E-Paper
Advertisement

తప్పు నంబర్‌కు రీఛార్జ్ చేశారా? టెన్షన్ వద్దు.. ఇలా చేస్తే డబ్బు రిఫండ్!

తప్పు నంబర్‌కు రీఛార్జ్ చేశారా? టెన్షన్ వద్దు.. ఇలా చేస్తే డబ్బు రిఫండ్!
Advertisement

Recharge Refund: మెుబైల్ ఫోన్ రీఛార్జ్ చేసేటప్పుడు కొందరు పొరపాటున ఏదోక సందర్భంలో వేరే నెంబర్ కు రీఛార్జ్ చేసే ఉంటారు. ఆ సందర్భాల్లో అవతలికి వ్యక్తికి ఈ విషయం తెలియజేసి.. డబ్బులు పంపమని అడిగితే అటు నుంచి సరైన స్పందన రాక నిరాశకు గురై కూడా ఉంటారు. అయితే ఈ సమస్యకు చెక్ పెడుతూ ప్రముఖ టెలికాం సంస్థలు జియో, ఎయిర్ టెల్.. కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి. పొరపాటున చేసి రీఛార్జ్ మెుత్తాన్ని తిరిగి రిటర్న్ చేసే వెసులుబాటును కల్పిస్తున్నాయి.

జియో యూజర్లు ఏం చేయాలంటే?

మీరు ‘మైజియో’ (MyJio) యాప్ ద్వారా తప్పు నెంబర్‌కు రీఛార్జ్ చేసి ఉంటే.. ఆ లావాదేవీని రద్దు చేసే అవకాశాన్ని జియో కల్పిస్తోంది. అయితే ఈ సదుపాయం కేవలం మైజియో యాప్ ద్వారా చేసిన రీఛార్జ్‌లకు మాత్రమే వర్తించనుంది. గూగుల్ పే, ఫోన్‌పే లేదా ఇతర థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా చేసిన రీఛార్జ్‌లకు ఇది వర్తించదు. అయితే మైజియో యాప్ లో రీఛార్జ్ చేసిన వెంటనే రివర్సల్ రిక్వెస్ట్ పంపాల్సి ఉంటుంది. నివేదికల ప్రకారం ఈ ఆప్షన్ రీఛార్జ్ చేసిన సుమారు 3 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

మైజియోలో రిఫండ్ ఎలా పొందాలి?

Advertisement

పొరపాటున జరిగిన రీఛార్జ్‌ను రద్దు చేయడానికి ముందుగా మైజియో యాప్‌ను ఓపెన్ చేసి లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత ‘ట్రాన్సాక్షన్ హిస్టరీ’ విభాగానికి వెళ్లి ఇటీవల చేసిన రీఛార్జ్‌ను ఎంచుకోవాలి. అక్కడ రీఛార్జ్ రద్దు చేసుకునే అవకాశం ఉంటే ‘క్యాన్సిల్ ప్లాన్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి తగిన కారణాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. తర్వాత రిఫండ్ విధానాన్ని సెలెక్ట్ చేసుకుని సబ్‌మిట్ చేస్తే సరిపోతుంది. మీ రిక్వెస్ట్ ను జియో ఆమోదించిన తర్వాత మీరు చెల్లించిన ఖాతాలోకి డబ్బులు జమ తిరిగి అవుతాయి.

Also Read: బయటకొచ్చిన వైసీపీ కాక్రోచ్‌లు.. రోడ్లపై నిరాహార దీక్షలు.. ఎక్కడో కొడుతోంది శీనా..!

ఎయిర్‌టెల్ యూజర్లు సంగతేంటి?

Advertisement

ఎయిర్ టెల్ యూజర్లు అయితే రీఛార్జ్ ‘ఎయిర్‌టెల్ థాంక్స్’ (Airtel Thanks) యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. లేదంటే 121 లేదా 198 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి కూడా సహాయం పొందొచ్చు. యాప్ ద్వారా చేయాలనుకుంటే ‘హెల్ప్ & సపోర్ట్’ సెక్షన్‌కి వెళ్లి ‘ఫేసింగ్ ఇష్యూ విత్ రీసెంట్ రీఛార్జ్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత ‘రాంగ్ & యాక్సిడెంటల్ రీఛార్జ్’ లేదా ‘రాంగ్ రీఛార్జ్ రివర్సల్’ ను సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ మీ ట్రాన్సాక్షన్ ఐడీ, రీఛార్జ్ తేదీ, తప్పుగా నమోదు చేసిన మొబైల్ నెంబర్ వివరాలను నమోదు చేసి సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఎయిర్‌టెల్‌లో డబ్బులు వెనక్కి రావడమనేది అవతలి వ్యక్తి ఆ రీఛార్జ్ ప్లాన్‌ను ఉపయోగించారా? లేదా? అనే దానిపై ఆధారపడి ఉంటుందని సమాచారం.

Also Read: BSNL మరో పిచ్చేక్కించే ప్లాన్.. రూ.1,499తో 300 రోజులు ఫుల్ హ్యాపీ.. ఇది చాలా చౌక గురూ!

Tags

Related News

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్.. హాఫ్ ప్రైస్‌కే బెస్ట్ ట్యాబ్స్! డోంట్ మిస్

చావుదెబ్బ కొట్టిన Airtel.. మీకిష్టమైన బడ్జెట్ ప్లాన్ డిలీట్.. తెరపైకి మరో చౌకైన రీఛార్జ్!

ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్.. భారీగా తగ్గిన Samsung Galaxy S25 FE ధర.. ఆఫర్ వివరాలు ఇవే!

భారీ బ్యాటరీ, ఉచితంగా క్లౌడ్ స్టోరేజ్.. భారత్‌లో విడుదలైన Vivo S2 ఫోన్ పూర్తి వివరాలు!

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌లో.. టీవీలపై భారీ తగ్గింపు, అస్సలు మిస్ కాకూడని టాప్ డీల్స్!

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026..ఈ 5 మోడల్స్‌పై కళ్లుచెదిరే డిస్కౌంట్ !

ఛార్జింగ్ కేబుల్స్ మురికిగా మారాయా? ఈ సింపుల్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!

Big Stories

Advertisement
×