E-Paper
Advertisement

పాత ఏసీ రిపేరా? కొత్తది కొనాలా? ఈ ‘3’ విషయాలు మర్చిపోకండి!

పాత ఏసీ రిపేరా? కొత్తది కొనాలా? ఈ ‘3’ విషయాలు మర్చిపోకండి!
Advertisement

Air Conditioner: అధిక ఉష్ణోగ్రతల సమయంలో ఇంట్లో ఏసీ సరిగ్గా పనిచేయకపోతే వచ్చే విసుగు అంతా ఇంతా కాదు. పాత ఏసీ పదే పదే రిపేరుకు రావడం, ఆశించిన స్థాయిలో చల్లదనం ఇవ్వకపోవడంతో చాలామంది కొత్త ఏసీ కొనేయాలని నిర్ణయించుకుంటారు. అయితే కొత్త ఏసీ కొనే ముందు పాత ఏసీని మార్చాల్సిన అవసరం ఉందా? అని నిర్ధారించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మూడు అతి ముఖ్యమైన విషయాలను పరిశీలించాలని హితవు పలుకుతున్నారు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

40 శాతం రూల్

చాలామంది ఏసీ రిపేరుకు రాగానే కంగారుపడి కొత్తది కొనేస్తుంటారు. కానీ ఇక్కడే తమకు తాము ఓ లెక్క వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏసీ కంప్రెసర్ లేదా మరేదైనా పెద్ద విడిభాగం పాడైపోయినప్పుడు దాన్ని బాగుచేయడానికి అయ్యే ఖర్చు.. ఒక కొత్త ఏసీ ధరలో 40 శాతానికి సమానమైతే అప్పుడు కొత్తది తీసుకోవడం తెలివైన పని అంటున్నారు. ఉదాహరణకు ఏసీ రిపేర్ ఖర్చు రూ.15-20 వేలు అవుతుంటే పాత మిషన్ మీద అంతపెట్టడం వేస్ట్ అని నిపుణులు పేర్కొంటున్నారు. ఒకవేళ ఒకవేళ రిపేరు ఖర్చు చాలా తక్కువగా ఉంటే దాన్నే బాగు చేయించుకుని మరికొంత కాలం వాడుకోవచ్చని హితవు పలుకుతున్నారు.

ఏసీ వయస్సు ఎంత?

Advertisement

సాధారణంగా మంచి బ్రాండెడ్ ఏసీ జీవితకాలం 8 నుంచి 10 ఏళ్లు ఉంటుంది. ఏసీ కొని పదేళ్లు దాటిపోతే అది టెక్నాలజీ పరంగా పాతబడిపోతుందని నిపుణులు అంటున్నారు. దీనికి తోడు పాత ఏసీలు ఎక్కువ విద్యుత్‌ను వినియోగిస్తాయని పేర్కొంటున్నారు. ఒకవేళ ఏసీ కొని 5 ఏళ్ల లోపే అయ్యి.. చిన్న చిన్న సమస్యలు వస్తుంటే సర్వీసింగ్ లేదా గ్యాస్ లీకేజీ సమస్య కావచ్చని నిపుణులు అంటున్నారు. అంతమాత్రానికే కొత్త ఏసీ అవసరం లేదని పేర్కొంటున్నారు. ఒకవేళ ఏసీ కొని 10 ఏళ్లు మాత్రం గుడ్ బై చెప్పడమే బెస్ట్ స్పష్టం చేస్తున్నారు.

Also Read: ఏసీలో ‘ఆటో మోడ్’ ఉందా? వర్షాకాలంలో కెవ్వు కేక.. అదృష్టమంటే మీదే!

కరెంట్ బిల్లుల మోత?

Advertisement

పాత ఏసీల వల్ల వచ్చే ప్రధాన సమస్య కరెంట్ బిల్లు. కాలం గడిచేకొద్దీ ఏసీలోని కంప్రెసర్ సామర్థ్యం తగ్గిపోతుంది. దీనివల్ల గదిని చల్లబరచడానికి అది ఎక్కువ సమయం శ్రమించాల్సి వస్తుంది. ఫలితంగా ఇంటి కరెంట్ బిల్లు దారుణంగా పెరిగిపోతూ ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో 4-స్టార్, 5-స్టార్ రేటింగ్ ఉన్న లేటెస్ట్ ఇన్వర్టర్ ఏసీలు అందుబాటులో ఉన్నాయి. ఇవి పాత ఏసీలతో పోలిస్తే దాదాపు 30% నుండి 40% వరకు విద్యుత్‌ను ఆదా చేస్తాయి. నెలనెలా భారీగా కరెంట్ బిల్లులు కట్టే కంటే ఆ డబ్బును కొత్త ఏసీ ఇన్‌స్టాల్‌మెంట్‌ (EMI) రూపంలో పెట్టుబడిగా పెట్టడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: ఇస్త్రీ కష్టాలకు చెక్.. రూ.2,000 బడ్జెట్‌లో.. అత్యుత్తమ స్టీమర్స్ ఇవే!

Related News

నాయిస్ ఐకాన్ బజ్ స్మార్ట్‌వాచ్‌పై భారీ డిస్కౌంట్..వెంటనే కొనేయండి

Pixel 11 Pro Fold వచ్చేస్తోంది.. గూగుల్ రిలీజ్ చేసిన టీజర్ చూశారా? డిజైన్ అదిరిపోయింది!

అమెజాన్ సేల్‌లో బ్లాక్‌బస్టర్ ఆఫర్.. రూ.10,000 తగ్గిన Samsung Galaxy A56 5G ధర!

క్యాడ్లెక్ మల్టీషెఫ్ ప్రో.. క్షణాల్లోనే ఒకే డివైజ్‌తో 3 రకాల ఫుడ్స్ రెడీ

మ్యాప్స్ నుంచి నేరుగా ఫుడ్ ఆర్డర్, హోటల్ బుకింగ్.. గూగుల్ తెచ్చిన కొత్త AI అప్‌డేట్ చూశారా?

బిజినెస్ కోసం బెస్ట్ డీప్ ఫ్రీజర్ కావాలా? టాప్ 5 బ్రాండ్స్, ఫీచర్స్!

అమెజాన్ ఫ్రీడమ్ సేల్ 2026..సీసీ కెమెరాలపై భారీ డిస్కౌంట్లు!

ఏడాది వ్యాలిడిటీ నుండి ఇంటర్నేషనల్ రోమింగ్ వరకు.. Airtel బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ లిస్ట్!

Big Stories

Advertisement
×