RK Roja: రోజా సెల్వమణి.. ఆమె పేరు వినని వారుండరు. సినిమాల్లో కానీ, రాజకీయాల్లో కానీ.. రోజా ఒక ఫైర్ బ్రాండ్. ముఖ్యంగా సినిమాల్లో.. స్టార్ హీరోలందరితోనూ కలిసి నటించి.. తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. అప్పట్లో రోజా డ్యాన్స్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు. అందం, అభినయం కలబోసిన నటీమణుల్లో రోజా కూడా ఒకరు. అయితే తనకున్న ఈ మంచిపేరును ఆమె రాజకీయాల్లోకి వచ్చి పాడుచేసుకుంది అనేది చాలామంది మాట.
రాజకీయాల్లో వివాదాలు, విమర్శలు, ట్రోల్స్.. ఇలా అన్ని వస్తూ ఉంటాయి. వాటిని పట్టించుకోకుండా రోజా ఎమ్మెల్యే నుంచి మంత్రిగా మారింది. మంత్రి అయిన తరువాత రోజా పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యింది. జబర్దస్త్ లో జడ్జిగా కూడా చేయడం మానేసింది.
ఇక అధికారంలో ఉన్నప్పుడు.. ఎప్పుడు టీడీపీ, జనసేన నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసి ట్రెండింగ్ లో ఉండే రోజా.. ఇప్పుడు అధికారంలో లేకపోవడంతో తన హవాను కొంత తగ్గించింది. ఫ్రీగా ఉండడంతో.. ఈ మధ్యనే రోజా ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది.
Vijay Tamannaah marriage: పెళ్లి ముహూర్తం పిక్స్.. త్వరలో ఏడడుగులు వేయనున్న మిల్క్ బ్యూటీ..!
ఈ ఇంటర్వ్యూలో మునుపెన్నడూ లేని విధంగా తన మనోగతాన్ని మొత్తం ఇందులో చెప్పుకొచ్చింది. తన కెరీర్, రాజకీయ జీవితం, ఎదుర్కున్న విమర్శలు, ట్రోల్స్.. ఇలా ఒకటని కాదు. అన్ని విషయాలు రోజా ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
ఇక ఇందులోనే తన కొడుకు టాలీవుడ్ ఎంట్రీ గురించి కూడా మాట్లాడి షాక్ ఇచ్చింది. రోజా.. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే తమిళ్ డైరెక్టర్ సెల్వమణి ని వివాహమాడింది. వీరికి ఇద్దరు పిల్లలు. అన్షు మాలిక, కౌశిక్. కూతురు అన్షు.. అచ్చు రోజాకు జిరాక్స్ కాపీ అయితే.. కౌశిక్ తండ్రి సెల్వమణి జిరాక్స్. మొదటి నుంచి కూడా అన్షు టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమవుతుందని అనుకున్నారు. కానీ, రోజా మాత్రం తన కొడుకు కౌశిక్ కు ఇండస్ట్రీకి వెళ్లాలని కోరికగా ఉందని తెలిపి షాక్ ఇచ్చింది.
Bigg Boss 8 Telugu Elimination: డేంజర్ జోన్‌లో కన్నడ బ్యాచ్.. ఫైనల్‌గా బిగ్ బాస్ 8 నుండి యష్మీ ఔట్
” నా కొడుకు కౌశిక్. ఆరడుగుల హైట్ ఉంటాడు. వయస్సు 18 ఏళ్లు. ప్రస్తుతం చదువుకుంటున్నాడు. చదువు కంటే ఎక్కువగా వాడికి సినిమాలు అంటే ఆసక్తి. అప్పుడప్పుడు నా దగ్గరకు వచ్చి నేను సినిమాల్లో నటిస్తాను అని చెప్తాడు. అంతేకాకుండా డైరెక్షన్ లో కూడా ఇంట్రెస్ట్ అంటారు. వాడికి ఆ రెండు రంగాల్లో ఎందులో స్థిరపడాలని ఉంటే అందులోనే ఎంకరేజ్ చేస్తాం. దేవుడి ఆశీస్సులు ఉంటే ఇండస్ట్రీలోకి వస్తాడు” అని చెప్పుకొచ్చింది. అయితే త్వరలోనే రోజా కొడుకు ఎంట్రీ కూడా ఉండబోతుందని తెలుస్తోంది. మరి మాజీ మంత్రి రోజా కుమారుడిని తెలుగుతెరకు పరిచయం చేసే అదృష్టం ఏ దర్శకుడికి దక్కుతుందో చూడాలి.