంగ్ ప్రీమియం ఫోన్‌పై ఊహించని డీల్!

గోల్డెన్ ఛాన్స్ భయ్యా.. ఏకంగా రూ.65,000 తగ్గింపు.. శాంసంగ్ ప్రీమియం ఫోన్‌పై ఊహించని డీల్!
Advertisement

Galaxy Z Fold 4 Price Drop: ప్రీమియం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి ఇది నిజంగా అద్భుతమైన అవకాశం. ఒకప్పుడు సామాన్యులకు అందుబాటులో లేని ధరలో ఉన్న శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 4 ఫోన్.. ఇప్పుడు భారీ ధర తగ్గింపుతో అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఎక్స్ఛేంజ్ ఆఫర్లను కూడా ఉపయోగించుకుంటే ఈ ఫోన్‌ను రూ. 50,000 కంటే తక్కువ ధరకే దక్కించుకోవచ్చు.

సగం పైనే తగ్గింపు:

భారత మార్కెట్లో 2022లో ఈ ఫోన్ (12GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్) విడుదలైనప్పుడు దీని ధర రూ.1,54,999గా ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా రూ.65,000 నేరుగా తగ్గిస్తూ.. ఈ ఫోన్‌ను రూ.89,999కే అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ భారీ ఆఫర్ కేవలం ‘గ్రేగ్రీన్’ కలర్ వేరియంట్‌పై మాత్రమే అందుబాటులో ఉంది. అయితే స్టాక్ మరియు మీరు ఉండే ప్రాంతాన్ని బట్టి ఈ ఆఫర్ మారే అవకాశం ఉంది.

Advertisement

Also Read: ఏకంగా 9000mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్‌తో కొత్త సిరీస్.. ఫీచర్లు లీక్!

ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో మరింత చౌకగా:

మీ దగ్గర ఉన్న పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా ఈ ఫోన్ ధరను మరింత తగ్గించుకోవచ్చు. ఈ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ కింద గరిష్టంగా రూ.40,350 వరకు తగ్గింపు లభిస్తుంది. మీ పాత ఫోన్ కండిషన్, బ్రాండ్ ఆధారంగా ఈ తగ్గింపు వర్తిస్తుంది. ఒకవేళ మీకు పూర్తి ఎక్స్ఛేంజ్ వాల్యూ దక్కితే.. శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 4 ఫోన్‌ను కేవలం రూ.49,649 కే సొంతం చేసుకోవచ్చు.

మెరుగైన పనితీరు:

Advertisement

ఇది కొంచెం పాత మోడల్ అయినప్పటికీ.. దీని ఫీచర్లు మాత్రం నేటికీ అద్భుతంగా ఉన్నాయి. ఇందులో 6.2 అంగుళాల కవర్ డిస్‌ప్లేతో పాటు, లోపల 7.6 అంగుళాల డైనమిక్ అమోలెడ్ 2X ఫోల్డబుల్ స్క్రీన్‌ను ఇచ్చారు. ఇవి రెండూ 120Hz రీఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తాయి. దీనివల్ల మల్టీటాస్కింగ్, గేమింగ్ అనుభవం చాలా స్మూత్‌గా ఉంటుంది. ఇందులో ఉన్న స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్ ఫోన్ వేగాన్ని పెంచుతుంది.

బ్యాటరీ సామర్థ్యం ఎంతంటే?

ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. దీనిలో 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రావైడ్, 10MP టెలిఫోటో కెమెరాలతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇక సెల్ఫీల కోసం 10MP కెమెరా ఇచ్చారు. ఈ ఫోన్‌లో 4400mAh బ్యాటరీ ఉంది. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. తక్కువ బడ్జెట్‌లో ఫోల్డబుల్ ఫోన్ అనుభూతిని పొందాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

Also Read: Google Pixel 10పై భారీ ధర తగ్గింపు.. ఆఫర్ ధరెంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు!

Related News

ధర తక్కువ.. బెనిఫిట్స్ ఎక్కువ.. Airtel టాప్ ఎంట్రీ లెవెల్ ప్లాన్స్ ఇవే!

2-పిన్, 3-పిన్ ప్లగ్‌ల మధ్య తేడా ఏంటి? ఇవి కేవలం డిజైన్ కోసమేనా లేక సేఫ్టీ కోసమా?

ల్యాప్‌టాప్ లైఫ్ ఎక్కువ రోజులు రావాలంటే షట్ డౌన్ చేయాలా? లేదా స్లీప్ మోడ్ బెటరా?

ఫోన్ ఛార్జ్ ఇట్టే పోతుందా? ఈ యాప్స్ ఏ కారణం!

120 ఏళ్ల నాటి రాక్షస చేప.. దోమల నివారణకు తెస్తే.. దీవినే మింగేస్తోంది..!

10 గంటలు బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే.. ఓరియంట్ ఫ్యాన్, కరెంట్ లేకపోయినా నో టెన్షన్

రూ.849కే పోర్టబుల్ స్పీకర్..సౌండ్ వింటే మైండ్ బ్లాక్!

రూ.699కే ఫైర్‌బోల్ట్ ఇయర్‌బడ్స్..అదిరిపోయే ఫీచర్లపై ఓ లుక్కేయండి

Big Stories

Advertisement
×