E-Paper
Advertisement

Crease-less Foldable phone: ఫోల్డెబుల్ ఫోన్స్‌లో విప్లవం.. శాంసంగ్ కొత్త టెక్నాలజీ చూసి అందరూ షాక్

Crease-less Foldable phone: ఫోల్డెబుల్ ఫోన్స్‌లో విప్లవం.. శాంసంగ్ కొత్త టెక్నాలజీ చూసి అందరూ షాక్
Advertisement

Samsung Crease-less Foldable phone| సాధారణ స్మార్ట్‌ఫోన్స్ కంటే ఫోల్డబుల్ ఫోన్లలో పెద్ద స్క్రీన్ ఉంటుంది. కానీ, మధ్యలో కనిపించే క్రీజ్ (మడత గీత) వల్ల.. ఆ ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ పోతుంది లేదా తగ్గిపోతుంది. చాలా మంది యూజర్లు పెద్ద డిస్‌ప్లేని ఇష్టపడతారు కానీ ఈ క్రీజ్ వల్ల ఇబ్బంది పడతారు. ఇది ఫోల్డబుల్ ఫోన్లలో అతిపెద్ద సమస్యగా ఉంది.

ఫోల్డబుల్ ఫోన్ మార్కెట్‌లో శాంసంగ్ ఆధిపత్యం

శాంసంగ్ చాలా సంవత్సరాలుగా ఫోల్డబుల్ ఫోన్లలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ సిరీస్ ఫోల్డబుల్స్‌ను సాధారణ ప్రజలకు చేరువ చేసింది. అయితే, ఇప్పటి వరకు ఏ మోడల్‌లోనూ క్రీజ్ పూర్తిగా తొలగిపోలేదు. లేటెస్ట్ ఫోల్డ్ మోడల్స్‌లో కూడా క్రీజ్ కనిపిస్తుంది. ఇటీవల సామ్సంగ్ చూపించిన ట్రై-ఫోల్డ్ డివైస్‌లో కూడా క్రీజ్ గీతలు ఉన్నాయి. ఇది శాంసంగ్ భవిష్యత్ టెక్నాలజీపై ప్రశ్నలు లేవనెత్తింది.

CES 2026లో పెద్ద హైలైట్

Advertisement

CES 2026లో శాంసంగ్ డిస్‌ప్లే కొత్త ఫోల్డబుల్ OLED ప్యానెల్ చూపించింది. ఈ కొత్త ప్యానెల్‌ని “నియర్ క్రీజ్-లెస్” (దాదాపు క్రీజ్ లేని) అని పేరు పెట్టింది. ఫోన్ పూర్తిగా ఓపెన్ చేసినప్పుడు మధ్యలో గీత దాదాపు కనిపించదు. ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్.. దీన్ని గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8కి ఉపయోగిస్తారని అంచనా వేస్తున్నారు. ఈ టెక్నాలజీతో క్రీజ్ దాదాపు అదృశ్యమవుతుంది. శాంసంగ్ ఈ డిస్‌ప్లేను సాధారణ ఫోల్డబుల్ ఫోన్లలో తీసుకొస్తుంది.

క్రీజ్ ఎలా తగ్గించారు?

పాత ఫోల్డబుల్ స్క్రీన్లలో ప్లాస్టిక్ సపోర్ట్ లేయర్ ఉండేది. మడత వేసినప్పుడు ఒకే గీతపై ఒత్తిడి పడేది. దానివల్ల కాలక్రమేణా క్రీజ్ గట్టిగా కనిపించేది. అయితే ఇప్పుడు శాంసంగ్ పూర్తిగా కొత్త డిజైన్ తీసుకొచ్చింది. కొత్త ఫోల్డెబుల్ ఫోన్‌లో స్క్రీన్ కింద మెటల్ సపోర్ట్ ప్లేట్ ఉపయోగించింది. ఈ కొత్త టెక్నాలజీ వల్ల డిస్‌ప్లే తెరిచినప్పుడు.. ఆ ఒత్తిడి స్క్రీన్ మొత్తం వ్యాపిస్తుంది. అలాగే మల్టీ-లేయర్ స్క్రీన్ డిజైన్‌తో స్క్రీన్ సహజంగా బెండ్ అవుతుంది. దీనివల్ల ఓపెన్ చేసినప్పుడు స్క్రీన్ చాలా ఫ్లాట్‌గా కనిపిస్తుంది. అంటూ క్రీజ్ పూర్తిగా తొలగిపోలేదు కానీ చాలా తక్కువగా కనిపిస్తుంది.

ఆప్టికల్ మెటీరియల్స్‌తో మరింత మెరుగు

Advertisement

శాంసంగ్ ఆప్టికల్ క్లియర్ అడెసివ్ లేయర్‌ను అప్‌గ్రేడ్ చేసింది. ఈ కొత్త అడెసివ్ ఫోల్డ్ ఏరియాలో లైట్ రిఫ్లెక్షన్‌ను తగ్గిస్తుంది. సాధారణ లైటింగ్‌లో కూడా క్రీజ్ దాగిపోతుంది. ఇది సాఫ్ట్‌వేర్ ట్రిక్ కాదు, పూర్తి హార్డ్‌వేర్ మార్పు.

గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 ఫీచర్స్ (అంచనా)

రిపోర్టుల ప్రకారం గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8లో ఈ కొత్త ప్యానెల్ ఉంటుంది. మెయిన్ డిస్‌ప్లే సుమారు 8 అంగుళాలు, కవర్ డిస్‌ప్లే 6.5 అంగుళాలు ఉండవచ్చు. రెండు డిస్‌ప్లేలు 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తాయి. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ ఉండవచ్చు. ఇది 2nm ఆర్కిటెక్చర్‌తో వస్తుంది. కెమెరాలో 200MP మెయిన్ కెమెరా ఉండవచ్చు. బ్యాటరీ 5,000mAh వరకు పెరగవచ్చు (మునుపటి మోడల్ 4,400mAh).

Also Read: మొబైల్ ఫోన్ చోరీ అయిందా? వెంటనే ఇలా చేస్తే తిరిగి వస్తుంది

లాంచ్ టైమ్‌లైన్

శాంసంగ్ సాధారణంగా ఫోల్డబుల్స్‌ను జులైలో లాంచ్ చేస్తుంది. కాబట్టి గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 2026 ద్వితీయార్థంలో అంటే జూలై నుంచి డిసెంబర్ మధ్య కాలంలో విడుదల కాబోతోంది. ఈ క్రీజ్-లెస్ టెక్నాలజీ వస్తే ఫోల్డబుల్ మార్కెట్ పూర్తిగా మారిపోతుంది. శాంసంగ్, ఆపిల్ మధ్య పోటీ మరింత ఆసక్తికరంగా మారుతుంది. నిజమైన క్రీజ్-ఫ్రీ ఫోల్డబుల్ ఎవరు ముందుగా లాంచ్ చేస్తారో చూడాలి!

Related News

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

Big Stories

Advertisement
×