Tamil Film Active Producers Association: అన్ని సినిమాలు అందరికీ నచ్చాలి అని రూల్ లేదు. అలానే చాలామంది ఫిలిం మేకర్స్ కి ప్రేక్షకులకి ఎటువంటి సినిమా నచ్చుతుంది అని అవగాహన కూడా ఉండదు. ఒకవేళ ఈ సినిమా చేస్తే వర్కౌట్ అవుతుంది అని అవగాహన ఫిలిం మేకర్స్ గా ఉంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అన్ని సూపర్ హిట్ సినిమాలే వస్తాయి. ఇప్పటివరకు ఒక ఫెయిల్యూర్ కూడా నేను డైరెక్టర్ అంటే ఎస్.ఎస్ రాజమౌళి అని చెప్పారు. అయితే అక్కడక్కడ ఎస్ ఎస్ రాజమౌళి సినిమాలను కూడా కామెడీ చేసే ఆడియన్స్ ఉన్నారు అని చెప్పాలి. ఇకపోతే ఒకప్పుడు సినిమా జెన్యూన్ టాక్ అది ఆడే రోజులు బట్టి తెలిసేది. కానీ ఇప్పట్లో ఒక సినిమా 50 రోజులు ఆడటం చాలా కష్టంగా మారింది. కేవలం నెలరోజులు వ్యవధి లోనే సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఇక సినిమా ఫస్ట్ షో పడగానే దాని గురించి టాక్ కూడా బయటకు వచ్చేస్తుంది.
ఒకప్పుడు ఒక సినిమా రివ్యూ తెలియాలి అంటే న్యూస్ పేపర్లో చదివి తెలుసుకునేవారు. అలానే రివ్యూ రాసే వాళ్ళు కూడా కన్స్ట్రక్టివ్ గా రాసేవాళ్ళు. కొంతమంది సినిమా దర్శకులు కూడా రివ్యూ చూసి తమ తప్పులను సరిదిద్దుకొని నేర్చుకున్న రోజులు కూడా ఉన్నాయి. కానీ ఈ రోజుల్లో రివ్యూ అనేది చదివే వాళ్ళ కంటే కూడా చెప్పే వాళ్ళు ఎక్కువైపోయారు అన్న కూడా అతిశయోక్తి కాదు. ఈరోజుల్లో సోషల్ మీడియా ఎంతగా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక సినిమా అవుతుండగానే ఆ సినిమాలోని హైలెట్స్ సోషల్ మీడియాలో దర్శనం ఇస్తాయి. అలానే ఆ సినిమాలోని మైనస్ పాయింట్స్ కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ ఉంటాయి. మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు తమ ఒపీనియన్ ను తెలియజేసి రివ్యూ అని ప్రేక్షకుల మీదకు రుద్దుతున్నారు.
మామూలుగా అసలైన ప్రేక్షకులకు ఈ రివ్యూలు తో సంబంధం లేదు. వాళ్లు ఖర్చుపెట్టిన టిక్కెట్టుకు న్యాయం జరిగిందా లేదా అని ఆలోచిస్తారు. చాలామంది ఊళ్ళలో ఉండే సినిమా ప్రేమికులకు రివ్యూల గురించి అసలు సంబంధం కూడా లేదు. ఇకపోతే రివ్యూలు అనేవి కొన్నిసార్లు చిన్న సినిమాలు కి ప్లస్ అవుతున్నాయి. బలగం, కమిటీ కుర్రోళ్ళు, ఆయ్ వంటి సినిమాలకు రివ్యూలు ప్లస్ అయ్యాయి. ఇంకొన్ని సినిమాలకు నెగిటివ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే మూవీ రిలీజ్ అయ్యాకా.. మూడు రోజుల పాటు రివ్యూలు రాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాలి అంటూ మద్రాస్ హై కోర్టులో కోలీవుడ్ నిర్మాతలు పిటిషన్ వేశారు. కానీ ఇది సాధ్యమయ్యే పని కాదు అని చాలామందికి తెలుస్తుంది. ఎందుకంటే టిక్కెట్ కొనుక్కొని సినిమా చూసి వ్యక్తికి తన అభిప్రాయాన్ని చెప్పే హక్కు కూడా ఉంటుంది. అందుకోసమే ఈ పిటిషన్ నిలవదు అంటూ చాలామందికి ఒక క్లారిటీ వచ్చింది. ఇక దీనితో తమిళ్ ఫిలిం ఇండస్ట్రీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
Also Read : Pushpa 2 Movie Story : రావు రమేష్ ను సీఎం చేయడమే పుష్ప రాజ్ లక్ష్యం