Sanchar Saathi Stolen Phones| టెలికాం విభాగానికి చెందిన సంచార్ సాథి ప్లాట్‌ఫామ్ 20 లక్షలకు పైగా కోల్పోయిన లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను సమర్థవంతంగా ట్రేస్ చేసిందని టెలికమ్యూనికేషన్స్ మంత్రి చంద్ర శేఖర్ పెమ్మసాని ఇటీవల తెలిపారు. ఈ ప్లాట్‌ఫామ్ డేటా ప్రకారం.. ప్రభుత్వం 33.5 లక్షల మొబైల్ ఫోన్లను బ్లాక్ చేసింది. దీంతో పాటు 20.28 లక్షల హ్యాండ్‌సెట్లను గుర్తించింది.
సంచార్ సారథి మోసపూరిత మొబైల్ కనెక్షన్ల గురించి తెలియజేయడం, వాటిని బ్లాక్ చేయడం ద్వారా కోల్పోయిన లేదా దొంగిలించబడిన ఫోన్లను తిరిగి పొందడంలో కీలక పాత్ర పోషించిందని మంత్రి పెమ్మసాని చెప్పారు. మొబైల్ కనెక్షన్ ఫ్రాడ్ నివారణపై టెలికాం విభాగం నిర్వహించిన రివ్యూ మీటింగ్ తర్వాత, సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ద్వారా సురక్షితమైన, పౌర కేంద్రీకృత డిజిటల్ వ్యవస్థను నిర్మించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు.
సమావేశంలో జరిగిన చర్చల గురించి మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. కోల్పోయిన మొబైల్ ఫోన్ల సగటు రికవరీ రేటు 22.9 శాతం అని, 4.64 లక్షల హ్యాండ్‌సెట్లు వాటి యజమానులకు తిరిగి అందించబడ్డాయని మంత్రికి తెలియజేయబడింది. పౌరులు తమ కోల్పోయిన లేదా దొంగిలించబడిన ఫోన్లను బ్లాక్ చేయడానికి, తిరిగి పొందడానికి వాటి గురించి నివేదించడానికి, అలాగే మోసపూరిత కాల్స్ గురించి ఫిర్యాదులు చేయడానికి, వారి పేరుతో జారీ చేయబడిన తప్పుడు కనెక్షన్లను నివేదించడానికి సంచార్ సాథి ప్లాట్‌ఫామ్ అనుమతిస్తుంది.
సంచార్ సాథి పోర్టల్‌ను ఎలా ఉపయోగించాలి?
Also Read: అలెక్సా అన్నీ వింటోంది.. ఇంట్లో స్మార్ట్ డివైజ్‌లుంటే ఈ జాగ్రత్తలు పాటించండి
సంచార్ సాథి పోర్టల్ ద్వారా మీ పేరుతో జారీ చేయబడిన మొబైల్ కనెక్షన్లను తనిఖీ చేయవచ్చు మరియు అనవసరమైన లేదా అనధికార కనెక్షన్లను రిపోర్ట్ చేయవచ్చు. ఇది మీ డిజిటల్ భద్రతను పెంచడానికి మరియు మోసాలను నివారించడానికి సహాయపడుతుంది.