E-Paper
Advertisement

స్మార్ట్‌వాచ్ వెనుక ఆకుపచ్చ లైట్ ఎందుకు వెలుగుతుందో తెలుసా? అసలు కారణం ఇదే!

స్మార్ట్‌వాచ్ వెనుక ఆకుపచ్చ లైట్ ఎందుకు వెలుగుతుందో తెలుసా? అసలు కారణం ఇదే!
Advertisement

Smartwatch Green Light: ఈ రోజుల్లో స్మార్ట్ వాచ్ వినియోగం బాగా పెరిగిపోయింది. అయితే డిజిటల్ వాచ్ ను ఉపయోగిస్తున్నప్పుడు దానికి కింది భాగంలో ఆకుపచ్చని కాంతి వెలుగుతుండటం చాలా మంది గమనించే ఉంటారు. కొన్నిసార్లు ఈ వెలుగు బల్బ్ లాగా అలాగే ఉంటే.. మరికొన్నిసార్లు బ్లింక్ అవుతూ ఉంటుంది. అసలు ఈ ఆకుపచ్చ లైట్ ఎందుకు? ఇది ఏం చేస్తుంది? వంటి విశేషాలను ఈ కథనంలో చూద్దాం.

హార్ట్ బీట్ పసిగట్టే ఆప్టికల్ సెన్సార్

స్మార్ట్‌వాచ్‌ వెనుక భాగంలో వెలిగే ఈ ఆకుపచ్చ కాంతి ముఖ్య ఉద్దేశం గుండె వేగాన్ని సరిగ్గా నమోదు చేయడమే. దీని కోసం వాచ్ వెనుక భాగంలో ఒక ‘ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్’ను అమర్చుతారు. స్మార్ట్‌వాచ్ ధరించినప్పుడు ఈ సెన్సార్ మణికట్టు చర్మంపైకి ఆకుపచ్చ కాంతిని పంపుతుంది. ఆ కాంతిలో ఎంత భాగం చర్మంలోకి ఇంకిపోతోంది, ఎంత భాగం తిరిగి పరావర్తనం (రిఫ్లెక్ట్) చెందుతోందో సెన్సార్ నిశితంగా కొలుస్తుంది.

రక్త ప్రసరణ ఆధారంగా పల్స్ లెక్కింపు

Advertisement

శరీరంలో ప్రవహించే రక్తం ఈ ప్రక్రియలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. గుండె కొట్టుకున్న ప్రతిసారీ ధమనుల్లో రక్త ప్రసరణ ఒక్కసారిగా పెరిగి, ఆ తర్వాత తగ్గుతుంది. రక్తం పరిమాణంలో వచ్చే ఈ మార్పుల వల్ల చర్మం గ్రహించే, తిరిగి పంపే కాంతి పరిమాణంలో కూడా సూక్ష్మమైన వ్యత్యాసాలు వస్తాయి. స్మార్ట్‌వాచ్ సెన్సార్ ఈ చిన్న మార్పులను గుర్తుపట్టి దాని ఆధారంగా గుండె నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుందో అంచనా వేస్తుంది. ఈ మొత్తం సాంకేతిక ప్రక్రియను సైంటిఫిక్ పరిభాషలో ‘పీపీజీ’ (Photoplethysmography) అని పిలుస్తారు.

గ్రీన్ లైట్‌లో ఎందుకీ తేడాలు?

స్మార్ట్‌వాచ్‌లోని ఆకుపచ్చ కాంతి ఎల్లప్పుడూ ఒకేలా వెలగదు. కొన్నిసార్లు బల్బ్ లా వెలుగుతూ ఉంటే, మరికొన్నిసార్లు ఆగుతూ ఆగుతూ మెరుస్తుంది. స్మార్ట్‌వాచ్ అన్ని వేళలా ఒకే రీతిలో హార్ట్ రేట్‌ను పర్యవేక్షించకపోవడమే దీనికి కారణం. నడవడం, పరిగెత్తడం, వ్యాయామం చేయడం వంటి శారీరక శ్రమ చేస్తున్నప్పుడు గుండె వేగంలో వేగంగా మార్పులు వస్తుంటాయి. అలాంటప్పుడు నిరంతర రీడింగ్స్ అవసరం కాబట్టి సెన్సార్ ఎక్కువ సేపు ఆన్ అయి ఉంటుంది. సాధారణ విశ్రాంతి సమయంలో మాత్రం నిర్ణీత వ్యవధిలో మాత్రమే లైట్ వెలుగుతూ రీడింగ్స్ తీసుకుంటుంది.

ఎరుపు, ఇన్‌ఫ్రారెడ్ కాంతుల సంగతేంటి?

Advertisement

హెల్త్ ట్రాకింగ్ కోసం స్మార్ట్‌వాచ్‌లు కేవలం ఆకుపచ్చ కాంతిపైనే ఆధారపడవు. రక్తంలో ఆక్సిజన్ శాతాన్ని (SpO2) కొలవడానికి కొన్ని ప్రత్యేకమైన సెన్సార్లు, ఇతర రకాల కాంతులను ఉపయోగిస్తాయి. అందుకే కొన్ని స్మార్ట్‌వాచ్‌ల వెనుక భాగంలో ఆకుపచ్చతో పాటు ఎరుపు లేదా ఇన్‌ఫ్రారెడ్ కాంతులు కూడా వెలగడం చూడవచ్చు. అంటే వాచ్ వెనుక కనిపించే ప్రతి లైట్ వేర్వేరు హెల్త్ ట్రాక్స్ కోసం పనిచేస్తుందన్నమాట.

Also Read: రైలు ప్రయాణంలో ఆధార్ మర్చిపోయారా? టెన్షన్ వద్దు.. స్మార్ట్ ఫోన్ ఉంటే అంతా సెట్టు!

ఈ కాంతి వల్ల చర్మానికి ప్రమాదమా?

అయితే స్మార్ట్‌వాచ్‌ నుంచి వచ్చే ఈ ఆకుపచ్చ కాంతి వల్ల చర్మంతో శరీరానికి ఎలాంటి సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు. సెన్సార్ రీడింగ్స్ కోసం ఉద్దేశించిన అత్యంత తక్కువ పవర్ కలిగిన ఎల్‌ఈడీ లైట్ మాత్రమేనని తెలియజేస్తున్నారు. అయితే వాచ్‌ను నిరంతరం ధరించడం వల్ల మణికట్టుపై ఎర్రటి మచ్చలు, దురద లేదా ఏదైనా అసౌకర్యం అనిపిస్తే కొంతసేపు వాచ్ తొలగించడం మంచిదని హితవు పలుకుతున్నారు. చాలామందిలో ఈ సమస్యలు.. కాంతి వల్ల కాకుండా ఎక్కువ సమయం వాచ్ ధరించడం, చెమట పట్టడం వల్ల మాత్రమే వస్తున్నట్లు స్పష్టం చేశారు.

Also Read: పెన్ డ్రైవ్‌పై ఈ రంధ్రాల సీక్రెట్ తెలుసా? దీనివల్ల ఇన్ని లాభాలా? ఇన్నాళ్లు తెలియలేదే!

Tags

Related News

పాత ఫోన్ వేస్ట్ అనుకుంటే పొరపాటే..ఇలా వాడితే ఎన్నో లాభాలు!

పాన్ కార్డ్ ఫోటో లేదా సిగ్నేచర్ మార్చుకోవాలా?

యూపీఐ పేమెంట్స్ చేసేటప్పుడు..ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

రీఛార్జ్ టెన్షన్ వద్దు..ఒక్క క్లిక్‌తో 1000+టీవీ ఛానెళ్లు ఫ్రీ!

మరుగుతున్న నీటిలో పడినా పాడవ్వదు..8100mAh బ్యాటరీతో హానర్ సరికొత్త అద్భుతం!

ఏఐ మోసాలకు చెక్ పెట్టే టెక్నాలజీ..గూగుల్,ఆపిల్ ఫోన్లలోని అద్భుతమైన సేఫ్టీ ఫీచర్లు!

వాట్సాప్‌లో.. ఈ 5 సెట్టింగ్‌లను పొరపాటున కూడా మరవొద్దు!

Big Stories

Advertisement
×