E-Paper
Advertisement

Kavitha EC: ఈసీ నోటీసులపై తిరగబడ్డ కవిత.. ఢిల్లీ లాయర్లతో న్యాయపోరాటానికి స్కెచ్!

Kavitha EC: ఈసీ నోటీసులపై తిరగబడ్డ కవిత.. ఢిల్లీ లాయర్లతో న్యాయపోరాటానికి స్కెచ్!
Advertisement

Kavitha EC: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో మరో సరికొత్త వివాదం జరుగుతుంది. కల్వకుంట్ల కవిత కొత్తగా స్థాపించిన తెలంగాణ రక్షణ సేన పార్టీ పేరు.. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) పరిధిలో అభ్యంతరాల సుడిగుండంలో చిక్కుకుంది. పార్టీ ప్రారంభించిన నాటి నుంచి ‘పేరు’ చుట్టూ వివాదం నడుస్తున్నది. ఈసీ తాజా నోటీసులతో ‘ఈసీ వర్సెస్ కవిత’గా మారింది. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాన్ని వేడెక్కించడమే కాకుండా న్యాయపోరాటానికి దారితీసే పరిస్థితులను సృష్టించింది. పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా ఈసీ ముందుకు వచ్చిన అభ్యంతరాలు, దానికి కవిత వర్గం ఇస్తున్న కౌంటర్లు ఇప్పుడు సరికొత్త రాజకీయ రణరంగాన్ని తలపిస్తున్నాయి.

1500లకు పైగా ఫిర్యాదులు.. ప్రత్యామ్నాయ పేర్లపై ఈసీ కొర్రీ!

కవిత ప్రతిపాదించిన పార్టీ పేరుపై ఆది నుంచీ వివాదం నడుస్తోంది. పార్టీకి ఈసీ మొదట ‘తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్)’ అనే పేరును పరిశీలనలోకి తీసుకున్నప్పటికీ, ఆ సంక్షిప్త నామంపై ఆది నుంచి వివాదం కొనసాగుతూనే ఉంది. పూర్వపు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకునేందుకే కవిత ఈ పేరు పెట్టారంటూ తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈసీకి ఈ పేరుపై దాదాపు 1500లకు పైగా ఫిర్యాదులు, అభ్యంతరాలు అందినట్లు సమాచారం. రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. ఈ భారీ సంఖ్యలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన ఈసీ.. సదరు పేరుతో సాంకేతిక, చట్టపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని భావించింది. ఈ నేపథ్యంలోనే.. వివాదాలకు తావులేకుండా ఉండేందుకు మరో 3 ప్రత్యామ్నాయ పేర్లను పంపాల్సిందిగా కవితకు ఈసీ సూచించింది. కవితకు లేఖ రాసింది. 15 రోజుల్లోగా తమకు సమర్పించాలని ఈసీ స్పష్టం చేసింది. లేనిపక్షంలో దరఖాస్తును క్లోజ్ చేస్తామని హెచ్చరించినట్లు సమాచారం.

‘తెలంగాణ రక్షణ సేన’ మాదే..

Advertisement

తాము చట్టబద్ధంగా, అన్ని నిబంధనలకు లోబడే ‘తెలంగాణ రక్షణ సేన’ పేరును ఎంచుకున్నామని కవిత అనుచరులు పేర్కొంటున్నారు. ఈ పేరు మార్చాల్సిన అవసరం లేదని వారు స్పష్టం చేస్తున్నారు. ఈసీ లేఖకు తెలంగాణ రక్షణ సేన సమాధానాలు పంపినట్లు తెలిపారు. కేవలం రెండు అభ్యంతరాలకు మాత్రమే ఈసీ తమకు పంపిందని, మిగతా అభ్యంతరాలు చెప్పకుండా ప్రత్యామ్నాయపేర్లు ఎలా అడుగుతారని కవిత ప్రశ్నించింది. గతంలోనే టీఆర్ఎస్ పేరుపై తెలంగాణ రాజ్య సమితి, మహారాష్ట్ర షోలాపూర్ కు చెందిన తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన అభ్యంతరాలపై కవిత రిప్లై ఇచ్చింది. ఎక్కువ అభ్యంతరాలు వచ్చిన ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తామని తెలంగాణ రక్షణ సేన నేతలు పేర్కొంటున్నారు. ఇది ఇలా ఉంటే తమ పార్టీ ఎదుగుదలను ఓర్వలేక భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నేతలే కావాలని తెరవెనుక ఉండి అడ్డుకుంటున్నారని కవిత వర్గం తీవ్రంగా ఆరోపిస్తోంది. ‘టీఆర్ఎస్’ సెంటిమెంట్ ఎక్కడ తమ చేతుల్లోంచి జారిపోతుందోనన్న భయంతోనే బీఆర్ఎస్ నేతలు ఈసీపై ఒత్తిడి తెస్తున్నారని, కావాలనే ఢిల్లీ వేదికగా తమపై దుష్ప్రచారం చేయిస్తున్నారని వారు మండిపడుతున్నారు.

Also read: Hyderabad: ఖరీదైన హౌసింగ్ మార్కెట్‌గా హైదరాబాద్.. దేశంలో మూడోది, ఆ రెండు నగరాల తర్వాత ఇక్కడే

న్యాయపోరాటానికి కవిత సిద్ధం!

Advertisement

ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసులు, ప్రత్యర్థుల రాజకీయ వ్యూహాలను ఎదుర్కోనేందుకు కవిత సైతం సన్నద్ధమవుతున్నారు. ఈసీ లేఖకు ఇప్పటికే ప్రాథమిక సమాధానం పంపిన ఆమె.. పేరు మార్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. తెలంగాణ రక్షణ సేన పార్టీగానే కొనసాగుతుందని కవిత స్పష్టం చేశారు. ఒకటి రెండు అభ్యంతరాలను సాకుగా చూపి మొత్తం ప్రక్రియను నిలిపివేయడం సరికాదని పార్టీ లీగల్ టీమ్ సేతం పేర్కొంటోంది. ఈ విషయంలో అవసరమైతే ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి, న్యాయపోరాటం చేయడానికి కవిత సన్నాహమవుతున్నారు. ఢిల్లీలోని ప్రముఖ లీగల్ నిపుణులతో ముసాయిదాను కూడా సిద్ధం చేయిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది ఫిబ్రవరిలో తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ జాగృతి, తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రాష్ట్ర జాగృతి, తెలంగాణ ప్రజాశక్తి పేర్లను ఈసీకి ప్రతిపాదించారు. తెలంగాణ రాష్ట్ర సేన పేరును రక్షణ సేనగా మార్చడంపై విమర్శలు వచ్చాయి.

రాజకీయాల్లో హాట్ టాపిక్‌..

ఉద్యమ కాలం నాటి ‘టీఆర్ఎస్’ అనే మూడక్షరాల సెంటిమెంట్ చుట్టూ తిరుగుతున్న ఈ రాజకీయ రచ్చ.. ఈసీ నోటీసులతో మరింత క్లిష్టంగా మారింది. కవిత ఈ లీగల్ బ్యాటిల్‌లో ఎలా గెలుపొందుతారనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఏది ఏమైనప్పటికీ కవిత ఈ మూడు అక్షరాల సెంటిమెంట్ ను కాపాడుకుంటుందా? లేక మరో పేరును తెరమీదకు తెస్తుందా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. చర్చకు కవిత ఎలా ఫుల్ స్టాప్ పెడుతుందో చూడాలి. ఇది కవిత రాజకీయానికి సైతం సవాల్ గా మారింది.

Also read: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. జూలై 6, 7 తేదీల్లో ఆ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్

Related News

హైదరాబాద్‌లో ‘సర్’ అస్తవ్యస్తం.. పది రోజులు గడిచినా అందని ఓటరు ఫారాలు!

Hyderabad Metro: ఢిల్లీ కేంద్ర మంత్రులకు.. సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

పదవులు ఉన్నా లేకున్నా రాహుల్ గాంధీ గెలుపే నా లక్ష్యం – రాజగోపాల్ రెడ్డి

Beri Eshwar: నువ్వు నోటీస్ ఇస్తే.. నేను వివరణ ఇవ్వాలా.. డీసీసీ ప్రెసిడెంట్‌పై మాజీ సర్పంచ్ ఫైర్!

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. జూలై 6, 7 తేదీల్లో ఆ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్

jangaon: కేటీఆర్ టూర్‌లో అపశ్రుతి.. కాన్వాయ్‌లో ఢీ కొన్న రెండు కార్లు, ఎమ్మెల్సీకి గాయాలు

కోట్ల విలువైన మత్తు… ఒక్క క్షణంలో బూడిద! సైబరాబాద్ పోలీసుల బిగ్ ఆపరేషన్

Big Stories

Advertisement
×